మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి

ఎంపీ రేవంత్‌ రెడ్డి డిమాండ్

MP Revanth Reddy
MP Revanth Reddy

Hyderabad: శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్‌ కేంద్రంలో జరిగిన దుర్ఘటనలో మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని ఎంపీ రేవంత్‌ రెడ్డి అన్నారు .

వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. కోటి పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నట్లు చెప్పారు.

అలాగే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్న రేవంత్‌ ..గాయపడిన వారికి మెరుగైన వైద్య సాయం అందించాలన్నారు. ఘటనపై అనేక అనుమానాలున్నాయన్నారు.

జగన్‌ జలదోపిడీకి కేసీఆర్‌ సహకరిస్తూ శ్రీశైలం లెప్ట్‌ బ్యాంక విద్యుత్‌ ప్రాజెక్టును చంపేసే కుట్ర చేస్తున్నాడని చాలా కాలంగా మేం చెబుతున్నామన్నారు.

ఈ క్రమంలో దుర్ఘటన జరగడం పలు అనుమానాలకు తావిస్తోందని తెలిపారు.

రాష్ట్ర పరిధిలోని విచారణ సంస్థలతో కాక కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తున్నానన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/