కుదేలైన చేనేత, కానరాని ప్రభుత్వ చేయూత

చేనేత కార్మికులను ఆదుకోవాలి

Handloom workers
Handloom workers

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు 430 పైచిలుకు ఉన్న చేనేత సహకార సంఘాలు నేడు 160కి పడిపోయి చేనేత సహకార వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైంది.

ఈ వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో దీర్ఘ కాలిక ప్రణాళికలు చేపట్టకపోవడంతో మిగిలిన కాస్త మగ్గాలు మరుగునపడుతున్నాయి.

కరోనా కష్టాలతో కుదేలైన నేతన్నలకు ప్రభుత్వం ఎటువంటి సహాయం అందించకపోగా నేతన్నలు వారి దీర్ఘకాలిక అవసరాలకు పొదుపు చేసుకున్న 93 కోట్లరూపాయలను, ఇంకా రెండు నెలల్లో ముగియనున్న థ్రిప్టు ఫండ్‌ పథకం ప్రయోజనాన్ని (నేతన్నల సొంత సొమ్మునే) ప్రభుత్వ సహాయంగా ప్రకటన చేయడం అందునా బ్యాంకులు,ప్రభుత్వం విడుదల చేసిన సొమ్మును ఈ కష్టకాలంలో అప్పుల నిమిత్తం జప్తు చేయడం, ప్రభుత్వం ఈ విషయంపై ఏ మాత్రం స్పందించకపోవడం పూర్తిగా నేతన్నలను ఇరుకుపెట్టాయి.

భారత స్వాతంత్య్ర పోరా టంలో ‘విదేశీ వస్త్రదహ నం స్వదేశీ స్వావలంబన అనే నినాదంతో దేశాన్నంతటినీ ఒక్క తాటిపై నిలిపిన మహత్తర ఘట్టా నికి నాందిగా నిలచింది/

భారతీయ సాంప్రదాయ చేనేతకళ. అంతటి ఘనకీర్తి గల ఈ స్వదేశీ వారసత్వ సంపద నేడు అనూహ్యమైన పరిణా మాలతో, అలవికాని నిర్వేదంతో కొట్టుమిట్టాడుతుంది. భారత స్వాతంత్య్రోద్యమ పోరాటంలో చెరగని ముద్రను వేసిన చేనేత నేడు తీవ్ర సంక్షోభంలో ఉంది. తెలంగాణ అస్తిత్వానికి ఒక బల మైన ప్రతీక చేనేత వస్త్రమాళిక.

ఇక్కడి ప్రజల కళాత్మక శక్తికి, సాంకేతిక నైపుణ్యానికి, చేనేతకళ ఒక అద్భుతమైన భావ వ్యక్తీ కరణ. అలాంటి చేనేత పరిరక్షణకు, చేనేత వ్యవస్థను బలోపేతం చేయడానికి ఆశించిన స్థాయిలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కట్టుదిట్టమైన చర్యలు కానరాకపోవడం బహు బాధాకరం. తెలంగాణ అస్తిత్వానికి ఆధారమైన దుబ్బాక గొల్లభామ చీరలు, పోచంపల్లి ఇక్కత్‌ వస్త్రాలు, నారాయణపేట, గద్వాల పట్టుఝరీ చీరలు, ఓరుగల్లు తివాచీలు క్రమంగా పాలకుల నిర్లక్ష్యంతో కను మరగవ్ఞతున్నాయి. గోరుచుట్టూ రోకలిపోటులా అసలే కష్టంగా కొనసాగుతున్న చేనేత వృత్తిని కరోనా కబళించింది.

గత ఐదు నెలల నుండి కొనసాగుతున్న కరోనా విజృంభణతో రాష్ట్రంలో చేనేత, నేత వ్యవస్థలు పూర్తిగా కుదేలయ్యాయి. గత 45 రోజు లుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చేనేత దీక్షలు కొనసాగుతున్నా ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోడం కడు విచారకరంగా గోచరి స్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో చేనేత, నేత కార్మికుల ఆత్మహత్యల అంశంతో అప్పటి పాలకులను ప్రశ్నించి రాజకీయంగా వారిని ఇరుకున పెట్టిన ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు నేడు చేనేత కార్మికుల సమస్యల పరిష్కార విషయంలో నిర్లిప్తతను ప్రదర్శిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు 430 పైచిలుకు ఉన్న చేనేత సహకార సంఘాలు నేడు 160కి పడిపోయి చేనేత సహకార వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైంది. ఈ వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో దీర్ఘ కాలిక ప్రణాళికలు చేపట్టకపోవడంతో మిగిలిన కాస్త మగ్గాలు మరుగునపడుతున్నాయి.

కరోనా కష్టాలతో కుదేలైన నేతన్నలకు ప్రభుత్వం ఎటువంటి సహాయం అందించకపోగా నేతన్నలు వారి దీర్ఘకాలిక అవసరాలకు పొదుపు చేసుకున్న 93 కోట్లరూపాయల ను, ఇంకా రెండు నెలల్లో ముగియనున్న థ్రిప్టు ఫండ్‌ పథకం ప్రయోజనాన్ని (నేతన్నల సొంత సొమ్మునే) ప్రభుత్వ సహాయంగా ప్రకటన చేయడం అందునా బ్యాంకులు,ప్రభుత్వం విడుదల చేసిన సొమ్మును ఈ కష్టకాలంలో అప్పుల నిమిత్తం జప్తు చేయడం, ప్రభుత్వం ఈ విషయంపై ఏ మాత్రం స్పందించకపోవడం పూర్తి గా నేతన్నలను ఇరుకునపెట్టాయి.

చేనేత కార్మికులకు మిల్లు వస్త్రాల నుండి, కార్పొరేట్‌ శక్తుల నుండి ఉత్పన్నమవ్ఞతున్న అనైతిక పోటీ పెరిగి, చేనేత వస్త్రాల అమ్మకానికి కావాల్సిన సహాయం దొరకక చేనేత వ్యవస్థ సంక్షోభంలో చిక్కుకొంటుంది.

చేనేత వృత్తికి చీడ పురుగులా దాపురించిన కార్పొరేట్‌ షాపింగ్‌ మాల్‌ల మోసపూరిత భాగోతాలు సంబంధిత మంత్రి దృష్టికి రాకపోవడానికి గల కారణాలేమిటో రాష్ట్ర ప్రజలు గుసగుసలాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి గడిచిన ఆరు సంవత్సరాల వ్యవధిలో 325 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్న విషయాన్నీ సంబంధిత చేనేత జౌళిశాఖ ఈ మధ్యనే హైకోర్టుకు అఫిడవిట్‌ సమర్పించింది.

గత 2018 ఎన్నికల సమయంలో రాష్ట్ర పరిశ్ర మల శాఖ మంత్రి సిరిసిల్లలో ప్రకటన చేసిన విధంగా రైతుల మాదిరిగా చేనేత, నేత, కార్మికులకు ఐదు లక్షల రూపాయల ఉచిత జీవిత బీమాను కల్పిస్తానన్న హామీ మాటలకే పరిమిత మైంది.

నాటి నుండి నేటివరకు 70 మంది నేతన్నలు అనారో గ్యాల చేత మరణించారు. మరి వీరి కుటుంబాల బాధ్యత తీసు కునే నాధుడెవ్వరో ప్రభుత్వం ఇంతవరకు స్పష్టం చేయలేదు. ఇప్పటివరకు ఆత్మహత్య చేసుకున్న ఒక్క చేనేత కుటుంబాన్ని కూడా సంబంధిత మంత్రి పరామర్శించలేదు.

కరోనా కారణంగా చేనేత వ్యవస్థలో జరిగిననష్టాన్ని అంచనా వేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విచారణ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాల్సిన అవశ్యకత నెలకొన్నది. కరోనా కబళిస్తున్న ప్రస్తుత తరుణంలో రానున్న డిసెంబర్‌ వరకు ప్రతినెల పదివేల రూపా యల జీవన భృతిని నేతన్నలకు ప్రభుత్వం వెంటనే చెల్లించే ఏర్పాటు చేయాలి.

రైతాంగం తర్వాత తెలంగాణాలో అత్యధిక మందికి గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పిస్తున్న చేనేత వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం దళితులకు ప్రకటించిన మూడు ఎకరాలను ప్రామాణికంగా తీసుకుని రైతులకు అందించినట్లు 36వేల రూపాయల పెట్టుబడి సాయాన్ని నేతన్నలకు అందించా ల్సిన అవసరం ఉంది.

చేనేత కళాకారులు ప్రస్తుత పరిస్థితులోల వృత్తిని కొనసాగించడానికి వారి కూలీ రేట్లను ప్రభుత్వం రెండిం తలు పెంచడం, నేతన్నలకు సంవత్సరం పొడుగునా ఉపాధి కల్పించడం, లోపభూయిష్టంగా ఉన్న 50 శాతం యార్న్‌ సబ్సిడీ పథకాన్ని పక్కాగా అమలు చేయడం లాంటి అనేక అంశాలు ప్రభుత్వ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది.

తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే హామీ ఇచ్చిన విధంగా నేతన్నలకు వెయ్యికోట్ల రూపాయ లతో రెండు ప్రత్యేక కార్పొరేషన్ల ఏర్పాటు చేయడం, నేతన్నలకు ఐదు లక్షల రూపాయల హెల్త్‌కార్డు, ఉచిత ఇన్సూరెన్స్‌ అందించడం, పేరుకుపోయిన 300 కోట్ల చేనేత వస్త్ర నిల్వలను తెలంగాణ ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయ డం.

ప్రతి కార్మికుడికి ఈ ఆపద కాలంలో థ్రిప్టు పథకానికి అయ్యే నేతన్న వాటా ధనాన్ని ప్రభుత్వమే చెల్లించడం, ప్రతికార్మికుడికి 200 గజాల ప్రభుత్వ భూమిని ఉచితంగా అందచేయడం, చనిపోయిన చేనేత కార్మిక కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పించడం వంటి ఉద్దీపన చర్యలు చేపడితే కానీ చేనేత వ్యవస్థ తిరిగి తన పూర్వ వైభవాన్ని సంతరించుకునే పరిస్థితి లేదు.

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వ యంతో వ్యవహరించి సమీకృత చేనేత విధానాలు రూపొందించితే తప్ప సమకాలీన వ్యవస్థలో చేనేత మనుగడ కొనసాగించలేదన్నది అక్షరసత్యం.

కనుమరగవు తున్న చేనేత వృత్తిని కాపాడుకుందాం. దేశ వారసత్వ సంపదను భావితరాలకు అందిద్దాం.

-దాసు సురేష్‌, (రచయిత: ఛైర్మన్‌,జాతీయ నేతన్నల ఐక్య కార్యాచరణ కమిటీ)

తాజా సినిమా వార్తల కోసం:https://www.vaartha.com/news/movies/