సెప్టెంబర్ 15 నుంచి 5 రోజులు బ్యాంకులకు సెలవులు

సెప్టెంబర్ 15 నుంచి 5 రోజులు బ్యాంకులకు సెలవులు రాబోతున్నాయి. నెల మారిందంటే ముందుగా బ్యాంకు ఖాతాదారులు అలర్ట్ అవుతారు. ఈ నెలలో ఎన్ని రోజులు బ్యాంకులు పనిచేస్తాయి..ఎన్ని రోజులు బ్యాంకులకు సెలవులు అనేవి చూస్తుంటారు. వాటిని బట్టి తమ బ్యాంకు పనులను చేసుకుంటుంటారు. అయితే సెప్టెంబర్ నెలలో ఇప్పటికే సగం రోజులు గడిచాయి.

ఈ నెలలో ఇంకా 15 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే ఈ 15 రోజుల్లో ఐదు రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. అంటే 15 రోజుల్లో 9 రోజులు మాత్రమే బ్యాంకులు పని చేయనున్నాయి. సెప్టెంబర్ నెలలో మొత్తం 13 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. అందులో 8 సెలవులు పూర్తయ్యాయి. మిగతా 5 సెలవులు ఈ 15 రోజులల్లో రాబోతున్నాయి. అవి ఎప్పుడు అనేది చూస్తే..

18 సెప్టెంబర్ – ఆదివారం
21 సెప్టెంబర్ – శ్రీ నారాయణ గురు సమాధి దివస్
24 సెప్టెంబర్ – నాలుగో శనివారం
25 సెప్టెంబర్ – ఆదివారం
26 సెప్టెంబర్ – నవరాత్రి స్థాపన