నేడు తాజ్‌ను సందర్శించనున్న మయన్మార్‌ అధ్యక్షుడు

మయన్మార్‌తో 10 ఒప్పందాలు

President of Myanmar U Win Myint visit the Taj today
Myanmar President -pm-president

న్యూఢిల్లీ: మయన్మార్‌ అధ్యక్షుడు విన్‌మైంట్‌ ప్రధాని నరేంద్రమోడి హైదరాబాద్‌ హౌజ్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాలు 10 ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు సమాచారం. అంతకు ముందు రాజ్‌ఘాట్‌ వద్ద మహాత్మాగాంధీ స్మారక చిహ్నానికి నివాళులర్పించారు. కలప అక్రమ రవాణా, పులులు, ఇతర వన్యప్రాణుల సంరక్షణ, పెట్రోలియం ఉత్పత్తులు, సమాచార రంగంలో ఇరుదేశాల మధ్య సహకారం కోసం చేసుకున్న అవగాహన ఒప్పందాలకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. తన భార్య డా చోచోతో కలిసి దేశానికి చేరుకున్న విన్‌మైంట్‌కు రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి కోవింద్‌, ప్రధాని మోడీ స్వాగతం పలికారు. శనివారం తాజ్‌మహాల్‌ను సందర్శించనున్నారు.

తాజా చెలి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/women/