ప్రజావాక్కు

సామాజిక సమస్యలపై ప్రజాగళం

Voice of the people
Voice of the people

హక్కులకు భంగం కలిగిస్తే శిక్షార్హులు:-పోలోజు కృష్ణమాచారి, హైదరాబాద్‌

బతికున్న వారితోపాటు మరణించిన ప్రతి ఒక్కరికి హక్కులు న్నాయని వారివారి మత ఆచారాల ప్రకారం గౌరవ మర్యాదల తో దహనసంస్కారాలు చేసుకునే హక్కువుంది.

అలా కాకుండా ఈ కరోనా సమయంలో బతికి ఉన్న వారు చనిపోయిన వారి మృతదేహాలకు జరుగు అంతిమ సంస్కారాలను అడ్డుకోవడం, వారి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేయడం భారతీయ శిక్షాస్మృతి సెక్షన్‌ 297,341,147,148 ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ ప్రకారం శిక్షార్హులు అని మానవ హక్కుల పరిరక్షణ కమిటీ పేర్కొంది.

ప్రభుత్వం సూచన మేరకు ప్రభుత్వం కొవిడ్‌-19నియమనిబంధనలప్రకారం పరిమితికి మించకుండా బంధువ్ఞలు, స్నేహితులు తగుజాగ్రత్తలు తీసుకుంటూ వ్యక్తుల మధ్య దూరం పాటించడం,ముఖానికి మాస్కులు, చేతులకు గ్లౌజులు ధరించడం, శానిటైజర్‌ విడిగా ఉపయోగించి అంత్య క్రియలకు హాజరు అవ్వొచ్చని పేర్కొంది.

భారత్‌ అప్రమత్తంగా ఉండాలి:-సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

చైనా తరచుగా కవ్వింపు చర్యలకు పాల్పడడంపై భారత్‌ అప్ర మత్తంకావాలి.పిఎల్‌ఎ బలగాలుతరచూ భారత భూభాగంలోకి చొరబడడం, సరిహద్దులు దాటి వచ్చి శిబిరాలు, నిర్మాణాలు ఏర్పాటు చేయడం,సామాగ్రిని ఆయుధాలు,సైనిక మొహరింపు వంటిచర్యలకుపాల్పడుతోంది.

హిమాలయపర్వత ప్రాంతాల లో, కొండల్లో,లోయల్లో డ్రాగన్‌ కదలికలను నిశితంగా గమ నించేందుకు ఉపగ్రహాల సహాయం తీసుకోవాలి.వీలైనంత మేరకు రోడ్ల నిర్మాణం, ఎయిర్‌పోర్ట్‌ చేస్‌ల ఏర్పాటు, అదనపు సైనిక దళాల మొహరింపు యుద్ధప్రాతిపదికపై చేపట్టాలి.

ఇటీవల సైనిధికారుల మధ్యజరిగిన చర్చల్లోభారత సైనిక బలగాల ను ఉపసంహరించుకోవాలన్న చైనా ప్రతిపాదనను భారత్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించకూడదు.

యూనివర్సిటీ సమస్యలపై దృష్టిసారించాలి: -ముచ్కుర్‌ సుమన్‌గౌడ్‌, వరంగల్‌

కాకతీయ యూనివర్శిటీకి రెగ్యులర్‌ విసి లేక ఏడాది అవ్ఞతుంది. ఇంచార్జీ విసి పూర్తిస్థాయి న్యాయం చేయలేరు. దీంతో యూనివర్శిటీకి చెందిన ఉద్యోగులు విద్యార్థులు వివిధ ఫైల్స్‌, ఏమైనా సంతకాల కోసం హైదరాబాద్‌ వెళ్లాల్సి వస్తుం ది.

విసి నియామకం ప్రభుత్వం వెంటనే చేపట్టి కాకతీయ యూనివర్శిటీలో సమస్యలు లేకుండా చేయాలి.

అతలాకుతలమైన బ్యాంకింగ్‌ రంగం:-సి.హెచ్‌.సాయిరుత్విక్‌,నల్గొండ

కరోనా వైరస్‌ కారణంగా అతలాకుతలం అయిన భారతదేశ బ్యాంకింగ్‌ వ్యవస్థ కొలుకునేందుకు దశాబ్డకాలం పట్టవచ్చునన్న ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ స్టాండర్డ్‌ అండ్‌ పూర్స్‌ అధ్యయన నివేదిక పట్ల కేంద్రప్రభుత్వం అప్రమత్తం కావాలి.

లాక్‌డౌన్‌ కారణంగా వ్యాపారాలు మూతపడడం, ఎగుమతి రంగం దివాళా తీయడం, ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవడం, 14 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోవడం కొనుగోలు శక్తి తగ్గి కొన్నిసంస్థలు తాత్కాలికనష్టాలు చవిచూడగా మరికొన్ని శాశ్వతం గా దివాలాతీయడం,ఆరు నెలలకాలానికి ప్రకటించిన రుణ వాయిదాల మారిటోరియం వలన వసూళ్లు లేక బ్యాంకులకు ఆర్థికభారం ఏర్పడడం ముఖ్యకారణాలు.

2018లో బ్యాంకింగ్‌ రంగం 60వేల కోట్ల నికరనష్టాన్ని చవిచూడగా ఈ సంవత్స రం అది90వేల కోట్లకు చేరవచ్చని సదరు నివేదిక హెచ్చరికలు జారీ చేసింది. పైగా ఆత్మనిర్భర్‌ పథకం ద్వారా వ్యక్తులకు, సంస్థలకు ఉదారంగా రుణాలు ఇవ్వాలన్న కేంద్రం సూచన బ్యాంకులకు మరింత పెనుభారంగా మారనున్నది.

బంగారంపై ఎందుకంత ప్రీతి?:-సింగంపల్లి శేషసాయికుమార్‌, రాజంపేట్‌

లోహయుగం ప్రారంభం నుండి కూడా మానవ్ఞని జీవితం లోహాలతో మమేకమైపోయింది. ఎన్నో లోహాలు మన అవస రాలు తీరుస్తున్నా పసిడికిమాత్రం ప్రతి ఇంటిలో ఒక ప్రత్యేక మైన స్థానం ఉంది.

కానీ రానురాను బంగారం ధరలు పైకిపైకి ఎగబాగుతూ సామాన్యులకు అందుబాటులో లేకుండాపోతు న్నది.ఇందుకు కారణం అనేకంఉన్నాయి.అందులో రెండేముఖ్య మైనవి.ఒకటి ఆభరణాలపై మన సమాజంలోఉన్న శ్రద్ధ.

రెండో వది పుత్తడిని పెట్టుబడికి ఒక మార్గంగా ఎంచుకోవడం వలన బంగారం ధరలు పెరుగుదల నియంత్రణకు సాధ్యంకావడం లేదు. ఏదిఏమైనా బంగారంపై ప్రితీ మన దేశంలో తగ్గదు.

రోడ్ల మరమ్మతు చేపట్టాలి: -షేక్‌ అస్లాం షరీఫ్‌, శాంతినగర్‌

ఇటీవల కురిసిన వర్షాలకు వరంగల్‌, హన్మకొండలోని కాలనీ లన్నీ జలమైపోయాయి.అలాగే చాలాప్రాంతాలలోరోడ్లు భారీగా దెబ్బతిన్నాయి.

స్మార్ట్‌ సిటీగా పేరుగాంచిన వరంగల్‌ను మళ్లీ యధాస్థానానికి తీసుకొని రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వ యంత్రాంగం అధిక నిధులు కేటాయించి ధ్వంసమైన రోడ్లను మరమ్మతులుచేయాలి.

ఈప్రాంతాలపై ప్రభుత్వం ప్రత్యే కశ్రద్ధచూపి, ప్రయాణికులకు ఆటంకాలు కలుగకుండా చేయాలి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/