సుఖోయ్ 30 యుద్ధ విమానంలో విహరించిన రాష్ట్ర‌ప‌తి ముర్ము

సుఖోయ్ 30 యుద్ధ విమానంలో రాష్ట్ర‌ప‌తి ముర్ము విహరించారు. అస్సాం ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆమె.. తేజ్‌పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేష‌న్‌లో ఈరోజు సార్టీ నిర్వ‌హించారు. యుద్ధ విమానంలో విహ‌రించిన రెండవ మ‌హిళా రాష్ట్ర‌ప‌తిగా ముర్ము రికార్డు క్రియేట్ చేశారు.

2009లో అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ తొలిసారి ఈ విమానంలో ప్రయాణించారు. కాగా, తేజ్‌పూర్ విమానాశ్ర‌యం త‌వాంగ్ సెక్టార్‌కు ద‌గ్గ‌ర‌గా ఉంటుంది. ఇక, సుఖోయ్ 30 ఎంకేఐ రెండు సీట్లతో కూడిన ఫైట‌ర్ జెట్‌ విమానం. దీన్ని ర‌ష్యాకు చెందిన సుఖోయ్ సంస్థ అభివృద్ధి చేయగా.. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ జెట్‌ను నిర్మించింది.