ప్రజావాక్కు

సమస్యలపై ప్రజాగళం

Polavaram Project
Polavaram Project

పోలవరంపై కేంద్రం తీరు మారాలి:-యర్రమోతు ధర్మరాజు, ధవళేశ్వరం

పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం సవతి తల్లిప్రేమ కనపర్చడం సరి కాదు. ప్రతి సోమవారం పోలవరంలో జరుగుతున్న పనులను పరిశీలించి చంద్రబాబు కార్యదీక్ష ఫలితంగా అరవై శాతం పనులు పూర్తయ్యాయి.

జగన్‌ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రీవర్స్‌ టెండరింగ్‌, పనిచేసే గుత్తేదారులను మార్చి, కేంద్రం వారించినా పెడచెవిన పెట్టిన మూలంగా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ నిధుల కోత విధించే నిర్ణయం ఐదు కోట్ల ఆం ధ్రులను నిరాశపరిచేదిగా ఉంది.

కేంద్రంలో ఏ పార్టీ అధికారం లో ఉన్నా ఆంధ్రప్రదేశ్‌ను అణగదొక్కేందుకే చూస్తుంది.

అప్పు లు కట్టిపెట్టి రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ విడదీస్తే హామీలు అమలు చేయకుండా భారతీయ జనతాపార్టీ ఆంధ్రప్రదేశ్‌ భూస్థాపితం చేయడానికి పూనుకుంది.

కేంద్ర ప్రభుత్వానికి పోలవరం ప్రాజె క్టుకు గతంలో ఆమోదించిన నిధులు రాబట్టేందుకు అఖిలపక్ష పార్టీలను ఢిల్లీకి తీసుకుని వెళ్లి నిర్ణీత సమయంలో ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కార్యోణ్ముఖులు కావాలి.

పరిశ్రమలకు భూముల కేటాయింపు: -ఎం.కనకదుర్గ, తెనాలి, గుంటూరుజిల్లా

పరిశ్రమల ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ ద్వారా వేలాది ఎకరాలను గత దశాబ్ద కాలంలో పొందిన సంస్థలు ఏళ్లు గడుస్తున్నా కార్యకలాపాలను ప్రారంభించడం లేదు.

పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పన లక్ష్యంగాపరిశ్రమలకు కేటాయించిన భూములు నిరుపయోగం గా పడి ఉండడంతో ప్రభుత్వ ఉద్దేశ్యం నెరవేరడం లేదు.

తక్కువ ధరలకే అనేక రాయితీలతో భూములు పొందిన సంస్థ లు తమకార్యకలాపాలను ప్రారంభించకపోవడం సరైన పద్ధతి కాదు.

అందువలన పారిశ్రామిక వాడలలో భూములు పొంది కార్యకలాపాలను ఇప్పటివరకు మొదలు పెట్టని సంస్థలపై కఠి నంగావ్యవహరించాలి.

వారి భూములనువెంటనే వెనక్కి తీసు కొనిస్టార్టప్‌,ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, బదలాయించాలి.

టూరిజం హోటళ్లను ఏర్పాటు చేయాలి:-షేక్‌ అస్లాం షరీఫ్‌, శాంతినగర్‌

రాష్ట్రంలో టూరిజం హోటళ్లను ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.

ప్రజలుఎక్కువగా తిరిగే ప్రదేశాలు టూరిజం హోటళ్లను ఏర్పాటు చేయాలి. చాలా చోట్ల రాత్రి పూట బసచేయడానికి హాస్టళ్లు లేక ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ టూరిజం హోటళ్లు ప్రస్తుతం తాలుకా కేంద్రాలలోనే ఎక్కువగా ఉన్నాయి. ఈ టూరిజం హోటళ్లను మండల కేంద్రాలలో కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది.

సైనికుల సమస్యలను పరిష్కరించాలి: -ముచ్కుర్‌ సుమన్‌ గౌడ్‌, నిజామాబాద్‌

దేశానికి సేవ చేసే సైనికులు మాజీ సైనిక ఉద్యోగులు తమ విధి నిర్వహణలో పడి తమ వ్యక్తిగత, ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్‌ను చాలామంది పొందలేకపోతున్నారు.

కాబట్టి ప్రభు త్వం స్పందించి తక్షణమే సైనికుల మాజీ సైనిక ఉద్యోగుల సమస్యల కోసం ప్రతిజిల్లాకు ప్రత్యేక అధికారులను నియ మించే వారే సైనికుల మాజీ సైనిక ఉద్యోగుల వ్యక్తిగత, ప్రభు త్వం నుంచి వచ్చే ఏసమస్యనైనా పరిష్కరించే విధంగా సహక రించాలి.

దేశానికి సేవ చేస్తున్న సైనికుల సమస్యలు తీర్చడం ప్రభుత్వ కనీస బాధ్యత. తక్షణమే వారి సమస్యలు పరిష్కరిం చాలి.

మాజీ సైనికులకు అన్ని ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్‌ పెంచి వారికి ఉద్యోగాలలో అవకాశం కల్పించాలి.

పెరుగుతున్న పేదరికం: -సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ

దేశంలో ఒకపక్క శ్రీమంతుల జాబితా గణనీయంగా పెరుగు తున్నా దానికి సమాంతరంగా ఆకలిమంటలు కూడా విస్తరిస్తుం డడం ఆందోళనకర పరిణామం.

టెక్‌, హెల్త్‌కేర్‌, పారిశ్రామిక రంగాలు దేశ సంపదనంతటినీ కేవలం 10 శాతం మంది వద్దే కేంద్రీకృతమవుతుండగా గత దశాబ్దకాలంలో పేదవారి సంఖ్య 28 శాతం పెరిగింది.

ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదవారికి తాత్కాలిక ఉపశమనం కలిగిస్తున్నా వారిని పేదరికం నుండి మాత్రం బయటకు తీయలేక పోతున్నాయన్నది అక్షరసత్యం.

ఈ ఒక్క ఏడాదిలోనే కరోనా కారణంగా ఒక కోటి 28 లక్షల మంది పేదరికంలోకి జారుకున్నారని జాతీయ కుటుంబ సం క్షేమశాఖ అధ్యయనం తెలియచేస్తోంది.

దేశంలో విధానాలకు కొదవలేదు. పథకాలపేర్లు వాటికి కేటాయించిన నిధులు కూడా ఘనంగాఉంటున్నాయి.

అయితే పర్యవేక్షణాలోపం,అవినీతి ఇత రాత్రకారణాల వలనపథకాలు అమలులో విఫలమవుతున్నాయి.

వీడియోగేమ్స్‌ను నిషేధించాలి: -సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

మొబైల్స్‌,లాప్‌టాప్‌లలో ఇప్పుడు అనేక వీడియోగేమ్స్‌ అంద రికీ ఉచితంగాలభ్యమవుతున్నాయి. వీటిలో మెదడుకుమేతపెట్టే గేమ్స్‌ స్వల్పంగా ఉండగా అధికశాతం హింసను ప్రోత్సహించే ేవిగా ఉన్నాయి.

ప్రభుత్వ చైనా వీడియో గేమ్స్‌ను నిషేధించినా అనేక ప్రత్యామ్నాయ గేమ్స్‌అందుబాటులోకి వచ్చాయి.

ఆయు ధాలు ఉపయోగించి ఇతరులను హింసించడం లేదాచంపడం వంటి ఆటలపట్ల యువత ఎంతగానో మక్కువ చూపుతున్నారు.

ఇవి వారి ప్రవృత్తిపై దుష్పరిణామాలు కనబరిచే ప్రమాదం ఉంది. ప్రభుత్వం వీడియోగేమ్స్‌ను తక్షణం నిషేధించాలి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/