తెరాస కు ఓటు వేయకపోతే పింఛన్లు ఆపేయిస్తా అంటూ వికలాంగులను బెదిరిస్తున్న అధికార పార్టీ నేత

తెరాస కు ఓటు వేయకపోతే పింఛన్లు ఆపేయిస్తా అంటూ వికలాంగులను బెదిరిస్తున్న అధికార పార్టీ నేత

హుజురాబాద్ ఉప ఎన్నిక సమయం దగ్గర పడుతుండడం తో అధికార పార్టీ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారు. తెరాస కాదని ఈటెల కు ఓటు వేస్తే పింఛన్లు ఆపేస్తామని , ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పధకాలు రాకుండా చేస్తామని బెదిరిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు బయటకు రాగా..తాజాగా దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు టీఆర్‌ఎ్‌సకు ఓటు వేయకపోతే పింఛన్లు నిలిపి వేయిస్తానంటూ అ పార్టీ నాయకుడు, వికలాంగుల రాష్ట్ర కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి చేసిన వ్యాఖ్యల వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

కరీంనగర్‌ జిల్లా ఇల్లందకుంట మండలంలోని వంతడుపులలో శనివారం వాసుదేవరెడ్డి వికలాంగులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభు త్వం రెండేళ్లు అధికారంలో ఉంటుందని, సర్పంచ్‌లు అధికార పార్టీకి చెం దిన వారే ఉన్నారని, వికలాంగులు వేరే పార్టీకి ఓటు వేసినట్లయితే వారిని గుర్తించి పింఛన్లు నిలిపివేస్తామని బెదిరించారు. ఈ వీడియో బయటకు రావడం తో ఆయనపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ దివ్యాంగుల హక్కు ల పోరాట సమితి సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేసింది.