శోభనం గదిలోనే మృతి చెందిన నవ వరుడు

పెళ్ళైన రెండో రోజే నవ వరుడు మృతి చెందిన ఘటన అన్నమయ్య జిల్లా , మదనపల్లె చంద్రా కాలనీలో చోటుచేసుకుంది. పెళ్లి హడావిడి ఇంకా పూర్తి కాలేదు..పెళ్ళికి వచ్చిన బంధువులు ఇంకా ఇంట్లోనే ఉన్నారు..ఈ క్రమంలో పెళ్లి కొడుకు చనిపోయాడనే వార్త ఆ కుటుంబ సభ్యుల్లో విషాదం నింపింది. శోభనం గదిలోనే వరుడు కన్నుమూయడం..ఆ పెళ్లి కూతురికి షాక్ ఇచ్చింది.

వివరాల్లోకి వెళ్తే..

మదనపల్లె చంద్రా కాలనీకి చెందిన యువతితో.. పాకాల మండల పత్తిపాటివారిపల్లికి చెందిన తులసి ప్రసాద్‌కు పెద్దల సమక్షంలో ఈ నెల 12( సోమవారం) పెళ్లి జరిగింది. వీరు తొలుత ప్రేమించుకోగా.. వారి ప్రేమను ఒప్పుకుని పెద్దలు పెళ్లి చేశారు. ఈ క్రమంలోనే పెళ్లి అనంతరం శోభనం తంతుకోసం తులసి ప్రసాద్ అత్తగారి ఇంటికి వెళ్లాడు. అయితే రాత్రి సమయంలో తులసి ప్రసాద్ ఉన్నట్టుండి అచేతనంగా పడిపోయాడు. ఉలుకు..పలుకు లేకపోవడంతో వధువు.. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతడు మృతి చెందినట్లు డాక్టర్స్ తెలిపారు. తులసి ప్రసాద్ మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. ఈ ఘటన తో ఋ గ్రామాల్లో విషాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. గుండెపోటుతో మరణించాడా..లేక మరేతర అనారోగ్య సమస్యలు ఉన్నాయా అనే కోణంలో విచారిస్తున్నారు.