ఉత్కర్ష్ సమారోహ్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని

భారీ రాఖీ బహూకరించిన బరూచ్ మహిళలు

PM Modi addresses ‘Utkarsh Samaroh’ in Bharuch, Gujarat

న్యూఢిల్లీ: ఉత్కర్ష్ సమారోహ్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు గుజరాత్ లోని బరూచ్ కు చెందిన మహిళలు భారీ కానుక సమర్పించారు. ప్రధాని మోడీని తమ సోదరునిగా భావించి అతిపెద్ద రాఖీని ఆయనకు అందజేశారు. మహిళల గౌరవం, సౌకర్యవంతమైన జీవనం దిశగా ప్రధాని మోడీ సేవలకు ధన్యవాదాలు తెలుపుతూ ఆయనకు రాఖీ బహూకరించారు. ప్రధాని మోడీ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.

అందుకు ప్రధాని మోడీ బదులిస్తూ… గుజరాత్ మహిళలకు ధన్యవాదాలు తెలిపారు. రాఖీ రూపంలో తనకు ఎనలేని బలాన్ని అందించారని తెలిపారు. దేశాభివృద్ధి, మహిళల సంక్షేమం కోసం తాను మరింత కష్టపడేలా పనిచేసేందుకు ఈ రాఖీ స్ఫూర్తినిస్తుందని భావిస్తున్నానని, ఆ క్రమంలో తనకు రక్షణకవచంలా పనిచేస్తుందని ఆశిస్తున్నానని తెలిపారు. తాను గుజరాత్ లో ఉంటే తన రక్షణకు సంబంధించి అనేక ఆందోళనలు తలెత్తేవని, కానీ, ఇప్పుడు రాఖీ రూపంలో కోట్లాది మంది తల్లుల రక్ష తనకు ఉందని తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/