పీవీ శతజయంతి ఉత్సవాల్లో మాజీ ఎంపి కవిత

పీవీ తన మేధస్సును దేశం కోసం ఉపయోగించారు

former-mp-kavitha

హైదరాబాద్‌: మాజీ ఎంపి కవిత అధ్యక్షతన సాహితీ సౌరభంఅసమాన దార్శనికత పేరుతో సమాలోచన సభ జరిగింది. ఈసందర్భంగా కవిత మాట్లాడుతూ.. తెలంగాణ ముద్దు బిడ్డ పీవీ నరసింహారావుకి దేశ అత్యుత్తమ పురస్కారం భారతరత్న ఇవ్వాలని కవిత కోరారు. దేశం క్లిష్టమైన పరిస్థితుల్లో ఉండగా పీవీ ప్రధాని పదవి చేపట్టారన్నారు. పీవీ సేవలను యువతరానికి తెలియజేసేలా రాష్ట్ర వ్యాప్తంగా శతజయంతి కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా తెలంగాణ జాగృతి నాయకులకు కవిత పిలుపునిచ్చారు.

పీవీ మేధస్సును, సాహిత్యాన్ని యువతరానికి చేరేలా తెలంగాణ జాగృతి, ప్రతినెలా రెండు కార్యక్రమాలు నిర్వహించనుందని కవిత ప్రకటించారు. ‘పీవీ బుక్ క్లబ్’ పేరుతో, ప్రాచీన పుస్తకం, నవీన పుస్తకం పేరుతో ప్రతి నెలా రెండు కార్యక్రమాలు నిర్వహించి, పీవీకి అక్షర నివాళి అందిస్తున్నామన్నారు. పీవీ తన మేధస్సును దేశం కోసం ఉపయోగించారని ఆమె పేర్కొన్నారు. రాజకీయాల్లో ప్రత్యర్థులు సైతం పొగిడేంత, హుందాతనంతో పీవీ వ్యవహరించారని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాల కమిటీ అధ్యక్షుడు కే.కేశవరావు, పీవీ తనయుడు ప్రభాకర్ రావు, కూతురు వాణిదేవి, రచయిత కల్లూరి భాస్కర్, టీఆర్ఎస్ ఎన్నారై సెల్ కన్వీనర్‌ మహేష్ బిగాల హాజరయ్యారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/