సిగ్గుపడు కేసీఆర్… సిగ్గుపడు – షర్మిల

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కేసీఆర్ విషయంలో ఎక్కడ తగ్గడం లేదు. మొదటి నుండి కేసీఆర్ ను టార్గెట్ గా పెట్టుకున్న షర్మిల..ప్రతి సమావేశంలో విమర్శలు చేస్తూనే వస్తున్నారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పి ఇంటికో తాగుబోతుని తయారుచేస్తున్నందుకు సిగ్గుపడు అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యింది.

రైతుల కడుపుకొట్టి, బడులను బంద్ పెట్టి, బార్లకు “రండి బాబు .. రండి” అంటూ డోర్లు తెరుస్తున్నవ్.. సిగ్గుపడు కెసిఆర్ .. సిగ్గు పడు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని ఇంటికో తాగుబోతోన్ని తయారు చేస్తున్నందుకు.ఆదాయం పెంచుకొనే తెలివిలేక లిక్కర్ మీద రాష్ట్రాన్ని నడుపుతున్నందుకు సిగ్గుపడు అంటూ ట్విట్టర్ లో ఆగ్రహం వ్యక్తం చేసింది. తాగుబోతోళ్ళ కష్టం మీకే బాగా తెలుసినట్లు .. గల్లీకో వైన్ షాప్, వీధికో బార్ షాప్, గ్రామానికో 10 బెల్ట్ షాపులు పెట్టి బంగారు తెలంగాణను బారుల తెలంగాణగా, బీరుల తెలంగాణగా మార్చారు దొరగారు. ఈ రోజు రాష్ట్ర అభివృద్ధి లిక్కర్ షాపులను పెంచడంలో డ్రగ్స్ అమ్మడంలో మాత్రమే కనిపిస్తుంది అంటూ వరుస ట్వీట్స్ చేసారు.