రాజకీయాల్లోకి దిల్ రాజు..?

టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ & డిస్ట్రబ్యూటర్ దిల్ రాజు రాజకీయాల్లోకి రాబోతున్నాడా..? ప్రస్తుతం రాజకీయాల్లో , ఇండస్ట్రీ లో ఇదే చర్చ నడుస్తుంది. తెలంగాణ లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలోకి దిల్ రాజు జాయిన్ కాబోతున్నాడని..ఈయన త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల బరిలో నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడనే ఓ వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందొ తెలియదు కానీ అంత దీని గురించే మాట్లాడుకుంటున్నారు.