ముంబయిలో రూ.5కోట్ల డ్రగ్స్‌ పట్టివేత

ముంబయి: రూ.5కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకోవడంతో పాటు నైజీరియన్‌ జాతీయుడిని ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు అరెస్టు చేశారు. మహిళల హ్యాండ్‌బాగ్‌లో దాచిన ఎండీ డ్రగ్‌, కొకైన్‌ను సబర్బన్‌ వాడాలాలో స్వాధీనం చేసుకోగా.. నిందితుడిని సెవ్రీ రోడ్డులో అరెస్టు చేశారు. నిందితుడు మాదక ద్రవ్యాలను రవాణాకు మహిళలు వినియోగించే మూడు హ్యాండ్‌బ్యాగ్‌లను వినియోగించాడని అధికారులు తెలిపారు. నిందితుడు డ్రగ్‌ను ఎవరికి డెలివరీ చేశారనే దానిపై క్రైం బ్రాంచ్‌ విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. నిందితులపై నార్కోటిక్ అండ్‌ నార్కోటిక్ పదార్ధాల చట్టం ప్రకారం కేసు నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/