సికింద్రాబాద్ – తిరుపతి వందేభారత్ ను ప్రారంభించిన ప్రధాని మోడీ

సికింద్రాబాద్ – తిరుపతి మధ్య నడిచే వందేభారత్ రైల్ ను ప్రధాని మోడీ ప్రారంభించారు. ట్రైన్ లో విద్యార్థులతో మోడీ కాసేపు సంభాషించారు. మూడు నెలల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఇది రెండో వందే భారత్. అలాగే దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కేంద్రంగా ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేసారు. ఎంఎంటీఎస్ ఫేజ్ 2లో భాగంగా 13 కొత్త సర్వీసులను ప్రారంభించారు.

అంతకు ముందు బేగం పేట్ కు చేరుకున్న మోడీకి గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం తరుపున నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అలాగే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోడీ – ఎంపీ బండి సంజయ్ ఫొటో అందరి దృష్టికి ఆకర్షించింది. ప్రధాని మోడీకి బండి సంజయ్ నమస్కారం చేయగా.. బండి చేతులు పట్టుకుని మరీ నవ్వారు మోడీ. ఈ సమయంలో పక్కనే ఉన్న ఎంపీ లక్ష్మణ్, కిషన్ రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ నవ్వూతూ కనిపించారు. అందరూ నమస్కారం చేయగా.. మోడీ కూడా ప్రతి నమస్కారం చేస్తూ వచ్చారు. బండి సంజయ్ దగ్గరకు రాగానే చేతులు పట్టుకుని మరీ.. నవ్వుతూ విషెస్ స్వీకరించటంతోపాటు.. ప్రత్యేక అభినందనలు తెలిపారు.