రావత్ జీవన ప్రస్థానం ఇలా…

ర‌క్షణ రంగంలో సంస్కరణలకు ఆద్యుడు

Bipin Rawat life
Bipin Rawat-File


బిపిన్ రావత్ కుటుంబం ఇండియ‌న్ ఆర్మీలో ఎన్నో ఏళ్ళుగా సేవ‌ల‌ను అందిస్తోంది. బిపిన్ తండ్రి లక్ష్మణ్ సింగ్ రావత్ భార‌త ఆర్మీలో లెఫ్టినెంట్ జనరల్ స్థాయి చేరుకుని దేశ ‘సేవలో తరించారు.ఉత్త‌రాఖండ్ లోని పూరీలో 1958 మార్చి 16న బిపిన్ రావత్ జ‌న్మించారు. ప్రాథమిక విద్యను డెహ్రడూన్ లోని కాంబ్రియన్ హాల్ స్కూల్ లో ప్రారంభించారు. తదుపరి సిమ్లాలోని సెయింట్ ఎడ్వర్డ్ స్కూల్ లో విద్యను కొనసాగించారు. . ఆ తర్వాత ఖడక్వాస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ లో చేరారు.

రావత్ జీవన ప్రస్థానం ఇలా...
Bipin Rawat with wife Madhulika Raje Singh-File

డెహ్రడూన్ లోని ఇండియన్ మిలటరీ అకాడమీలోకి ప్రవేశించారు . బిపిన్ ప్రతిభకు ‘స్వోర్డ్ అఫ్ ఆనర్’ లభించింది. అనంతరం డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్-వెల్లింగ్టన్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. హయ్యర్ కమాండ్ కోర్సును యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ కమాండ్ అండ్ జనరల్ స్టాఫ్ కాలేజ్-ఫోర్ట్ లీవెన్ వర్త్ , కాన్సాస్ లో పూర్తి చేశారు. మద్రాస్ యూనివర్సీటి లో డిఫెన్స్ స్టడీస్‌లో ఎంఫిల్ డిగ్రీ, మేనేజ్‌మెంట్ అండ్ కంప్యూటర్ స్టడీస్‌లో డిప్లొమా సాధించారు. .సైనిక మీడియా వ్యూహాత్మక అధ్యయన పరిశోధనలకు మీరట్ లోని చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం రావత్ కు ఫిలాసఫీలో డాక్టరేట్ అందించింది.

రావత్ జీవన ప్రస్థానం ఇలా...
Madhulika Raje Singh wife of Bipin Rawat. Daughters Kritika, Tarini

1978 డిసెంబర్ 16న గూర్ఖా రైఫిల్స్‌లోని 5వ బెటాలియన్‌లో చేరి బిపిన్ తన ఆర్మీ కెరీర్ ను ప్రారంభించారు. అపుడు తండ్రి అదే యూనిట్ లో పనిచేస్తున్నారు. బిపిన్ యుద్ధ నైపుణ్యాలను గమనించిన ఇండియన్ ఆర్మీ పలు కీలక ఆపరేషన్లలో ఆయన సేవలను ఉపయోగించుకుంది. రావత్ కు యుద్ధ విద్యలో అపార అనుభవం తో దేశ వ్యతిరేక, తిరుగుబాటు కార్యకలాపాల నిరోధక ఆపరేషన్లలో పదేళ్ళపాటు సేవలందించారు. జమ్మూకాశ్మీర్ ఆర్మీ విభాగంలో పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు.

రావత్ జీవన ప్రస్థానం ఇలా...
Bipin Rawat with Air Force fighter

తాజాగా ర‌క్షణ రంగంలో సంస్కరణలకు బిపిన్ ఆద్యుడు అయ్యారు. అంతేకాదు ఫోర్ స్టార్ జనరల్. లడఖ్ సంక్షోభ సమయంలో త్రివిధ దళాలకు, ప్రభుత్వానికి మధ్య సమన్వయకర్తలా వ్యవహరించారు. భారత్ తో కయ్యానికి చైనా తోక ముడిచేలా చేయడంలో జనరల్ బిపిన్ రావత్ పాత్ర కీలకంగా మారింది. దేశం కోసం ఆయన అందించిన సేవలకు గుర్తుగా లెక్కలేనన్ని సేవా పతకాలు ఆయన్ని వరించాయి. పరమ విశిష్ట సేవా పతకం, అతి విశిష్ట సేవా పతకం, యుద్ధ సేవా పతకం ఆయన అంకితభావానికి గీటురాళ్లు నిలిచాయి. బిపిన్ రావత్ సతీమణి మధులిక రాజే సింగ్. వీరికి ఇద్దరు కూతుళ్లు కృతిక, తరిణి ఉన్నారు.

అంతర్జాతీయ వార్తల కోసం: https://www.vaartha.com/news/international-news/