మిడతలతో ముంచుకొస్తున్న ముప్పు

grasshoppers
grasshoppers

మిడతలు వేగవంతమైన సంతానోత్పత్తిని కలిగి ఉంటాయి. ఒక్కొక్క ఆడమిడత వందల కొలది గ్రుడ్లను పెడుతుంది. ఇవి దండు-దండులుగా సుదూర దూరాలకు వెళ్లగలవ్ఞ. ఒక్కో దండు విస్తృతి 30-35 కిలోమీటర్ల వరకు ఉంటుంది. మిడతలు ఆహారం తీసుకునే సామర్థ్యం పశువ్ఞల కంటే చాలా వేగంగా ఉంటుందని, పశువ్ఞలతో పోలిస్తే ఇవి 8 రెట్లు వేగంగా పంటలను నాశనం చేస్తాయని బ్రిటన్‌ ఆహార, పర్యావరణ సంస్థ పేర్కొంది.

మిడతలతో ముంచుకొస్తున్న ముప్పును నివారించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. దేశ ఆహార భద్రతకు హాని చేస్తోన్న వీటి నిర్మూలనకు యుద్ధప్రాతిపదికన చర్యలు గైకొనాలి. డ్రోన్‌లతో క్రిమిసంహారక మందులను మిడతలపై పిచికారీ చేస్తే ప్రయోజనముంటుంది. డ్రోన్‌ యంత్రాలను వ్యవసాయశాఖకు అందుబాటులో ఉండేవిధంగా ప్రభుత్వం కృషి చేయాలి. వ్యవసాయ శాఖ అధికారులు రైతులను మిడతల విషయంలో చైతన్యపర్చాలి.

ని త్యం పాకిస్థాన్‌ నుండి ఉగ్రవాదులు భారతదేశం లోకి చొరబడి ప్రజల ప్రాణాలు తీస్తూ విధ్వంసం చేస్తుంటే మరో వైపు అక్కడి నుండి వస్తోన్న మిడ తల దండు పంటపొలాలను నాశ నం చేస్తూ దేశ ఆహార భద్రతకు పెను ముప్పుగా పరిణమిస్తున్నా యి. మన సరిహద్దు దేశాలైన చైనాలో కరోనా వైరస్‌తో ప్రజల ప్రాణాలు గాల్లోకలుస్తూ వేగంగా విస్తరిస్తూ ప్రపంచాన్ని వణికిస్తుంటే, పాకిస్థాన్‌ వ్యవసాయ భూముల్లో మిడతలు స్వైరవిహారం చేస్తూ పంటల ఉత్పత్తిని దారుణంగా దెబ్బతీస్తూ మనదేశం వైపు దూసుకువస్తున్నాయి.

మిడతల దాడికి గుజరాత్‌, రాజస్థాన్‌, పంజాబ్‌ రైతులు బెంబేలెత్తుతున్నారు. సాధారణంగా ఒక దేశానికి ఇతర దేశాలతో యుద్ధ పరిస్థితులు ఏర్పడినప్పుడు లేదా దేశంలో అంతర్గత శాంతి భద్రతలకు విఘాతం సంభవించినప్పుడు అత్యవసర పరిస్థితిని విధించడం ఆనవాయితీగా వస్తోంది. పాకిస్థాన్‌ ప్రభుత్వం మిడతల దండును యుద్ధప్రాతిపదికన నిలువరించడానికి దేశంలో ఎమర్జెన్సీ విధించడం సంచలనంగా మారింది. మిడతలను అరికట్టడానికి 730 కోట్ల రూపాయలను కేటాయించింది.

వ్యవసాయ ఉత్పత్తులకు ప్రధాన కేంద్రంగా ఉన్న పంజాబ్‌ ప్రావిన్స్‌తోపాటు మరికొన్ని ప్రాంతాల్లోని వ్యవసాయక్షేత్రాల్లోకి మిడతలు విరుచుకుపడటంతో విధిలేని పరిస్థితుల్లో ఎమర్జెన్సీ విధించింది. మిడతల దండును నిర్మూలించడానికి అధికారులు ప్రణాళికబద్ధంగా పనిచేయాలని ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ ఆదేశించడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది.

నేడు ప్రపంచంలోని అనేక దేశాల రైతులకు మిడతలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎండనక వాననక ఆరుగాలం కష్టించి తీరా పంట చేతికందే సమయానికి మిడతలు ధ్వంసం చేయడం రైతులను కన్నీరు పెట్టిస్తోంది. పెట్టిన పెట్టుబడి వస్తుందో రాదో తెలియని పరిస్థితుల్లో సాగు బరువై అప్పుల ఊబిలో కూరుకుపోతున్న మానవాళికి ఆహార భద్రతను కల్పిస్తోన్న రైతుల పరిస్థితి రోజురోజుకు దుర్భరమవ్ఞతోంది. అతివృష్టి, అనావృష్టికి తోడు పంటలకు వివిధ తెగుళ్లు సోకడంతో తీవ్ర నష్టం వాటిల్లుతుండగా వీటికి మిడతలుతోడై సర్వనాశనం చేస్తున్నాయి. ప్రస్తుతం మిడతల దాడికి ఆఫ్రికా విలవిల్లాడుతోంది.

ఇది గత 25ఏళ్లలో కనీవినీ ఎరుగని దాడి అని ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఎఒ) తెలిపింది. పలు దేశాల ప్రభుత్వాలను ఇవి హడలెత్తిస్తుండటంతో వీటి నివారణపైనే దృష్టి కేంద్రీకరిస్తున్నది. కెన్యా, ఇథియోపియా, సోమాలియా, సుడాన్‌, ఎరిట్రియా దేశాలలో సమస్య ప్రమాదకరంగా ఉంది. 2017లోనే మిడతల దాడికి బొలీవియా అత్యవసర పరిస్థితిని విధించింది. సోమాలియాలో పరిస్థితి విషమించడంతో ఫిబ్రవరి 2నే ఎమర్జెన్సీ ప్రకటించింది.

చిన్న తరహా విమానాలతో పంటపొలాలపై క్రిమిసంహారక మందులు వెదజల్లుతున్నారు. తూర్పు ఆఫ్రికాలో వీటిని వేగంగా నిర్మూలన చేయడానికి తక్షణం 9.6 కోట్ల డాలర్లు అవసరమని ఐరాస ప్రకటించింది. ఈ కీటకాలను త్వరితగతిన కట్టడి చేయకుంటే జూన్‌ నాటికి వీటి సంఖ్య దాదాపు 500 రెట్లు పెరిగే అవకాశ ముందని వ్యవసాయశాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మిడతలు ఆఫ్రికాలోని సుడాన్‌, ఎరిట్రియా దేశాల నుంచి సౌదీ అరేబియా, ఇరాన్‌ ద్వారా పాకిస్థాన్‌లో ప్రవేశించి సింధ్‌ రాష్ట్రంలోని ఎడారి ప్రాంతంగుండా భారతదేశానికి వస్తున్నాయి. పాకిస్థాన్‌ నుంచి భారత్‌వైపు దూసుకువస్తున్న మిడతలతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు.

1993 తర్వాత ఇంత భారీస్థాయిలో మనదేశంపై మిడతలు దాడి చేయడం ఇదే మొదటిసారి. గుజరాత్‌, రాజస్థాన్‌, పంజాబ్‌ రాష్ట్రాల రైతులు వీటి దాడికి తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికే ఈ మూడు రాష్ట్రాల్లో 3.5 లక్షల హెక్టార్లలో పంటలను ఈ కీటకాలు నాశనం చేశాయి. పత్తి, బంగాళదుంప, గోధుమ, ఆవాలు, ఆముదం, జీలకర్ర తదితర పంటలను ఇవి ఊడ్చేశాయి. రైతుల పంటలు చేతికందే సమయానికి మిడతల దండు కతిరించివేస్తున్నాయి.

ఇటీవల పంజాబ్‌లోని ఫజిల్కా జిల్లాలోని బొకెన్‌వాలా, రూప్‌నగర్‌ గ్రామాల ప్రజలు మిడతల కారణంగా తమ పంటలు దెబ్బతింటున్నాయని వ్యవసాయశాఖ అధికారులకు మొరపెట్టు కున్నారు. పంజాబ్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, వ్యవసాయశాఖ అధికారులు,సరిహద్దుభద్రతాదళం జవాన్లు, పోలీసులు, ఉద్యానవన శాఖ, స్థానిక అధికారులు, రైతులు కలిసి 500 టన్నుల పురుగు మందులను స్ప్రే చేసి మిడతలను తాత్కాలికంగా అరికట్టారు.

ఇటీవల పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ వీటిని నియంత్రించాలని ప్రధానికి లేఖ రాశారు. గుజరాత్‌లో వేల హెక్టార్ల పొలాల్లో పంట నష్టం వాటిల్లింది. వీటిని ఎదుర్కోవడానికి అధికారులు పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. సమస్య తీవ్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం 11 బృందాలను గుజరాత్‌కు పంపింది. బనాస్‌ కాంఠా, మహసానా, కచ్‌, సాబర్‌కాంఠా తదితర ప్రాంతాల్లో నష్టపోయిన రైతులకు గుజరాత్‌ ప్రభుత్వం పరిహారం చెల్లిస్తామని ప్రకటించింది. పొలాల్లో టైర్లను మండించడం, డప్పు ప్లేట్లను మోగించడం, ఫ్యాన్లను పెట్టడం, లౌడ్‌స్పీకర్లతో సంగీతం పెట్టడం లాంటి కార్యక్రమాలతో వీటిని చెదరగొట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రధానంగా మిడతలు ఎడారి ప్రాంతాల్లో ఉంటాయి. ఎడారి ప్రాంతాల నుండి భారీ వర్షాలు పడిన చోటుకు ప్రయాణమవ్ఞతాయి. కొన్ని పర్యాయాలు తెలంగాణ, ఇతర రాష్ట్రాలలో కూడా మిడతల దండు పంటలకు నష్టం కలిగిస్తున్నాయి. కొద్ది మాసాల క్రితం సిద్ధిపేట, మెదక్‌, జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మిడతలు మొక్కజొన్న పంటను నాశనం చేశాయి.

ఒకటి రెండు రోజుల వ్యవధిలోనే పంటను నిర్వీర్యం చేశాయి. మిడతలు వేగవంతమైన సంతానోత్పత్తిని కలిగి ఉంటాయి. ఒక్కొక్క ఆడమిడత వందల కొలది గ్రుడ్లను పెడుతుంది. ఇవి దండు-దండులుగా సుదూర దూరాలకు వెళ్లగలవ్ఞ. ఒక్కో దండు విస్తృతి 30-35 కిలోమీటర్ల వరకు ఉంటుంది. మిడతలు ఆహారం తీసుకునే సామర్థ్యం పశువ్ఞల కంటే చాలా వేగంగా ఉంటుందని, పశువ్ఞలతో పోలిస్తే ఇవి 8 రెట్లు వేగంగా పంటలను నాశనం చేస్తాయని బ్రిటన్‌ ఆహార, పర్యావరణ సంస్థ పేర్కొంది.

మిడతలతో ముంచుకొస్తున్న ముప్పును నివారించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. దేశ ఆహార భద్రతకు హాని చేస్తోన్న వీటి నిర్మూలనకు యుద్ధప్రాతిపదికన చర్యలు గైకొనాలి. డ్రోన్‌లతో క్రిమిసంహారక మందును మిడతలపై పిచికారీ చేస్తే ప్రయోజనముంటుంది. డ్రోన్‌ యంత్రాలను వ్యవసాయశాఖకు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం కృషి చేయాలి. వ్యవసాయ శాఖ అధికారులు రైతులను మిడతల విషయంలో చైతన్యపర్చాలి.

  • బిల్లిపెల్లి లక్ష్మారెడ్డి

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/