అతిపెద్ద మార్కెట్‌గా భారత్‌ పరిణామం

ప్రపంచంలోనే మూడో శక్తిగా ఆవిర్భావం

largest market

నేడు భారతదేశం ప్రపంచంలోనే మూడో శక్తిగా ఎది గింది. ప్రతి దేశం భారత్‌ శాంతికాముకత్వానికి, తటస్థ విధానానికి మద్దతునిచ్చాయి.

కానీ ఇటీవల కాలంలో భారత్‌లో సంభవించిన, సంభవిస్తున్న పరిణామాలు భారత విదేశాంగ విధానాన్ని బాహాటంగా ప్రభావితం చేస్తున్నాయనేది నిర్వివా దాంశం.

1990 దశకంలో భారత్‌లో జరిగిన సంస్కరణల ఫలితంగా భారత్‌ న్యూట్రాలిటీని కోల్పోయినప్పుడు భారత్‌ ఏకైక అగ్రరాజ్యం వైపు మొగ్గు చూపింది.

కానీ సోవియెట్‌ రష్యా అన్ని విధాలుగా భారత్‌కు మద్దతునిచ్చింది. ఎప్పుడైతే సోవియెట్‌ రష్యా కుప్పకూలి 18 దేశాలుగా రష్యా కాన్ఫెడరేషన్‌గా మారిందో అప్పుడే పశ్చిమ దేశాల రాజకీయ శాస్త్రవేత్తలు,పరిశీలకులు భారత్‌ విచ్ఛిన్నమవ్ఞతుందని తలంచారు.

కానీ ఆనాటి ప్రభుత్వం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని భారత్‌ తనను తాను సంస్కరించుకొని అంతర్జాతీయంగా లింకులను ఏర్పర్చుకొని సంస్కరణలు చేపట్టి ఉదారవాదం, గ్లోబలైజేషన్‌, ప్రైవేటీకరణలతో మార్కెట్‌లతో సంధా నంచేసి తిరుగులేని దేశంగా ప్రపంచ దేశాలలో నాలెడ్జ్‌హబ్‌గా అవతరించింది.

భారత్‌ ఇతర దేశాలతో పెట్టుకున్న సంబంధాలలో రష్యాతో పెట్టుకున్న సంబంధం ఎంతో ముఖ్యమైనది. తన అగ్ర రాజ్యహోదా కోల్పోయినప్పుడు భారత్‌కు ఇచ్చిన ద్వైపాక్షిక నిధు లు, అప్పులు, చెల్లింపులు అన్నింటిని రద్దు చేసింది.

అనంతరం భారత్‌- రష్యా నూతనంగా సంబంధాలను పునఃరుద్దరించుకున్నా యి. అందుల్లో ముఖ్యంగా రక్షణ, వ్యూహాత్మక కీలకాంశాలు, ఆర్థికసంబంధాలు చాలా ముఖ్యమైనవి. అందుకే భారత్‌తో సంబంధాలు కలిగి ఉండేందుకు అన్ని దేశాలు ఇష్టపడతాయి.

కానీ చైనాకు, పాకిస్థాన్‌కు భారత్‌ విధానాలు నచ్చక వైరివైఖరిని అవ లంబిస్తూ భారత్‌ ఎదుగుదలను అరికట్టేందుకు తమ శక్తియుక్తుల ను చూపుతున్నాయి.

కానీ రష్యా- చైనా సంబంధాలు భారత్‌పై ప్రభావం చూపిస్తున్నాయి. భారత కమ్యూనిస్టులు భారత్‌-రష్యా సంబంధాలకు ఊతం కల్పించి దేశ పురోగాభివృద్ధికి తమ చేయూ తనందించారు.

భారత రక్షణరంగం 2014 తర్వాత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కూడా ఆలవాలమయింది. దానితో రష్యా అధ్యక్షు డు వ్లాదిమిర్‌ పుతిన్‌ భారత ప్రధాని నరేంద్రమోడీతో అనేకసార్లు సమావేశాలు జరిపారు.

అందులో ఇటీవల 2019 సెప్టెంబర్‌లో జరిగిన భారత్‌-రష్యాల వార్షిక సమావేశాలలో ఇంధనం, పెట్రోలి యం రంగాలలో రష్యా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది.

అంతకుముందున్న రక్షణ సంబంధాలను బలపర్చుకొంది. భారత్‌-రష్యా రక్షణ సంబంధాలతో సహా మొత్తం రెండు దేశాల మధ్య వ్యాపారం ఇప్పుడున్న 9.5 బిలియన్‌ డాలర్లను 2024 నాటికి 30 బిలియన్‌ డాలర్లకు పెంచుకోవాలని నిర్ణయించాయి.

భారత్‌కు ఎటువంటి సమస్యలు ఎదురైనా సహాయం అందించేది రష్యా. అదే 2000 సంవత్సరంలో భారత్‌లో విద్యుత్‌కొరతను తీర్చేందుకు న్యూక్లియర్‌ విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు రష్యా ముందుకు వచ్చింది. అదే చెన్నైలో ఇప్పుడున్న కడంకులం అణు విద్యుత్‌ ప్రాజెక్టును నెలకొల్పి 2016 కల్లా విద్యు త్‌ను ఉత్పత్తికి అంకురార్పణ చేసింది.

అదేవిధంగా రష్యా బొగ్గు, నీటితో నడిచే విద్యుత్‌ ప్రాజెక్టులు నెలకొల్పేందుకు ఎంతోగానో సహాయపడింది. భారత్‌ నుంచి రష్యాకు ఎగుమతి అయ్యే వాటిలో ప్రధానంగా ఫార్మారంగం 819 మిలియన్‌ డాలర్లు, ఎలక్ట్రానిక్‌ 382 మిలి యన్‌ డాలర్లు, యంత్రాలు 159 మిలియన్‌ డాలర్లు ఇలా ఎన్నో ఉన్నాయి.

అలాగే రష్యా నుంచి భారత్‌కు దిగుమతి అవ్ఞతున్న వాటిలో వజ్రాలు,విలువైనరాళ్లు 11వేల మిలియన్‌డాలర్లు, ఫెర్టిలైజ రు,ఆయిల్‌, ఇనుము, పేపరు లాంటివి ఎన్నో ఉన్నాయి.

అదే విధంగా 2019జూన్‌లో మధ్యలో ఇండో-రష్యా మధ్య రష్యా ఉపప్రధాని భారత్‌ను సందర్శించినప్పుడు రెండు దేశాల మధ్య పెట్రోలియం, న్యాచురల్‌ గ్యాస్‌, బొగ్గు గనులు, వ్యవసాయో త్పత్తులు, యంత్రరంగంలో రెండు దేశాలు ప్రతిపాదనల మీద సంతకాలు చేశాయి.

ఇంతవరకు భారత మౌలిక రంగం అభివృద్ధికి రష్యా ఎంతగానో సహాయపడింది, పడుతోంది.భారత్‌ ఆర్థికరంగం లో భారత్‌-రష్యా ఇంటర్‌ గవర్నమెంటల్‌ కమిషన్‌ను ఏర్పాటు చేసుకొని రెండు దేశాల మధ్య పెట్టుబడుల మార్పులు, ఎగుమతు లు, దిగుమతులను పెంపొందించేందుకు కృషి చేస్తున్నాయి.

ఇరు దేశాల సభ్యులు బ్రిక్స్‌, యు.ఎస్‌, జి-20 తదితర వ్యవస్థలలో సభ్యులుగా ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారత్‌ శాశ్వత సభ్యత్వానికి బాహాటంగా రష్యా మద్దతునిస్తుంది. కానీ రష్యాకు చైనాతో దగ్గర సంబంధాలున్నాయి.

భారత్‌పై కక్ష్యతో చైనా పాకిస్థాన్‌ను ఉసిగొల్పుతుంది. చైనా చూపుతున్న వివక్షతను నిరోధించేందుకు భారత్‌కు రష్యా సహాయపడాలి. అప్పుడే భారత్‌, రష్యాల సంబంధాలు మరింత దృఢంగా నిలుస్తాయి.

  • ఆసయ్య,ఐఐఎస్‌

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/