పవన్ – మహేష్ చిత్రాల వల్ల రూ.25 కోట్లు నష్టపోయాను – దిల్ రాజు

డిస్ట్రబ్యూటర్ గా చిత్రంలోఅడుగుపెట్టిన దిల్ రాజు..ప్రస్తుతం టాప్ ప్రొడ్యూసర్ గా రాణిస్తున్నారు. ఓ పక్క పాన్ ఇండియా సినిమాలు నిర్మిస్తూనే మరోపక్క డిస్ట్రబ్యూటర్ గా , చిన్న చిత్రాలు నిర్మిస్తూ లాభాలు అందుకుంటున్నారు. రీసెంట్ గా బలగం అనే చక్కటి చిత్రాన్ని నిర్మించి భారీగా లాభాలు అందుకున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ అనే పాన్ ఇండియా మూవీ ని నిర్మిస్తున్నారు.

అలాగే గుణశేఖర్ కాంబినేషన్‌లో రాబోతున్న ‘శాకుంతలం’ మూవీకి సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 14న పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కాబోతుంది. ప్రస్తుతం దిల్ రాజు ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ..పవన్ కళ్యాణ్, మహేష్ బాబు చిత్రాల వల్ల దాదాపు రూ. 25 కోట్ల వరకు నష్టపోయినట్లు తెలిపారు.

‘2017లో నిర్మాతగా నావి రెండు సినిమాలు హిట్ అయ్యాయి. అదే సంవత్సరం మహేష్ – మురుగదాస్ కలయికలో తెరకెక్కిన ‘స్పైడర్’‌ను కొన్నాను. ఈ సినిమా వల్ల నాకు ఏకంగా రూ. 12 కోట్లు లాస్ వచ్చింది’ అని తెలిపాడు. అలాగే ‘అదే సంవత్సరం పవన్ కల్యాణ్ హీరోగా చేసిన ‘అజ్ఞాతవాసి’ రైట్స్‌ను ఫ్యాన్సీ రేటుకు కొన్నాను. కానీ, ఈ మూవీ వల్ల రూ. 13 కోట్లు నష్టం వచ్చింది. అంటే ఒకే సంవత్సరం రెండు సినిమాలకే రూ. 25 కోట్లు పోగొట్టుకున్నా. ఒకవేళ నేను నిర్మాతగా హిట్లు కొట్టకపోయి ఉంటే ఇవి కవర్ అయ్యే పరిస్థితి ఉండేది కాదు’ అని తెలిపారు.