UN వరల్డ్ జియోస్పేషియల్ ఇంటర్నేషనల్ కాంగ్రెస్‌లో ప్రధాని మోడీ

YouTube video
PM Modi’s remarks at UN World Geospatial International Congress

న్యూఢిల్లీః ఈరోజు హైదరాబాద్ లోని నోవాటెల్లో ఐక్యరాజ్యసమితి రెండో ప్రంపంచ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ సదస్సు జరుగుతోంది. ఈ నెల10న ప్రారంభమైన సదస్సు 14వ తేదీ వరకు జరుగనుంది. ఐక్యరాజ్య సమితితో పాటు కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. సదస్సులో 120 దేశాల నుంచి దాదాపు 2వేల మంది ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సదస్సులో నేడు ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని, ప్రసంగించారు. పర్యటన, ఆతిధ్యం, సాంస్కృతిక, సంప్రదాయంకు ప్రాధాన్యత ఇచ్చే హైదరాబాద్ లో సదస్సు జరగడం గొప్ప విషయమని మోడీ అన్నారు. టెక్నాలజీ, టాలెంట్ రెండు దేశానికి పిల్లర్స్ వంటివి అని ప్రధాని అన్నారు. ఎవరూ వెనకబడి ఉండకూడదు అనే నినాదంతో ఈ సదస్సు జరుగుతుందన్నారు. టెక్నాలజీ, టాలెంట్ దేశ అభివృద్ధికి దోహదపడుతాయని అన్నారు. జియోస్పేషియల్ తో గ్రామీణ ప్రాంతాలకు ఎంతో మేలు జరుగుతుందని మోడీ తెలిపారు. టెక్నాలజీతో భారతదేశం చాలా వేగంగా ముందుకు వెళుతుందన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/