దేశీయ ప్రయాణాలకు ట్రంప్ అనుమతి

donald trump
donald trump

వాషింగ్టన్ :అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే వారం నుంచి దేశవ్యాప్తంగా రవాణా సౌకర్యాలను పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాకుండా . కరోనా మహమ్మారి అమెరికాలో విజృంభించిన తరువాత ట్రంప్ మొదటిసారి వాషింగ్టన్ దాటి వేరే రాష్ట్రానికి వెళ్తున్నారు. ఆర్థిక రంగాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకే తాను అరిజోనా వెళ్తున్నానని, ర్యాలీల కోసం కాదని ట్రంప్ స్పష్టం చేశారు. భారీ జనంతో ర్యాలీలను నిర్వహించడానికి ఇంకా సమయం పడుతుందన్నారు. ‘త్వరలోనే మనమంతా భారీ ర్యాలీలను నిర్వహిస్తామని, ఇంతకు ముందులా అందరూ పక్కపక్కనే కూర్చునే సమయం త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నా’ అని ట్రంప్ అన్నారు. కాగన్ అమెరికా వ్యాప్తంగా కరోనా కేసులు పది లక్షలు దాటగా.. మరణాల సంఖ్య అరవై వేలు దాటాయి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి :https://www.vaartha.com/news/national/