మరో తెలుగు బిడ్డకు అంతర్జాతీయ గౌరవం!

వార్తల్లోని వ్యక్తి (ప్రతి సోమవారం)

TS Minister KTR
TS Minister KTR

తెలంగాణా పరిశ్రమలు, ఐ.టిశాఖల మంత్రి కె. తారక రామారావ్ఞకు అరుదుగా కాని లభించని మరో అంతర్జాతీయ గౌరవం లభించింది. అది లావోస్‌లో జరిగే అంతర్జాతీయ ఆర్థిక సంస్థ వార్షిక సమావేశంలో పాల్గొనాలని వచ్చిన ఆహ్వానం! ఆయన ఇప్పటికే కొన్ని అంతర్జాతీయ సమావేశాలలో భారతదేశం తరపున పాల్గొన్నారు.
ఆయనకు విద్యార్థి దశ నుంచే రాజకీయాలు, రాజకీయరంగం పట్ల ఆసక్తి. అందుకు తోడు- ఆయన తండ్రి కె.సి.ఆర్‌- ఎందరో మహామహులు సాధించలేని ప్రత్యేక తెలంగాణాను సాధించిన జోరు! అందువల్ల కాలేజీ రోజుల నుంచే కె.టి.ఆర్‌కు రాజకీయాల పట్ల ఎనలేని ఆసక్తి.
రాజకీయాలలో అరంగేట్రం
ఆయన మొదటిసారిగా 2009లో సిరిసిల్ల నియోజకవర్గం నుంచి సమైక్యాంధ్రప్రదేశ్‌ శాసనసభకు ఎన్నికైనారు. ఆ తరువాత 2014లో ప్రత్యేక తెలంగాణా శాసన సభకు రెండవసారి ఎన్నికై క్యాబినెట్‌ హోదామంత్రి అయినారు. మంత్రి పదవిని స్వీకరించిన కొద్దికాలంలోనే ఆయన తెలంగాణా ప్రభుత్వంపైన, ప్రజలపైన తనముద్ర వేశారు. 2009 నుంచి ఇప్పటి వరకు సిరిసిల్ల నుంచి అవిచ్ఛిన్నంగా సభ్యుడు.
పుట్టుపూర్వోత్తరాలు
తారకరామారావ్ఞ 1976 జులై 24న సిద్ధిపేటలో జన్మించారు. నిజాం కాలేజీలో డిగ్రీ చదవడానికి ముందు ఆయన హైదరాబాద్‌లోని సెయింట్‌ జార్జి గ్రామర్‌ స్కూలులో పాఠశాల విద్యను పూర్తి చేశారు.
నిజాం కాలేజీలో చదువ్ఞ పూర్తి అయినాక పూనా యూనివర్శిటీలో జీవసాంకేతిక శాస్త్రంలో ఎమ్‌.ఎస్‌సి డిగ్రీ తీసుకున్నారు. అంతటితో వూరుకోలేదు.
అమెరికాలో చదువ్ఞ, ఉద్యోగం
న్యూయార్క్‌లోని సిటీ యూనివర్శిటీలో ఎమ్‌.బి.ఏ. డిగ్రీ తీసుకున్నారు – మార్కెటింగ్‌, ఇ-కామర్స్‌ సబ్జెక్టులలో ఎమ్‌.బి.ఏ పూర్తి అయిన తరువాత ఆయన అమెరికాలో 2001-6 సంవత్సరాలపాటు ఉద్యోగం చేశారు.
అయితే, అమెరికాలో ఎంత ఉద్యోగం చేసినా, ఆయన మన్సంతా స్వదేశంపైనే. తెలంగాణాపైనే. అందువల్ల స్వదేశం తిరిగివచ్చి, ఆయన తెలంగాణా రాష్ట్రసమితి ప్రారంభించిన స్వరాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన తెలంగాణా అంతటా పర్యటించి,ప్రజల సమస్యలను ఆకళింపు చేసుకున్నారు.
తెలంగాణా అవతరణానంతరం ఆయన ఐ.టి మంత్రిగా ఆ రాష్ట్రం నుంచి ఐ.టిఎగుమతులను రెట్టింపు చేయడానికి ప్రయత్నించారు.
భవిష్యత్తులో?
ఆయన టి.ఆర్‌.ఎస్‌కు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అయితే, కె.సి.ఆర్‌ అధ్యక్షుడు. కె.టి.ఆర్‌. భవిష్యత్తులో తండ్రిని మించిన తనయుడు కాగలడనడంలో సందేహం లేదు. ఆయన మంచి ఉపన్యాసకుడు కూడా. మహానటుడు ఎన్‌.టి.రామారావ్ఞ పట్ల కె.సి.ఆర్‌.కు ఎనలేని గౌరవాభిమానాల వల్లనే తన కుమారునికి ఆయన ఆ మహానటుని పేరు తారకరామారావ్ఞ- పెట్టాడని ప్రతీతి. భవిష్యత్తులో ఈ తారకరామారావ్ఞ తెలంగాణా ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్యంలేదు. కల్వకుంట్ల తారకరామారావ్ఞ వయస్సు 43 సంవత్సరాలు.

-డాక్టర్‌ తుర్లపాటి కుటుంబ రావు
(”పద్మశ్రీ అవార్డు గ్రహీత)

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/