దేవినేని మల్లికార్జునరావుకు కీలక పదవి అప్పగించిన సీఎం జగన్

సొంత పార్టీ పైనే నేతలు ఆరోపణలు , విమర్శలు చేస్తుండడం తో సీఎం జగన్ సద్దుపాటు చేసే పని పెట్టుకున్నారు. అధిష్టానం ఫై అసమ్మతి తో ఉన్న వారిపై ఫోకస్ చేసారు. అలాగే పార్టీ లోనికి కీలక నేతలకు పలు పదవులు అప్పగిస్తూ వారిలో సంతోషం నింపుతున్నారు. తాజాగా బాపట్ల అర్బన్‌ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా దేవినేని మల్లికార్జునరావును నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో నంబరు 62లో ఉత్తర్వులు జారీ చేసింది. బాపట్ల జిల్లాలోని 14 మండలాలు, 163 గ్రామాలతో బాపట్ల అర్బన్‌ డెవలప్‌మెంట్ అథారిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

బాపట్ల అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్‌ పదవి కోసం పలువురు వైస్సార్సీపీ నేతలు పోటీపడ్డారు. కానీ జిల్లాలో సామాజికవర్గ సమీకరణలపై బేరీజు వేసుకుని సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావుకు ఈ పదవిని అప్పగించారు. దేవినేని బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఏడాది పాటు పదవిలో కొనసాగనున్నారు. బాపట్ల అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ కార్యాలయాన్ని బాపట్ల మున్సిపాలిటీ కార్యాలయంలోనే ఏర్పాటు చేయనున్నారు. త్వరలోనే ఛైర్మన్‌గా మల్లికార్జునరావు బాధ్యతలు చేపట్టనున్నారు. మల్లికార్జునరావు కు ఈ పదవి దక్కడం పట్ల అభిమానులు , స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.