అక్రమ వ్యాపార వలలో జంతు ప్రపంచం

వన్యప్రాణి చట్టాలను గట్టిగా అమలు చేయాలి

Wildlife
Wildlife

పులి చర్మం, ఖడ్గమృగం కొమ్ము, ఏనుగు దంతం కాదేదీ అక్రమ రవాణాకు అనర్హం అన్నట్లుగా ఏటా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న జంతువుల అక్రమ రవాణా విలువ 51,882 కోట్ల ఎనభై నాలుగు లక్షల రూపాయలు.

వందేళ్ల క్రితం ప్రపంచవ్యాప్తంగా లక్షకుపైగా ఉన్న పులుల సంఖ్య 2015 నాటికి నాలుగువేలు మాత్రమే ఉన్నాయి. తర్వాత అత్యంత తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటున్న జంతువులు ఏనుగులు దంతాల కోసం ఇరవైవేల ఏనుగులను వధిస్తున్నారు.

ఇంకా ఖడ్గమృగాలు, సముద్ర తాబేళ్లు, సింహాలు వేటకు బలైపోతున్నాయి. గత నాలుగు దశాబ్దాల్లో వియత్నాంలో 12 రకాల జీవజాతులు అంతరించిపోయాయి.

కారణం బెల్టులు, చెప్పులు అలంకరణ వస్తువులు, సౌందర్యసాధనాలు, ఆహార పదార్థాల వంటి అనేక రకాల వస్తువుల తయారీలో జంతువుల మాంసం, ఎముకలు, అవయవాలు వినియోగిస్తున్నారు.

ప్రపంచంలోని ఎన్నోరకాల జీవకోటికి ఆశ్రయం ఇస్తున్న గ్రహం భూమి. భూమి కేవలం మానవుడు సొత్తు కాదు. అన్నిరకాల జంతువులు, మొక్కలకు భూమిపై బతికే హక్కు ఉంది.

అయితే మన అత్యాశే, సాంకేతిక పరిజ్ఞానం పేరుతో జరుగుతున్న అభివృద్ధి, జరుగుతున్న వినాశనం మిగతా జీవజాలానికి ఉరిబిగిస్తోంది.

పారిశ్రామికీకరణతో ఇబ్బడి ముబ్బడిగా వెలువడుతున్న విషవాయువ్ఞలు భూమ్మీద ఉష్ణోగ్ర తను పెంచేస్తున్నాయి. దీంతో ప్రకృతి సమతుల్యం దెబ్బతిని జంతురక్షణ కరవవుతోంది.

ఇప్పటికే విచ్చలవిడిగా వేటాడటం, కళేబరాలకు పంపటం, అడవ్ఞలను నరికివేయడం, కార్చిచ్చుల వల్ల జంతువుల ఉనికికి పెను ప్రమాదం ఏర్పడింది.

మనిషి స్వార్థానికి అవి ఆహారం మారి చిక్కిశల్యం అజంతురక్షణ కరవవుతోంది.తున్నాయి. దీంతో జంతు ప్రపంచం కలవరం చెందుతుంది.

ఆకలయితేనే జంతువుని వేటాడే లక్షణమున్న ఒక పులి బతికి ఉందంటే 100 చదరపు కిలోమీటర్ల అడవి పచ్చగా జీవంతో ఉన్నట్లే. జీవ వైవిధ్యం ఫరిడవిల్లుతుంది.

కాని వాతావరణ మార్పుల కార ణంగా భూమి మీద దాదాపు లక్ష జీవజాతులు అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటున్నాయి.

వన్యప్రాణుల అక్రమ రవాణా పెరిగిపోతుండటంతో జంతువ్ఞల సంఖ్య రోజురోజుకి తగ్గిపో తుంది. ఇందుకు నిదర్శనమే జంతువుల నుంచి తయారు చేసే వస్తువుల అక్రమ వ్యాపారం ఏడు నుండి పది బిలియన్‌ డాలర్లు సుమారు 35 నుంచి 50 వేల కోట్లు ఉంటుందని అంచనా.

మనం విడుదల చేసే కర్బన్‌ అనేక జంతువులపైనే కాక వాటి పునరుత్పత్తి ప్రక్రియను దెబ్బతీస్తుంది. జంతువ్ఞల చర్మం, దంతాలు, ఎముకలు, వెంట్రుకలు గోళ్లు మాంసం అవయవాలను అక్రమ వ్యాపారం చేసే స్మగ్లర్లు, వేటగాళ్ల వలలో జంతు ప్రపంచం విలవిల్లాడుతోంది.

పులి చర్మం, ఖడ్గమృగం కొమ్ము, ఏనుగు దంతం కాదేదీ అక్రమ రవాణాకు అనర్హం అన్నట్లుగా ఏటా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న జంతువుల అక్రమ రవాణా విలువ 51,882 కోట్ల ఎనభై నాలుగు లక్షల రూపాయలు.

వందేళ్ల క్రితం ప్రపంచవ్యాప్తంగా లక్షకుపైగా ఉన్న పులుల సంఖ్య 2015 నాటికి నాలుగువేలు మాత్రమే ఉన్నాయి. తర్వాత అత్యంత తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటున్న జంతువులు ఏనుగులు దంతాల కోసం ఇరవైవేల ఏనుగులను వధిస్తు న్నారు.

ఇంకా ఖడ్గమృగాలు, సముద్ర తాబేళ్లు, సింహాలు వేటకు బలైపోతున్నాయి. గత నాలుగు దశాబ్దాల్లో వియత్నాంలో 12 రకాల జీవజాతులు అంతరించిపోయాయి.

కారణం బెల్టులు, చెప్పులు అలంకరణ వస్తువ్ఞలు, సౌందర్యసాధనాలు, ఆహార పదార్థాల వంటి అనేక రకాల వస్తువుల తయారీలో జంతువుల మాంసం, ఎముకలు, అవయవాలు వినియోగిస్తున్నారు. ఖడ్గ మృగం కొమ్ములో కేన్సర్ను తగ్గించే లక్షణం ఉందని ఆఫ్రికా దేశస్తుల నమ్మకం.

ఆ కొమ్ముతో తయారు చేసిన కప్పుతో మంచినీళ్లు,కాఫీ,టీ లాంటివి తాగినా ఆరోగ్యంగా ఉంటామని మరికొందరు విశ్వసిస్తారు. స్వీడన్‌కు చెందిన నేషనల్‌ పోలీస్‌ఫర్‌ ఎన్విరాన్మెంట్‌ క్రైమ్‌ బృందం గతంలో చెప్పింది.

2009నాటి లెక్కల ప్రకారం ఖడ్గమృగం కొమ్ము ధర కిలో దాదాపు 20 లక్షలు, ఇప్పుడైతే 30 నుంచి 40 లక్షలకుపైనే ఉండొచ్చని అంచనా.

పులి, చిరుతపులి, ఎముకలు, గోళ్లు, వెంట్రుకలు, ఇతర భాగాలకు ఆసియాలోని పలు దేశాల్లో బాగా గిరాకీ ఉంది.బాగా ఎదిగిన పులి చర్మానికి అక్రమ మార్కెట్లో 18 లక్షల ధర ఉంటుందని అంచనా.

పులి ఎముకల నుంచి తయారు చేసే జిగురుకు ఒక పౌండుకు లక్ష రూపాయలుపైగానే ఖరీదు. వన్యప్రాణుల స్వచ్ఛంద సంస్థ ట్రాఫిక్‌ గణాంకాల ప్రకారం పులి ఎముకల వైన్‌ఒక్క సీసా రెండువేల నుంచి ఐదువేల దాకా అమ్ముతారని పేర్కొంది.

చైనీయులు వీటిని ఎక్కువగా సేవి స్తారు. ఎలుగుబంటి శరీరంలో నుండి విడుదలయ్యే పైత్యర సాన్ని చైనా సంప్రదాయ వైద్యంలో మందుల తయారీలో వినియోగిస్తారు.

ఎలిఫెంట్‌ ట్రేడ్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం లెక్కల ప్రకారం 1989-2009 మధ్య డమొక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో లో అక్రమంగా రవాణా అవుతున్న 15562 రెండు కిలోల ఏనుగుదంతాలు, టాంజానియాలో సీజ్‌ చేసిన ఏనుగు దంతాలు 76293 కిలోలు అధికారులు పట్టుకోవడం నిదర్శనం.

ఒక్క ఆఫ్రికాలోనే రెండేళ్ల కాలంలో లక్ష ఏనుగులు నేలకూలాయి. 179 ఏనుగు దంతాలు అక్రమంగా సరిహద్దులు దాటాయి. ఒక జాతిలోని అన్ని జీవులు మరణిస్తే ఆ జాతిని అంతరించిపోయిన జాతిగా పేర్కొంటారు.

ఈ పరిస్థితులను మెరుగుపరిచకపోతే సమీప భవిష్యత్తులో అంతరించిపోయే దుర్భరమైన జాతి దుర్భలమైనవి, సంఖ్యాపరంగా పర్యావరణం భక్షక అంశాల వల్ల అంతరించిపోయే అవకాశం ఉన్నది.

వన్యప్రాణుల సంరక్షణపై ప్రపంచదేశాలు చట్టపరమైన చర్యలు చేపట్టడానికి ఐక్యరాజ్య సమితి వాతావరణ కార్యక్రమం (యుఎన్‌ఇపి) ఆధ్వర్యంలో వన్యప్రాణుల వలస జాతుల రక్షణకై అంతర్జాతీయ వలస జాతుల భాగస్వామ్య పక్షాల సదస్సు ప్రతి మూడు సంవత్సరా లకు ఒకసారి నిర్వహిస్తూ వాటి సంరక్షణ చర్యలపై చర్చించడం జరుగుతోంది.

ఆ జాతులను సంరక్షించడానికి తగిన విధంగా చర్యలు చేపట్టాలని ప్రపంచదేశాలను ఆదేశిస్తుంది. భారతదేశం లో కాలక్రమంలో సింహాల సంఖ్య డజనకు పడిపోవడంతో స్వాతంత్య్రం తర్వాత 1965లో 258 చదరపు కిలోమీటర్ల పరిధిలో సింహాల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

ప్రస్తుతం నేషనల్‌ పార్క్‌లో 550కి పైగా సింహాలు ఉన్నాయి.

300 చిరుతలు, జింకలు నాలుగు కొమ్ముల జింకలు, నక్కలు వేట కుక్కలకు నిలయంగా మారింది. జీవవైవిధ్యానికి అడ్రస్‌గా మారింది గిర్‌ అటవీప్రాంతం.

పడమటి కనుమలలోని పెరియార్‌ నేషనల్‌ పార్క్‌లో ఏనుగులు, జింకలు కొండముచ్చులు పెద్ద పులులు ఉండగా 40వరకు పులులను వెయ్యికిపైగా ఏనుగులు సంరక్షించబడుతున్నాయి.

ప్రస్తుత సమకాలీన పరిస్థితులకను గుణంగా నూతన విధానాలతో భూమి, ఆకాశం, నీటిలో నివసి స్తున్న వన్యప్రాణుల మనుగడకై కృషి చేయాలి.

జీవవైవిధ్య సమతుల్యతలో వన్యప్రాణుల ప్రాముఖ్యతపై పాఠశాల స్థాయి లోనే అవగాహన కలిగించాలి. వన్యప్రాణుల సంరక్షణలో ప్రభు త్వానికి,అటవీ అదికారులకు సహకరించాలి.

వన్యప్రాణి చట్టాలను గట్టిగా అమలు చేయాలి. జంతుబలులు నిషేధించాలి.

  • కొల్లు లక్ష్మీనారాయణ
    (రచయిత: పర్యావరణ పరిరక్షణ ఉద్యమకారుడు)

తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/