ప్రజావాక్కు

సమస్యలపై ప్రజాగళం

Voice of the people
Voice of the people

బస్సుపాసులు మంజూరు చేయాలి:-చల్లా చంద్రశేఖర్‌ రెడ్డి, కలువాయి, నెల్లూరు జిల్లా

కరోనా నేపథ్యంలో గత మార్చి 19న మూతపడిన ప్రభుత్వ పాఠశాలలు నవంబర్‌ రెండు నుంచి తెరుచుకున్నాయి. ప్రస్తు తం 8,9,10వ తరగతి విద్యార్థులకు బోధన ప్రారంభమైంది. వసతి గృహాలు తెరుచుకోకపోవడం, బస్సుపాసులు ఇంకా జారీ చేయకపోవడంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులు పాఠ శాలకువెళ్లి చదువ్ఞకునేందుకు ఆర్థికభారం మోయాల్సివస్తుంది. ఆర్టీసీ బస్సులు సక్రమంగా తిరగకపోవడంతో విద్యార్థులు ప్రైవేట్‌ వాహనాలపైన ఆధారపడాల్సి వస్తోంది. దీంతో విద్యా ర్థులు ప్రతిరోజు పాఠశాలకు వచ్చి వెళ్లేందుకు 60 రూపాయల వరకూ ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ భారం మోయలేని విద్యార్థులు పాఠశాలకు గైర్హాజరు అవ్ఞతున్నారు. కనుక వెం టనే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుపాసులు మంజూరు చేయా ల్సిన అవసరం ఉంది.

జమిలి ఎన్నికలే మంచిది: -ఎం.కనకదుర్గ,తెనాలి,గుంటూరుజిల్లా

ప్రధాని నరేంద్రమోడీ మరొకసారి జమిలి ఎన్నికల ప్రతిపాద నను గట్టిగా సమర్థించారు. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చలలో జమిలి ఎన్నికల పట్ల సానుకూలత వ్యక్తమవుతోంది. ఎప్పుడూ జరిగే ఎన్నికల వలన దేశంలో అనవసర ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. పాలకులు పాలనను పక్కనపెట్టి ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉంటున్నారు. అధి కార యంత్రాంగం, అవినీతి దుర్వినియోగమవుతోంది. నేతలు ప్రచారంలో సవాళ్లు విసురుకోవడం, వ్యక్తిగత దూషణలకు దిగడం, శాంతిభద్రతల సమస్యలు తలెత్తడం సర్వసాధారణ మైపోయింది. తరచుగా వచ్చే ఎన్నికల కోడ్‌ వలన అభివృద్ధి కార్యక్రమాలు స్తంభించిపోతున్నాయి.కాబట్టి దేశమంతటా పుర పాలక సంఘాల నుండి పార్లమెంట్‌ వరకు ఒకేసారి ఎన్ని కలను జమిలి పద్ధతిన నిర్వహించడం అత్యత్తమం.

నేరచరితులదే హవా:-మిథునం, హైదరాబాద్‌

సుప్రీంకోర్టు నేరచరితులను రాజకీయాల నుంచి బహిష్కరిం చాలని వారిపై ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని అంటున్నా రాజకీయ పార్టీల వారు పట్టించుకోవడం లేదు. సుప్రీంకోర్టు మాటను బేఖాతరు చేస్తూ రేపులు, కిడ్నాప్‌లు, హత్యలు ఇంకా అనేక రకాల నేరాలు చేసి తప్పించుకు తిరు గుతున్నవారికి ఎన్నికలలో పోటీ చేసే అవకాశం కల్పిస్తున్నా రు. ఈమధ్య బీహార్‌కు జరిగిన ఎన్నికలలో కూడా ఇలాంటి వారికి టికెట్లు ఇచ్చారు. ఇది మంచి సంప్రదాయం కాదు.

రైతులను ఆదుకోవాలి:-ఉప్పలపు శేషునాథ్‌, కృష్ణాజిల్ల్లా

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరి, పత్తి, పొగాకు మిర్చి మొదలైన పంటలే కాకుండా మినుము కంది తదితర కూరగాయల పైర్లు కూడా దెబ్బతిన్నాయి. రైతులకు ఆశించిన దిగుబడులు వచ్చే ఆశలు లేవ్ఞ. అప్పులు తీరే పరిస్థితి లేదు. భారతదేశానికి అన్నం పెట్టే అన్నదాత కష్టాలని గట్టెక్కించడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కృషి చేయాలి. రైతు రుణాలను రద్దు చేయడంతోపాటు కొత్త రుణసదుపాయం కల్పించాలి. విత్తనాలు ఎరువ్ఞలు పురుగుమందులు రాయితీ ధరలకే అందించాలి. కౌలు రైతులను ఆదుకోవాలి. అప్పుడే రైతన్న మళ్లీ కాడి మేడి పట్టి వ్యవసాయం చేసే అవకాశం ఉంది. లేదంటే రైతు బతుకు దయనీయస్థితిలో తయారవ్ఞతుంది. ఇప్పటికైనా మేలుకొని అన్నదాతను ఆదుకోవాలి.

జాగ్రత్తలు పాటించడం ముఖ్యం: -సి.ప్రతాప్‌ శ్రీకాకుళం

కరోనాపై ప్రధాని మోడీ ఎప్పటికప్పుడు తాజా పరిస్థితిని సమీక్షిస్తూ సమయానుకూలంగా చకచకా కార్యచరణను ప్రకటించడం హర్షణీయం. ఇటీవల కరోనా వ్యాక్సిన్‌ పురోగతి కోసం మూడు నగరాలు పర్యటించి శాస్త్రవేత్తల బృందాలతో విస్తృతంగా చర్చలు జరపాలి. వ్యాక్సిన్‌ సరఫరాలో భారత్‌ దిక్సూచి కావాలన్న ప్రధాని ఆకాంక్షలకు అనుగుణంగా శాస్త్రవేత్తలు చిత్తశుద్ధితో కృషి చేయాలి. ప్రజందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ సరఫరా జరగాలన్న ప్రధాని సంకల్పం అద్వితీయం. అంతేకాకుండా కరోనా చికిత్సలో అభివృద్ధి చెందిన దేశాలు అవలంబిస్తున్న విధానాలను కూడా సమీక్షించి, సత్వరం అమ లుచేయాలి. అంతవరకు ప్రజలందరూ క్రమశిక్షణతో కరోనా ప్రొటోకాల్స్‌ పాటించడం ఎంతో అవసరం.

పురాతన బావులను పూడ్చివేయాలి:-షేక్‌ అస్లాం షరీఫ్‌, శాంతినగర్‌

చాలా గ్రామాలలో ఉపయోగంలో లేని పురాతన బావ్ఞలను పూడ్చివేయాలి. ప్రస్తుతం ఈ బావ్ఞలలో చేత్త చెదారం నిండి దుర్వాసన వెదజల్లుతున్నాయి. అంతేకాకుండా ఈ బావ్ఞలలో మూగజీవాలు పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆహారం కోసం వెతుక్కుంటూ ఇప్పటికే కొన్ని మూగజీవ్ఞలు బావ్ఞలలో పడిన సందర్భాలున్నాయి. మూగజీవాలే కాకుండా చిన్నపిల్లలు ఆడుకుంటూ బావ్ఞలలో పడిన సందరాపళీలు కూడా ఎన్నో ఉన్నాయి. కనుక ఉపయోజనం లేని ఈ బావ్ఞల నువెంటనేమూసివేయాలి.మూగజీవాలను, పిల్లలను కాపాడాలి.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/