సన్న వరిసాగు సానుకూలం కాదేమో!?

రైతులకు ప్రభుత్వం భరోసా ఇవ్వాలి

Thin rice cultivation
Thin rice cultivation

ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్నవడ్ల పంటపైన ఒక ప్రయోగం చేసింది. దీనిని బట్టి సన్న వరి సాగు తెలంగాణ వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా లేదని తేలిపోయింది.

ఈ విషయం రాష్ట్ర రైతాంగానికి ఇంతకుముందే తెలుసు కాబట్టి ఇంటి అవసరాల మేరకు మాత్రమే సన్నవరి సాగు చేసేవారు.

రాష్ట్ర ప్రజలందరికీ సన్న బియ్యం తినిపించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం సన్నవరి సాగు చేయాలని ఆదేశించింది.

రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లు అపారమైన నమ్మకంతో సన్నవరి సాగు చేశారు. రైతులు ఇలాంటి వైపరీత్యాలకు ముఖ్యమంత్రి కూడా ఏమీ చేయలేడు.

కానీ రైతులకు మేమున్నామని భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై, సమాజంపై ఉంది. ప్రకృతి వైపరీత్యాల మూలంగా రైతులకు పెట్టుబడి కూడా రాలేదు.

ఒక దశలో సన్నవడ్ల సాగు చేయకపోతే రైతుబంధు రాదు అనే ఒక ప్రచారం జరిగింది. దీనితో 80 శాతం విస్తీర్ణంలో సన్న వరిని సాగు చేశారు.

ప్రపంచమంతా కరోనా మహమ్మారితో కుదేలై దశాబ్దకాలం పాటు వెనుకకు పోయిన ఈ ప్రపంచం కరోనాకు రొమ్ము విరిసి నిలబడిన ఏకైక వ్యక్తి ఒక రైతు మాత్రమే.

కానీ ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా గత నెలలో కురిసిన అతి భారీ వర్షాలమూలంగా పంటలన్నీ పాడైపోయి కనీసం పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేక రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని రైతులు అంటున్నారు.

ఇప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా సుమారు ఎనిమిది మంది ఆత్మహత్య చేసు కున్నారు. గత యాసంగి బాగా పంటలు పండి ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేసింది.

దీనితో వానా కాలానికి రైతాంగం విత్తనాలతో సిద్ధంగా ఉన్నారు. ముఖ్యమంత్రిగారు చెప్పిన నియంత్రిత సాగుకు తెలంగాణ రైతాంగం సై అని రాష్ట్రవ్యాప్తంగా వానాకాలం పంటలను సాగు చేశారు.

గతంలో వరి, పత్తి, మొక్కజొన్న, ఇతర పప్పుధాన్యాలు సాగు చేసే వాళ్లు.

కానీ ఈ వానాకాలం ప్రభుత్వం చెప్పిందని మొక్కజొన్న మొత్తం బంద్‌ చేసి, దొడ్డు వడ్లకు బదులు సన్న వడ్ల పంటలు తెలంగాణా సోనా, బిపిటి, ఆర్‌ఎన్‌ఆర్‌, జైశ్రీరామ్‌, హెచ్‌ఎంటి, సోనామసూరి వంటి రకాలు సాగు చేశారు.

కనీసం వరి కోత ఖర్చులు రాక పంటలను కాలపెట్టారు. లేదంటే అట్లనే పంటను పొలంలో దున్నేస్తున్నారు.

వాతావరణం పూర్తిగా అనుకూలిస్తేనే సన్నరకం వడ్లు దొడ్డురకం వడ్లకంటే పది బస్తాలు తక్కువ దిగుబడి వస్తాయి. దీనికి పెట్టుబడి ఐదువేల నుండి ఎనిమిదివేల రూపాయల వరకు అదనంగా ఖర్చు ఉంటుంది.

చీడ,పీడలు ఎక్కువగా ఉంటాయి. నీరు కూడా ఎక్కువ కావాలి. పంటకాలం 20 నుంచి 30 రోజులు ఎక్కువ కావాలి. సన్నవరి కాండం గట్టిగా ఉండక వరదలకు, గాలికి కూడా నేల మీద పడిపోతుంది.

దీనికితోడు దోమకాటు, కాటుక రోగం, అగ్గితెగులు, కుళ్లుతెగులు, తాటాకు తెగులు, సుడితెగులు ఇలాంటి రోగాలు తొందరగా సన్న రకానికి వస్తాయి.

ఈ రోగాలకు అదనంగా రెండు,మూడు సార్లు పురుగుల మందును కొట్టాలి.

గతంలో కూడా మన రాష్ట్రంలో సన్న వరిని సాగు చేసేవారు. కానీ చాలా మంది రైతులు వారి ఇంటి భోజనానికి సంవత్సరానికి సరిపడా సన్న వడ్ల సాగు చేసేవారు.

మిగతాదంతా దొడ్డురకాన్ని సాగుచేసుకొని అమ్ముకునే వారు. కానీ ఈ సంవత్సరం ముఖ్యమంత్రిగారు చెప్పినట్లుగా నియంత్రిత సాగు విధానంలో రాష్ట్రవ్యాప్తంగా ఒక కోటి 34 లక్షల ఎకరాలు సాగు చేశారు.

వరి 52.77 లక్షల ఎకరాలు, పత్తి 60.78 లక్షల ఎకరాలు, కంది 10.78 లక్షల ఎకరాలు ప్రభుత్వం నిర్ణయించిన నియంత్రిత సాగు విధానానికి కట్టుబడి రైతాంగం సాగు చేసి ముఖ్యంగా వరి నూటికి ఎనభై శాతం మంది సన్నవడ్ల సాగు చేసుకొని దిగుబడి రాక ఆత్మ హత్యలే శరణ్యం అంటున్నారు.

సన్నవరి పంట చాలా సున్నిత మైంది. ఇది తెలంగాణ వాతావరణ పరిస్థితులకు తట్టుకుని నిలబడలేదు. తెలంగాణ వాతావరణ పరిస్థితికి దొడ్డురకం వరి ధాన్యానికి సాగుకు యోగ్యంగా ఉన్నది అనిపిస్తుంది.

ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్నవడ్ల పంటపైన ఒక ప్రయోగం చేసింది. దీనిని బట్టి సన్న వరి సాగు తెలంగాణ వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా లేదని తేలిపోయింది.

ఈ విషయం రాష్ట్ర రైతాంగానికి ఇంతకుముందే తెలుసు కాబట్టి ఇంటి అవసరాల మేరకు మాత్రమే సన్నవరి సాగు చేసేవారు.

రాష్ట్ర ప్రజలందరికీ సన్న బియ్యం తినిపించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం సన్నవరి సాగు చేయాలని ఆదేశించింది.

రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లు అపారమైన నమ్మకంతో సన్నవరి సాగు చేశారు. రైతులు ఇలాంటి వైపరీత్యాలకు ముఖ్యమంత్రి కూడా ఏమీ చేయలేడు.

కానీ రైతులకు మేమున్నామని భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై, సమాజంపై ఉంది.

ప్రకృతి వైపరీత్యాల మూలంగా రైతులకు పెట్టుబడి కూడా రాలేదు. ఒక దశలో సన్నవడ్ల సాగు చేయకపోతే రైతుబంధు రాదు అనే ఒక ప్రచారం జరిగింది. దీనితో 80 శాతం విస్తీర్ణంలో సన్న వరిని సాగు చేశారు.

పత్తి ఒక ఎకరాకు 10 నుంచి 15 క్వింటాళ్ల పత్తి దిగు బడి వచ్చేది. ఈ భారీ వర్షాల మూలంగా ఎకరానికి 3,4 క్వింటా ళ్లు మాత్రమే దిగుబడి వస్తుంది.

వర్షాలలో పత్తి పంటలో నీళ్లు నిలిచి పత్తి చేను ఎర్రబడి పత్తికాయలు రాలిపోయాయి. ఉన్న పత్తి కూడా నల్లబడి, మొలకలు వచ్చిన పత్తిని మార్కెట్లో రెండు వేల నుంచి మూడువేల రూపాయలకు చొప్పున వ్యాపారులు అడుగుతున్నారు.

ఒక ఎకరా పెట్టుబడి ముప్ఫైవేల నుంచి 40వేల రూపాయలు అవుతుంది.

ఈ సంవత్సరం ఏ రైతుకు కూడా పెట్టు బడులు కూడా వచ్చే పరిస్థితి లేదు. కావ్ఞన రాష్ట్రవ్యాప్తంగా రైతు లకు భరోసా ఇవ్వాలి. రాష్ట్రవ్యాప్తంగా 90 శాతం చిన్న, సన్న కారు రైతులు ఉన్నారు.

ఒక్క ప్రకృతి విలయానికి విలవిల్లాడు తున్న రైతులకు ఇలాంటి పరిస్థితి భవిష్యత్తులో రాకుండా ఉండా లంటే విశ్వవిద్యాలయాలు పరిశోధన చేయాలి. పంటల అన్నింటికీ పకడ్బందీగా బీమా సౌకర్యం కల్పించాలి.

ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి బీమాకంపెనీ నుండి ముక్కుపిండి వసూలు చేసి రైతులకు ఇప్పించాలి. గత రెండు సంవత్సరాల నుండి రాష్ట్రప్రభుత్వం బీమా ప్రీమియం చెల్లించకపోవడంతో రైతాంగానికి నష్టపరిహారం రాదు.

భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

ఈ విపత్కర పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని వరదబాధిత రాష్ట్రంగా గుర్తించి రాష్ట్రానికి 10వేల కోట్ల రూపాయల గ్రాంట్‌ రూపంలో ఇవ్వాలి.

పంటలకు కనీస మద్దతు ధర నిర్ణయించే హక్కు కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది.

కాబట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని పంటలన్నింటికి అదనంగా ఎంఎస్‌పి ధర వరికి 2500, రూ.పత్తికి క్వింటాలుకు ఎనిమిదివేల రూపాయలు మిగతా పంటలకు రెట్టింపు చేసి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని కొనుగోలు చేయాలి.

ముఖ్యమంత్రి జనగామ జిల్లా కొడకండ్లలో రైతు వేదిక ప్రారంభంలో మాట్లా డుతూ సన్నవడ్లకు క్వింటాలుకు 100 నుండి 150 రూపాయల వరకు పెంచుతామని సభా ముఖంగా తెలియచేశారు.

కానీ ఈ పెంపుతో రైతాంగానికి పెద్దగా గిట్టుబాటు కాదు. కాబట్టి క్వింటా లుకు 2500 రూపాయల చొప్పున కొనుగోలు చేయాలి.

అదే విధంగా పూర్తిగా నష్టపోయిన రైతులకు వరికి ఎకరానికి 15వేల రూపాయలు, పత్తికి 25వేల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలి.

బ్యాంకులో రైతుల రుణాలను రీషెడ్యూల్‌ చేసి వెంట నే కొత్త రుణాలు ఇవ్వాలి. అందరం రైతాంగానికి అండగా నిలుద్దాం.

-పులిరాజు
(రచయిత: తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/