గణేశుడి చరిత్ర

ఆధ్యాత్మిక చింతన

Ganesh
Ganesh

పూర్వకాలంలో గజాసురుడనే రాక్షసుడు శివుని కోసం ఘోర తపస్సు ఏసి ఆయన ఎల్లప్పుడూ తన కడుపులో ఉండిపోవాలని కోరుకుంటాడు.

అందుకు శివుడు కూడా అంగీకరిస్తాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న పార్వతీదేవి శ్రీ మహావిష్ణువు సహాయం కోరుతుంది.

శ్రీమహావిష్ణువు, బ్రహ్మదేవుని సాయంతో నందిని తీసుకుని వాటితో గజాసురుడి ముందు ఆడిస్తారు.

ఇందుకు తన్మయత్వం పొందిన గజాసురుడు ఏం కావాలో కోరుకోమని చెబుతాడు.

దీంతో శివుడిని తిరిగి ఇచ్చేయమని కోరగా తన దగ్గరికి వచ్చింది సాక్షాత్తూ విష్ణుమూర్తి అని అర్ధం చేసుకున్న గజాసురుడు నందీశ్వరుడిని తన పొట్ట చీల్చమని బయటకు వచ్చేలా చేశాడు.

ఆ తర్వాత లోకమంతా ఆరాధించబడేలా చేయమని, తన చర్మాన్ని శివుని వస్త్రంలా ధరించమని కోరుకుని మరణిస్తాడు. శివుడిరాక గురించి పార్వతీదేవి సంతోషంతో భర్త రాకను తెలుసుకుని స్వాగతం పలికేందుకు సన్నద్ధమవుతుంది.

నలుగు పెట్టుకుంటూ ఆ నలుగు పిండితో బాలుడి రూపాన్ని తయారుచేసి దానికి ప్రాణం పోసి ద్వారం వద్ద కాపలా పెట్టి ఎవరినీ రానివ్వద్దని స్నానానికి వెళుతుంది.

ఆ సమయంలో పరమేశ్వరుడు వస్తాడు. బాలుడికి ఎంత చెప్పినా అడ్డు తప్పుకోకపోవడంతో తన శూలంతో ఆ బాలుడి తలను ఖండించాడు.

అప్పుడే స్నానం ముగించుకుని వచ్చిన పార్వీతీదేవి ఈశ్వరుడిని చూసి సంతోషిస్తుంది. అయితే అప్పుడే బాలుడి ప్రస్తావన రావడంతో ఆ బాలుడు మన బిడ్డ అని చెబుతుంది.

తనను ఎలాగైనా బతికించమని కోరుతుంది.

అప్పుడు శివుడు గజాసురుడి తలను ఆ బాలుడికి అతికించి బతికించాడు. అలా గజ ముఖం ఉండటం వల్ల వినాయకుడు గజాననుడిగా పేరు ప్రఖ్యాతులు గడించాడు తన వాహనంగా అనింద్యుడు అయిన మూషికాన్ని మార్చుకున్నాడు.

విఘ్నాలు రాకుండా ..

కొన్ని రోజుల తర్వాత దేవతలంతా కలిసి పరమేశ్వరుడి వద్దకు వెళ్లి తమకు ఎలాంటి విఘ్నాలు రాకుండా ఉండాలంటే ఏ దేవుడిని ప్రార్ధించాలని కోరతారు.

అప్పుడు విఘ్నేశ్వరుడు, కుమారస్వామి పోటీ పడతారు. అప్పుడు శివుడు ముల్లోకాల్లో పుణ్యనదులన్నింటిలో స్నానం చేసి తిరిగి ఎవరైతే మొదట వస్తారో వారికే ఈ పదవికి అర్హుతలని చెబుతారు.

తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణలు

అప్పుడు గజాననుడు తన బలాబలాలు తెలిసి, మీరు ఇలాంటి నిబంధన పెట్టడం సబబేనా? అని అడుగగా తండ్రి గణేశుడికో మంత్రాన్ని చెప్పి తల్లిదండ్రుల చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి దాన్ని పఠించమని చెబుతాడు.

అప్పుడు ఆ మంత్రాన్ని పఠిస్తూ వినాయకుడు అక్కడే ఉండిపోయాడు.

అయితే మంత్ర ప్రభావం వల్ల కుమారస్వామికి తాను వెళ్లిన చోటంగా ముందుగానే గణేశుడు స్నానం చేసి వెళుతున్నట్లుగా కనిపించేవాడు.

.అప్పుడు తిరిగొచ్చిన కుమారస్వామి అన్నగారి మహిమ గురించి తెలుసుకోలేకపోయాన. నన్ను క్షమించి ఈ పదవిని అన్నకు అప్పగించండి అని చెపుతాడు.

అలా భాద్రపద మాసాన శుద్ధ చవితినాడు గజాననుడువిఘ్నేశ్వరు డయ్యాడు.

ఈ పవిత్రమైన రోజున దేవతలు, మునులు అందరూ వివిధ రకాల కుడుములు, ఉండ్రాళ్లు, పండ్లు, పాలు, తేనె, పానకం సమర్పించుకుని ఆ దేవుని ఆశీర్వాదాలు పొందుతారు.

తాజా ‘నిఘా’ వార్తల కోసం : https://www.vaartha.com/specials/women/