పంచాయతీ ఎన్నికల టీడీపీ మేనిఫెస్టో విడుదల

పల్లె ప్రగతి-పంచ సూత్రాల పేరుతో, ప్రజలకు సుపరిపాలన అందించాలనేదే లక్ష్యం : చంద్రబాబు

Chandra babu Naidu
Chandra babu Naidu

Amaravati: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం టీడీపీ మేనిఫెస్టో విడుదల చేశారు. పల్లె ప్రగతి-పంచ సూత్రాల పేరుతో, ప్రజలకు సుపరిపాలన అందించాలనే లక్ష్యంతో మేనిఫెస్టో విడుదల చేసినట్లు చెప్పారు. గ్రామాల్లో సమర్ధవంతమైన పాలన కోసమే ఈ పంచ సూత్రాలని అన్నారు.

మేనిఫెస్టో లోని అంశాలు

  • ఉచిత కుళాయిలతో రక్షిత మంచినీరు అందిస్తాం
  • భద్రత-ప్రశాంతతకు భరోసా కల్పిస్తాం
  • ఆలయాలపై దాడులు అరికట్టడంతో పాటు ప్రజల ఆస్తులకు భద్రత కల్పిస్తాం
  • స్వయం సంవృద్ధి కార్యక్రమంలో భాగంగా..వ్యవసాయ మోటార్లకు మీటర్లను అడ్డుకుంటాం
  • ఆస్తి పన్ను తగ్గించి పౌర సేవలు అందిస్తాం.. స్వచ్ఛత పరిశుభ్రత పాటిస్తూ ఆదర్శ గ్రామలు తీర్చిదిద్దటమే లక్ష్యమని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

తాజా ‘నిఘా’ వార్తల కోసం : https://www.vaartha.com/specials/investigation/