ఢిల్లీ హింస..38కి పెరిగిన మృతుల సంఖ్య

514 మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న పోలీసులు

Delhi violence
Delhi violence

న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన హింస నేపథ్యంలో అక్కడి పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. అల్లర్లలో గాయపడిన వారిలో మరో 11 మంది ఒక్కరోజు వ్యవధిలోనే మృతి చెందారు. దీంతో హింసాకాండలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 38కి చేరింది. అల్లర్ల ఘటన నుంచి ప్రజలు ఇంకా తేరుకోలేదు. ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జనం జంకుతున్నారు. హింసాత్మక ఘటనలకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు 48 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. అల్లర్లపై దర్యాప్తు కోసం రెండు ప్రత్యేక దర్యాప్తు బృందాల (సిట్)ను ఏర్పాటు చేశారు. 514 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

తాజా ఇపేపరు వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://epaper.vaartha.com/