ఆరేళ్ల బాలికపై ప్రైవేట్ టీచర్​ అత్యాచారం

ప్రభుత్వాలు , కోర్ట్ లు ఎన్ని కఠిన శిక్షలు , చట్టాలు తీసుకొస్తున్న కామాంధులు మాత్రం వారి ఆగడాలను ఆపడం లేదు. మహిళనే కాదు అభం శుభం తెలియని చిన్నారుల ఫై కూడా దారుణంగా ప్రవర్తిస్తూ..సమాజం తలదించుకునేలా చేస్తున్నారు. ఆఖరికి విద్యాబుద్ధులు చెప్పాల్సిన టీచర్లు సైతం ఇలాంటి దాడులకు పాల్పడుతూనే ఎవర్ని నమ్మాలో , నమ్మకూడదు అర్ధం కానీ పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉన్నారు. తాజాగా
రాజస్థాన్ దారుణం చోటుచేసుకుంది. అభం శుభం తెలియని ఆరేళ్ల బాలికపై ప్రైవేట్ టీచర్​ అత్యాచారానికి పాల్పడ్డాడు. రాజస్థాన్‌లోని కోటాలో ఈ దారుణం జరిగింది.

వివరాల్లోకి వెళ్తే..

కోటలోని రాంపురానికి చెందిన రహీమ్.. గ్రామంలోని పిల్లలకు ఉర్దూలో ప్రైవేట్ ట్యూషన్ చెబుతుంటాడు. ప్రస్తుతం స్థానిక మదర్సాలో ఉంటున్నాడు’. శనివారం మధ్యాహ్నం విద్యార్థులందరినీ పంపేసిన రహీమ్.. బాధితురాలిని మదర్సాకు తిరిగి రావాలని చెప్పాడు. ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు. జరిగిన విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు వివరించింది. దీనిపై ఆదివారం అర్ధరాత్రి డిగోడ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు పోలీసులు వివరించారు.