ప్రజావాక్కు

సమస్యలపై ప్రజాగళం

Voice of the people
Voice of the people

విదేశీ విరాళాలు: -సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ

పార్లమెంటు ఆమోదించిన విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లుపై దేశవ్యాప్తంగా సరైన చర్చ జరగలేదు. మన దేశంలో వివిధరంగాలను ఎన్నుకొని లక్షల సంఖ్యలో స్వచ్చంద సంస్థలు పనిచేస్తున్నాయి.

వాటికి మరింత జవాబుదారీతనం అలవర్చడమే సదరుబిల్లు ముఖ్యోద్దేశమని ప్రభుత్వం ప్రకటిం చినా దేశీయంగా అంతర్జాతీయంగా అనేక విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. పర్యావసానంగా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ తమ కార్యకలాపాలను భారత్‌లో వెంటనే ఆపివేసింది.

వచ్చే రెండు నెలలోవేలాది స్వచ్ఛందసంస్థలు భారత్‌ను తరలివెళ్లే అవకాశం ఉందని యు.ఎల్‌ ఇటీవలే ప్రకటించింది. సేవే పరమార్థంగా పనిచేస్తున్న ఎన్నోసంస్థలు వీటిలోఉన్నాయి.

దళితులు, అనాధ బాలబాలికలు వృద్ధులకు ఆశ్రయం కల్పించడం, పర్యావరణ పరిరక్షణ, లీగల్‌ ఎయిడ్‌, కార్మిక హక్కులు, మానవ హక్కుల పరిరక్షణకోసం ఎనలేని కృషి చేస్తున్నాయి.

పథకాలపై ప్రజలను చైతన్య పరచాలి: -సి.వి.ఆర్‌కృష్ణ, హైదరాబాద్‌

జంటనగరాలలో సుమారు 24 లక్షల 50వేల ఆస్తులు ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొన్నది.

ఇందులో వివిధ కారణాలతో కొన్ని ఆస్తులు హక్కులపై సమస్యలు ఉన్నాయని, 15 రోజుల్లో ధరణిపోర్టల్‌లో ఆస్తుల నమోదు కార్యక్రమంలో ప్రజాప్రతినిధులంతా చురుగ్గా పాల్గొనాలి.

ఈ బృహత్‌ పథకం ఒక్కొక్క విధి నిర్వహించేవారు ఒక్కొక్క రోజుకి సుమారు 15 ఇళ్ల వివరాలు 15 రోజులు నిర్వహిస్తే సుమారు 11వేల మంది కావాలి.

వారికి సహాయకులు మరోఇద్దరిని నియమిస్తే సుమా రు 33వేల మందిని నియమించాల్సిఉంటుంది. ‘ధరణి సేవ సాఫిగా సాగాలంటే ముందుగా ప్రజలను చైతన్యపరచాలి.

కల్లోలం రేపుతున్న కరోనా:-ఎన్‌.సాయినరేంద్ర, శ్రీకాకుళం

కరోనా మానవ జీవితంలో కల్లోలం నింపుతోంది. రోజు రోజు కు మహమ్మారిలా విజృంభిస్తున్న వైరస్‌తో అధికభాగం ప్రజల జీవితాలు చిధ్రమయ్యాయి.

కులవృత్తులను నమ్ముకుని జీవిస్తు న్న లక్షలాది కుటుంబాలకు జీవన్మరణ సమస్యగా మారింది. క్షురకుల, మేస్త్రీలు, వడ్రంగిపనివారు,చేనేత ఔళి వర్గాలు, సం ప్రదాయ కుటీర పరిశ్రమలలో పనిచేసేవారిలో లక్షల మంది పనిలేక ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు.

ప్రభుత్వం సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు వీరికి ఉపాధి కల్పించాల్సిన అవసరం ఎంతో ఉంది

విలువలు బోధించాలి: -సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

ప్రస్తుతవిద్యాసంవత్సరం ఇప్పటికేనాలుగు మాసాలు వృధా కావడం, విద్యాసంస్థలు ఎప్పటికి తెరుచుకుంటాయోనన్న అనిశ్చితి వంటికారణాల నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆదర్శనీయం,అనుసరణీయంగాఉంది.

ప్రస్తుత విద్యా సంవత్సరాన్ని జీరో ఎకడమిక్‌ ఇయర్‌గా ప్రకటించడం, వచ్చే మే వరకుఆన్‌లైనలోనే వివిధరంగాలకు చెందిన నిష్ణాతుల చేత బోధన చేయించాలని ఉత్తమ విలువలు నేర్పించాలని, వారి వ్యక్తిత్వాన్ని వికసింపచేసే తీరులో చారిత్రక, పౌరాణిక కథల నుండి నీతిచంద్రికలు, సామాజికశాస్త్రాలు, ప్రపంచ పరిణామాలు, ఇతిహాసాలు, చరిత్రలపై వీరికి అవగాహన కల్పించాలని, ఈ ఏడాది వృధాకాకుండా వారి జీవనవిధానాన్ని మెరుగుపర్చే రీతి లో విలువలు బోధించడం, మోటివేషన్‌ ప్రసంగాలు వంటివి చేయించాలన్న నిర్ణయం యావత్‌ దేశానికే ఆదర్శనీయం.

ప్రజల్లో అవగాహన కల్పించాలి:-ఎం.కనకదుర్గ, తెనాలి, గుంటూరు జిల్లా

కొవిడ్‌ వ్యాధితో మరణిస్తున్నవారి పట్లవారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు చూపుతున్ననిరాదరణ చాలా కఠినంగా ఉం టోంది. వాస్తవానికి కరోనాతో మృతిచెందిన వ్యక్తి శరీరంలో ఆరుగంటల అనంతరం కొవిడ్‌ క్రిములు నశిస్తాయి.

శాస్త్రవేత్తలు పదేపదే హెచ్చరిస్తున్నా ఎవ్వరికీ పట్టడం లేదు. కనీసం మృత దేహాన్నిచివరిచూపు చూసేందుకుకూడా ఎవరూ సాహసించడం లేదు.

పారిశుద్ధ్య పనివారు కొన్ని సందర్భాలలో మృతదేహాల ను సంచుల్లో చుట్టి స్మశానాలలో పూడ్చిపెడుతున్నారు.

ఈ వ్యాధితో మరణం మనుషుల్లో నిబిడీకృతమైన రాక్షసత్వాన్ని బయటకు తీస్తూ మనవత్వాన్ని చంపేస్తోంది.అనేక సందర్భాల లో కొవిడ్‌ మృతదేహాల అంత్యక్రియలకు గ్రామస్తులు అడ్డం పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రజలలో నెలకొన్న అపోహలను తొలగించేందుకు కృషి చేయాలి

మందుల కొరతను అధిగమించాలి:-జి.రామకృష్ణ, నల్గొండ

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యం లో అన్ని ఆస్పత్రులు, ప్రభుత్వ మందుల షాపులలో డయా బెటీస్‌, కిడ్నీ, థైరాయిడ్‌, ఇతర వ్యాధి సంబంధిత అత్యవసర మందులు లభ్యమయ్యేలా చర్యలు తీసుకోవాలి.

ఇప్పటికే కొన్ని పెద్ద నగరాల్లో వ్యాపారులు మందుల కొరత సృష్టిస్తున్నారు. రాష్ట్రవైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మందుల లభ్యతపై నివేదికలు తయారు చేయించాలి.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/