ఎర్ర చందనాన్ని కాపాడుకోలేమా?
నిరోధించే యత్నాలు విఫలం

ఎన్ని చట్టాలు చేసినా, ఎంత మంది అధికారులను నియమించినా, ఎన్ని సార్లు హెచ్చరించినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అత్యంత విలువైన, అరుదైన ఎర్రచందనం తరలిపోతూనే ఉన్నది.
పట్టుబడిన స్మగ్లర్లపై కేసులు నమోదు చేస్తున్నారు. జైళ్లకు పంపుతున్నారు.
కొన్ని సందర్భాల్లో కాల్పులకు వెనుకాడటం లేదు. అయినా ఇవేమీ ఈ స్మగ్లింగ్‌ను ఆపలేకపోతున్నాయి.
ఈ ఎర్ర చందనం అక్రమ రవాణాను కాపాడేందుకు ఎంతోకాలం క్రితమే ఏకంగా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను కూడా ఏర్పాటు చేశారు. అవరసమైన హంగులన్నీ కల్పించాలి.
అయినా ఇది ఆగడం లేదు. ఇటీవల దాడుల్లో బయటపడుతున్న ఎర్రచందనం దుంగలు పట్టుబడుతున్న స్మగ్లర్లు ఈ విష యం చెప్పకనే చెబుతున్నాయి.
తాజాగా సోమవారం తెల్లవారుజామున కడప జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఐదుగురు స్మగ్లర్లు సజీవదహనంకాగా మరో ఇద్దరు చావ్ఞ బతుకుల మధ్యఆస్పత్రిలో మృత్యువ్ఞతోపోరాడుతున్నారు.
పెద్దఎత్తున ఎర్రచందనం దుంగలను నింపుకొని ముందు ఒక ఎస్కార్ట్ వాహనం మరొక కారులో రెండు వాహ నాలు కలిసి ప్రయాణిస్తున్న సమ యంలోనే ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
హైజాగ్ గ్యాంగ్ వెంబడించడంతో వేగం పెంచడమే కారణమని అధికారులు చెప్తున్నారు.
టిప్పర్ డీజిల్ ట్యాంకుకు వాహనం ఢీ కొట్టడంతో మంటల చెలరేగాయి. దీంతో వాహనాల్లో ఉన్న స్మగ్లర్లు ఐదుగురు సజీవదహనం కాగా మరో ఇద్దరు కాలిన గాయాలతో బయటపడ్డారు.
పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని ఆస్పత్రికి తరలించారు. మృతి చెందినవారు తమిళనాడు కు చెందినవ్యక్తులుగా ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తున్నది.
ఎర్రచందనం దుంగలు కూడా మంటలకు ఆహుతయ్యాయి.గతమూడు, నాలుగు దశాబ్దాలుగా అత్యంత విలువైన ఈ వృక్షసంపద తరలిపోతూనే ఉన్నది.
కూలికోసం వచ్చిఎర్రచందం చెట్లు కొడుతున్న తమిళనాడుకు చెందిన కూలీలు పట్టుబడుతు న్నారేతప్ప వారి వెనుక ఉన్న పెద్దల హస్తం వెలుగు చూడటం లేదు.
ఇటీవల కాలంలో తిరుపతి ప్రాంతంలో గట్టి బంధోబస్తు ఏర్పడటంతో ఇతర మార్గాల్లో తరలింపు కార్యక్రమం జరుగుతున్నది.ఆంధ్రప్రదేశ్ కడప, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మాత్రమే ఈ ఎర్రచందనం వృక్షాలు విస్తరించి ఉన్నాయి.
వీటిని 1973లో అరుదైన వృక్షజాతి జాబితాలో సైడ్స్ (కన్వెషన్ ఆఫ్ ఇంటర్నెషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పైసీస్)లోకి చేర్చారు.
దీనివల్ల ఎర్రచందనం దుంగల ఎగుమతిపై నిషేధం అమలులోకి వచ్చింది. కొన్ని ప్రాంతాల్లోనే పరిమితంగా ఉన్న ఈ వృక్షాలను సంరక్షించుకునేందుకు వెసులుబాటు కల్పించారు.
వాస్తవంగా చూస్తే ఈ ఎర్రచందనానికి మనదేశంలో పెద్దగా గిరాకీ లేదు. మార్కెట్ కూడా లేదని చెప్పొచ్చు. కానీ చైనా, జపాన్ దేశాల్లో మాత్రం ఊహించని రీతిలో డిమాండ్ ఉంది.
అది అంతకంతకు పెరుగుతుండటంతో కోట్లాది రూపాయల ఆదాయం వస్తుండటంతో ఎర్రచంద నం దుంగలను స్మగ్లర్లు అక్రమంగా విదేశాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.
సముద్ర మార్గాల ద్వారా దేశ సరిహద్దులు దాటించేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త వ్యూహాలు అనుసరిస్తున్నారు.
కొన్ని ప్రాంతాల్లో వ్యవసా యోత్పత్తుల పేరుతో భోగస్ అనుమతులు పొందుతున్నా రు.
చెన్నై, ముంబాయి, కొచిన్ తదితర రేవుల నుంచి రవాణా ఓడల ద్వారా తరలిపోతున్నది. రోడ్డు మార్గాన్ని కూడా వదిలిపెట్టడం లేదు
.ఢిల్లీ, చండీఘడ్‌లోని గోదా ముల్లో దాచిన సరుకును ఒక వ్యూహంప్రకారం నేపాల్‌కు తరలిస్తున్నారు.అక్కడ నుంచి చైనాకు రవాణాచేస్తున్నారు.
ఇదికాక, మణిపూర్, మిజోరం రాష్ట్రాల నుంచి కూడా ఈ రవాణా యధేచ్ఛగా జరుగుతున్నట్లు సమాచారం.
ఈ చెట్లు శేషాచలం, వెలుగొండల అడవ్ఞల్లో మాత్రమే పెరగడానికి కారణాలు ఏవో ఇప్పటికీ మన శాస్త్రవేత్తలు కనుగొనలేకపోతున్నారు.
కొన్ని వందల సంవత్సరాలుగా వృక్షశాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నా తెలియడం లేదు.
1700సంవత్సరంలో బ్రిటిష్ శాస్త్రవేత్తలు ఎర్రచంద నం చెట్లకు దేశంలోని వివిధ ప్రాంతాలకు చివరకు తమ దేశానికికూడా తీసుకువెళ్లి పరీక్షలు జరిపారు.
పెంచేందుకు ప్రయత్నంచేశారు.
ఏమాత్రం సత్ఫలితాలు ఇవ్వలేదు.చెట్లు పెరగడం లేదు.
పెరిగినా అందులో కావాల్సిన నాణ్యత లభించడం లేదు. ఇక ఈ చెట్లకు ఇంత విలువ ఎందుకు వస్తున్నది?ఎందుకు ఉపయోగిస్తున్నారు? అన్న విషయం లో కూడా ఇప్పటికీ స్పష్టత లేదు.
సంగీత పరికరాలకు, ఆటంబాంబుల కోసం జపాన్ వీటిని కొంటున్నదని ప్రచా రం జరిగినా అందులో అంత వాస్తవికత కన్పించడం లేదని శాస్త్రజ్ఞులే అంగీకరిస్తున్నారు.
అణు ఇంధనం తయారీలోనూ, శృంగార సామర్థ్యం పెంచే కొన్ని మందుల్లోనూ వీటిని వాడుతున్నారని ఊహాగానాలు వెలువడుతున్నాయి.
జపాన్ కానీ, చైనా కానీ వీటిని తాము ఎందుకు కొంటున్నాం, ఎందుకు ఉపయోగిస్తామనేది ఏమాత్రం బయటపడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.
అంతర్జాతీయ బయోడైవర్సీటీ అంచనా ప్రకారం ఒక టన్ను ఎర్రచందనానికి ఆ దేశాల్లో ఏడెనిమిది కోట్ల రూపాయలు ఉంటుందని చెప్తున్నారు.
అందుకే రాయల సీమలోని మాఫీయా ముఠాలు, కొందరు ఫ్యాక్షన్ నేతలు ఇంకొందరు రాజకీయవాదులు ఎర్రచందనం స్మగ్లింగ్‌ను తమ వ్యాపకంగా మార్చుకున్నారు.
అటవీ శాఖ, పోలీసు శాఖ సిబ్బందిలో కొందరు అధికారులు కుమ్మక్కవవ్ఞతు న్నారనే ఆరోపణలను కూడా కొట్టి వేయలేం.
అందుకే కూలీలు పట్టుబడుతున్నారే తప్ప ఈ స్మగ్లింగ్ వెనుక ఉన్న పెద్దల హస్తం వెలుగుచూడటం లేదు.
ఆ ప్రాంతాల్లో ఎవరిని అడిగినా ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ వెనుక పాత్ర ఎవరెవరికి ఉందో కథలుకథలుగా చెప్తున్నారు.
అయినా పాలక పెద్దలు మూలాల్లోకి వెళ్లకుండా ఈ అక్రమ స్మగ్లింగ్ నిరోధించేందుకు ప్రయత్నాలు చేయడం ప్రయోజనం లేకుండా పోతున్నది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/