మహిళకు క్షమాపణలు చెప్పిన పోప్‌ ఫ్రాన్సిస్‌

గుంపు మధ్య నుంచి పోప్ చేయి పట్టుకున్న మహిళ

pope-francis
pope-francis

వాటికన్‌: తన చేతిని పట్టుకుని లాగిన మహిళపై ఆగ్రహం వ్యక్తం చేసిన క్రైస్తవ మత గురువు పోప్ ఫ్రాన్సిస్ తాజాగా ఆ మహిళకు క్షమాపణలు చెప్పారు. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా మంగళవారం వాటికన్ సిటీలోని పీటర్ స్క్వేర్‌లో పోప్.. చిన్నారులు, భక్తుల మధ్యలో నడుస్తూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో గుంపులోంచి ఓ మహిళ అకస్మాత్తుగా ఏదో అంటూ పోప్ చేయి పట్టుకుని తన వైపునకు లాగింది .ఈ హఠాత్ పరిణామానికి విస్తుపోయిన పోప్.. ఆ మహిళ చేసిన పనిపై ఆగ్రహం వ్యక్తం చేసి, సదరు మహిళ చేతిపై చిన్న దెబ్బ వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో స్పందించిన పోప్ తాను ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళకు బుధవారం క్షమాపణలు చెప్పారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/