ప్రజావాక్కు: ప్రజా సమస్యలపై గళం

Voice ot the people
Voice ot the people

నిజాయితీగా ఓటు వేయండి: – కాయల నాగేంద్ర, హైదరాబాద్‌

తెలంగాణ పురపాలక ఎన్నికల్లో డబ్బే ప్రధానపాత్ర పోషి స్తోంది. డబ్బుంటే చాలు సులభంగా గెలవచ్చు అనే ఉద్దేశ్యం తోనాయకులు విచ్చలవిడిగా డబ్బుఖర్చుపెడుతున్నారు. ఓటర్లు కూడావారిచ్చే డబ్బుకుఆశపడి ఎవరు ఎక్కువఇస్తే వాళ్లకే ఓటు అంటున్నారు. దాంతో రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు విలువ కోల్పోతోంది. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనది.ఒకమంచి నాయకుడిని ఎన్నుకొనే ఆయుధం కూడా నూ.అయితే నేడు ఆ ఆయుధాన్ని అవినీతిపరులను ఎన్నుకోవ డానికి ఉపయోగించడం బాధాకరం. అవినీతితో సంపాదించిన డబ్బుకోసం పవిత్రమైన ఓటును అమ్ముకోవడం సిగ్గుచేటు. ఈ చెడు సంప్రదాయాన్ని రూపుమాపడానికి ఓటర్లు మారాలి. డబ్బు ఆశ చూపించే నాయకులను చిత్తుచిత్తుగా ఓడించాలి. లేకుంటే అవినీతి కంపులో మనం కూడా కొట్టుకుపోతాం. అందుకే మద్యం, డబ్బు, కులాన్ని చూడకుండా నిజాయితీగా ఓటు వేయండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.

అధ్వాన్నంగా నీటిపారుదల వ్యవస్థ:-సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ

తెలంగాణ రాష్ట్రంలోనిండిన ప్రాజెక్టుల్లోని నీటినిచూసి సంతో షించిన రైతులు ఆ నీటి పారుదల వ్యవస్థ అధ్వాన్నంగా ఉన్న కారణంగా ఆ నీరు తమ పొలాలకు అసలు చేరుతుందో లేదో నని ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో ప్రధాన కాలువల లైనింగ్‌, పాడైపోవడం, గండ్లుపడే పరిస్థితి వ్ఞన్న ప్రాంతాలు, ఆ పిల్ల కాలువలు వ్యవస్థ ధ్వంసమైపోవడం కారణంగా నీరు వృధా అవుతోంది. గత అయిదేళ్లలో పలు ఆక్వాడెక్టులు, డిస్ట్రి బ్యూటరీలు,తూములకు చిన్నపాటిమరమ్మతులుకూడా చేపట్టక పోవడంవలన చివరి ఆయకట్టుకు కనీసస్థాయిలో నీరు అందక రైతులు వ్యధకు లోనవ్ఞతున్నారు.జూరాల జలాశయం డిస్ట్రీ బ్యూటరీ వ్యవస్థశిధిలావస్థకు చేరుకున్నకారణంగా చివరి ఆయ కట్టు ఎండిపోతోంది. జోగులాంబ గద్వాల జిల్లాలో 90శాతం కాలువల్లో నీరు పారకపోవడం వలన ముళ్లపొదలు పెరిగాయి.

సిలబస్‌ మారాలి:-వి.కనకమ్మ,విశాఖజిల్లా

ప్రతి విద్యార్థికి సిలబస్‌ అనేది చాలా ముఖ్యం. ప్రతి తరగతికి సిలబస్‌ ఉంటోంది. కాని నేటి సిలబస్‌లో పనికిరాని, కష్టమైన లెక్కలు, కేవలం కాలయాపన చేసే పాఠాలుంటున్నాయి. జీవి తంలో పనికివచ్చేలెక్కలు,మూఢనమ్మకాలను విమర్శించే పాఠా లు, మానవతా విలువలు, పంచతంత్రంలోని పాఠాలు అన్ని మతాల నుండి గ్రహించిన పాఠాలు ఉండాలి.

అమలు కాని వేతనచట్టం:-ఎం.కనకదుర్గ,తెనాలి,గుంటూరుజిల్లా

దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన70సంవత్సరాలలో దేశం శాస్త్రీ యంగా, సామాజికంగా, సాంకేతికంగా ఎంతో చక్కని అభివృద్ధి సాధించిందన్నదినిర్వివాదాంశం.అయితే దురదృష్టవశాత్తు దేశం కోసం ప్రజల కోసం వారి అవసరాలు తీర్చడానికి అహర్నిశలు శ్రమిస్తున్న కార్మికులు, కర్షకుల జీవితాలలో ఎలాంటి మార్పు కానరాకపోవడం బాధాకరం. కర్మాగారాలలో నిరంతరం పని చేస్తూ దేశాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు శాయాశక్తులా కృషి చేస్తున్న కార్మికులకు తగినంత జీవనభృతి లభించడం లేదు. వారికి గౌరవప్రదమైన జీవనం కోసం ప్రభుత్వం తీసుకు వచ్చిన కనీస వేతనాల చట్టం అధికశాతం సంస్థలలో అమలు కావడం లేదు. ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రజాప్రతినిధులకు, ప్రతి అయిదు సంవత్సరాలకు ఠంచనుగా వేతన సవరణలు జరుగు తుండగా, కార్మికులకు మాత్రం అరకొర వేతనాలు లభించడం, వారి సంక్షేమం కోసం నిర్దేశించిన అధికశాతం చట్టాలు అమలు కాకపోవడం బాధాకరం.

రైళ్లను రద్దు చేయడం భావ్యం కాదు: -సి.ప్రతాప్‌, శ్రీకాకుళం


రెండు తెలుగు రాష్ట్రాల నుండి హైదరాబాద్‌నగరానికి డబ్లింగ్‌ పనులు, ఎం.ఎం.టి.సి 2వ దశ పనుల కోసం 13 ప్యాసింజర్‌ రైళ్లను ఎనిమిది నెలలపాటు దక్షిణమధ్యరైల్వే రద్దు చేయడం దారుణం. హైదరాబాద్‌ చుట్టుపక్కల ప్రాంతాల నుండి నిత్యం లక్షల సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటాయి. తక్కువ ఛార్జీల కారణంగా ప్రయాణీకులు ప్యాసింజర్‌ రైళ్లపైనే ఎక్కువగా ఆధా రపడుతుంటారు.అకారణంగా రద్దుచేయడంద్వారా వీరిపై పెను ప్రభావం పడనుంది. ఆయా మార్గాలలోవచ్చే ఇతర రైళ్లకు అద నపు బోగీలు ఏర్పాటు వంటి ప్రత్యామ్నాయం లేకుండా రైళ్లను రద్దుచేసి ప్రయాణికులను ఇబ్బందులోకి నెట్టడం భావ్యంకాదు.

ప్రజలను మోసం చేశారు: -ఎం.శ్రీనివాస్‌, హైదరాబాద్‌

ప్రతిపక్షంలో ఉండగా జగన్‌ ఎపికి ప్రత్యేక హోదా కోసం పోరా డారు.లోక్‌సభలో ఈ అంశాన్నిలేవనెత్తారు.తీవ్రస్థాయిలో ఆందో ళనలు, నిరసనలు చేశారు. ఎపికి ప్రత్యేకహోదా ఇచ్చేవరకు ఊరుకునేది లేదన్నారు.అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కాదు అధికారంలోకి వచ్చాక కూడా ఆయన ప్రత్యేకహోదా సాధించ లేకపోయారు. ఆయన అసలు ప్రత్యేకహోదా ఊసే ఎత్తడం లేదు. ప్రత్యేహోదా విషయంలో బిజెపి ముందొకమాట, తర్వా త ఒకమాట చెప్పింది. రెండు పార్టీలు కలిసి ఎపి ప్రజలను దారుణంగా మోసం చేశారు.

తాజా కెరీర్‌ సమాచారం కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/