మే 01 న ‘ప్రేమికుడు’ రీ రిలీజ్

ప్రభుదేవా , నగ్మా జంటగా శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ ప్రేమికుడు. 1994 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ సరిగ్గా 30 ఏళ్లకు మరోసారి థియేటర్ లలో సందడి చేయబోతుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతుంది. అగ్ర హీరోల చిత్రాలతో పాటు ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ చిత్రాలు సైతం రీ రిలీజ్ అవుతూ..ప్రేక్షకులను , అభిమానులను సందడి చేస్తున్నాయి.

ఈ క్రమంలో ప్రభుదేవా నటించిన ప్రేమికుడు మూవీ మే 1న 300కు పైగా థియేటర్లలో 4కే క్వాలిటీలో విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు రమణ, మురళీధర్ తెలిపారు. ఇప్పటికే ఓపెన్ అయిన బుకింగ్స్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోందని వారు తెలిపారు. ‘ప్రేమికుడు’ రీ రిలీజ్‌కు సంబంధించి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిర్మాతలు మురళీధర్‌రెడ్డి, రమణ, లగడపాటి శ్రీనివాస్, శోభారాణి పాల్గొన్నారు. నగ్మ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో ఎస్పీ బాలసుబ్రమణ్యం, వడివేలు, రఘువరన్, గిరీష్ కర్నాడ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ ఈ మూవీకి సంగీతం అందించారు.