ఒడిశాలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప 2

అల్లు అర్జున్ – సుకుమార్ కలయికలో తెరకెక్కుతున్న పుష్ప 2 మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. పుష్ప భారీ విజయం సాధించడం తో పుష్ప 2 ఫై దేశ వ్యాప్తంగా అంచనాలు నెలకొని ఉన్నాయి.

రీసెంట్ గా అల్లు అర్జున్ బర్త్ డే సందర్బంగా రిలీజ్ అయినా టీజర్ సినిమా ఫై మరింత ఆసక్తి పెంచింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఒడిశాలో జరుగుతుంది. సినిమాలోని కీలక సన్నివేశాలను ఇక్కడ షూట్ చేస్తున్నారు. కాగా ‘పుష్ప 2’లో సీరత్ కపూర్ ఐటమ్ సాంగ్ చేస్తున్నారని వార్తలు ప్రచారం కావడం తో ఆ వార్తల్లో నిజం లేదని సీరత్ కపూర్ స్పష్టం చేశారు.

”పుష్ప 2’లో నేను ఉన్నానని వార్తలు వస్తున్నాయి. అవి పూర్తిగా నిరాధారణమైనవి అని క్లారిటీ ఇస్తున్నాను. అల్లు అర్జున్ మంచి ఫ్రెండ్. ఇటీవల ఆయన్ను కలిశా. కాసేపు మాట్లాడాను. ఓ ఫోటో తీసుకున్నాను. అంతే తప్ప… ఆయన సినిమాలో నేను నటించడం లేదు. అలాగే, నేను ఎటువంటి ఐటమ్ సాంగ్ చేయడం లేదు” అని సీరత్ కపూర్ ఇంస్టాలో స్టోరీ పోస్ట్ చేశారు.

ఇదిలా ఉండగా పుష్ప ది రూల్ ను సుకుమార్ భారీ బడ్జెట్​తో తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.