తిరుపతి మీదుగా వెళ్లే 18 రైళ్లు తాత్కాలికంగా రద్దు

12 వరకూ రద్దు కొనసాగుతుందన్న దక్షిణ మధ్య రైల్వే

తిరుపతి : తిరుపతి మీదుగా సాగే 18 రైళ్లను పూర్తిగా, మరో 7 రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. రైల్వే స్టేషన్ రీమోడలింగ్ పనులు జరుగుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఉన్నతాధికారులు వెల్లడించారు. తిరుపతి స్టేషన్ మీదుగా వెళ్లే రెండు రైళ్ల హాల్టింగ్ ను తొలగించామని, మరో నాలుగు రైళ్లను దారి మళ్లించామని పేర్కొన్నారు. దక్షిణం వైపు నాన్ ఇంటర్ లాకింగ్, ప్రీ నాన్ ఇంటర్ లాకింగ్, ఎలక్ట్రిఫికేషన్ తదితర పనులు జరగనున్నాయని అన్నారు. 12వ తేదీ వరకూ రైళ్ల రద్దు కొనసాగుతుందని భక్తులు, ప్రయాణికులు గమనించాలని, మర‌మ్మతులు పూర్తయిన వెంటనే యథా‌వి‌ధిగా నడు‌పు‌తా‌మని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. 

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/