ఈసారి ఎండలు మాములుగా ఉండవట

రోజు రోజుకు ఎండ తీవ్రత భారీగా పెరుగుతుంది. గత వారం రోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 9 దాటితే చాలు కాలు బయట పెట్టాలంటే ఆలోచిస్తున్నారు అంతలా ఎండలు పెరిగిపోయాయి. ఫిబ్రవరి ఇంకా పూర్తి కానేలేదు అప్పుడే ఈ రేంజ్ లో ఎండలా అని అంత మాట్లాడుకుంటున్నారు. మరోపక్క వాతావరణ నిపుణలు సైతం ఈ ఏడాది ఎండలు దంచికొడతాయని చెపుతున్నారు.

నగరంలో ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల సెల్సియస్ దాటడంతో వేసవి తాపం మొదలైంది. ఈ ఏడాది ఊహించిన ‘ఎల్ నినో’ కారణంగా వేసవి కాలం కఠినంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా రుతుపవనాలపై కూడా ఆ ఎఫెక్ట్ పడనుందని తెలుస్తోంది. హైదరాబాద్ లో ఈసారి ఎండలు మండిపోయే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాబోయే రోజులలో వాతావరణం మరింత వేడిగా మారుతుందని పేర్కొంది. గత తొమ్మిదేళ్లలో, వార్షిక గరిష్ట ఉష్ణోగ్రతలు 2016లో అత్యధికంగా, 2021లో అత్యల్పంగా నమోదయ్యాయి. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ నివేదిక ప్రకారం, ప్రస్తుతం ఎల్ నినో పరిస్థితుల కారణంగా గత మూడేళ్లలో ఉష్ణోగ్రతలు కొద్దిగా తగ్గాయి. ఎల్ నినో ప్రభావం వాతావరణంపై ప్రభావం చూపుతుంది. ఇది భారతదేశంలో కరువు లేదా బలహీన రుతుపవనాలతో సంబంధం కలిగి ఉంటుంది.

భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. హైదరాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 35.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది సాధారణ ఉష్ణోగ్రత కంటే నాలుగు డిగ్రీల తగ్గిందని అంటున్నారు. గరిష్ట ఉష్ణోగ్రత అంటే, హయత్ నగర్ స్టేషన్‌లో 34 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. సాధారణ ఉష్ణోగ్రత కంటే మూడు డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదైనట్లు తెలిపారు. ఓవరాల్ గా ఈసారి తెలంగాణ వ్యాప్తంగా ఎండలు విపరీతంగా ఉండనున్నాయి.