ప్రజావాక్కు

సమస్యలపై ప్రజాగళం

Voice of the people
Voice of the people

పెరుగుతున్న మద్యం స్మగ్లింగ్‌:- సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

రాష్ట్రప్రభుత్వం భారీగా మద్యం ధరలు పెంచడం,రెడ్‌జోన్ల ప్రాంతాలలో మద్యం దుకాణాలు మూసివేయడం తదితర కార ణాలవలన పొరుగురాష్ట్రాల నుండి మద్యం స్మగ్లింగ్‌ ఈ మధ్య కాలంలో ఎక్కువకావడం ఆందోళన కలిగించే అంశం.

తమిళ నాడు,కర్ణాటక,తెలంగాణ, ఒడిశా, మధ్యప్రదేశ్‌ల నుండి వివిధ వాహనాల ద్వారా భారీగా మద్యం స్మగ్లింగ్‌ చేస్తున్న ఘటనలు ఈ మధ్య ఎక్కువవ్ఞతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్‌ ఎన్ఫోర్స్‌మెంట్‌ బ్యూరో రాష్ట్ర సరిహద్దుల్లో నిఘా వేసి భారీస్థాయిలో మద్యాన్ని స్వాధీనం చేసుకుంటున్న ఈ తరహా ఘటనలు ఆగడంలేదు.

అక్రమ మద్యవిక్రయం, తరలిం పు వంటి నేరాలకు కఠినశిక్షలు విధించేలాచట్టాలు చేయడంతో పాటు ఎస్‌ఐబికు విస్తృత అధికారాలు ఇవ్వాలి.

వార్‌రూమ్‌ వ్యూహం ఫలించనుందా?: -డాక్టర్‌ ఎండి ఖ్వాజామొయినొద్దిన్‌, హైదరాబాద్‌

దేశరాజధాని ఢిల్లీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. దీంతో అక్కడి ప్రభుత్వం వైరస్‌ కట్టడి కోసం అనేక రకాలైన చర్యలు అమలుచేస్తోంది. కరోనాకంట్రోల్‌ కోసం ఢిల్లీ సచివాలయంలో 25మందినిపుణులతో వార్‌రూమ్‌ ఏర్పాటుచేయాలని కేజ్రీవా ల్‌ సర్కార్‌ నిర్ణయించింది.

ఆ వార్‌రూమ్‌ కేంద్రంగాన్‌ వైరస్‌ కట్టడికి సంబంధించి అధికారులు సమగ్ర వ్యూహాన్ని అమలు చేస్తారు.

రాష్ట్రవ్యాప్తంగా టెస్టుల సంఖ్య భారీగా పెంచాలని, ప్రభుత్వ ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోఉన్న బెడ్ల సంఖ్య, బాధితుల తాకిడిని బట్టి మరిన్ని ఏర్పాట్లు, మెడికల్‌, ఎక్విప్‌మెంట్‌, అందుబాటులోఉన్న అంబులెన్స్‌లు,కంటైన్‌మెంట్‌జోన్లపై డాష్‌ బోర్డుపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ యంత్రాంగాన్ని అప్రమ త్తం చేస్తుంటారు.

కరోనాకు సంబంధించి భవిష్యత్‌ అవసరా లను కూడా వార్‌రూమ్‌ వేదికగా బృందాలకు సూచించనుంది.

కులవృత్తులను ఆదరించాలి: -షేక్‌ అస్లాం షరీఫ్‌, శాంతినగర్‌

కులవృత్తులను నమ్ముకొని గ్రామీణ ప్రాంతాలలో అనేక మంది జీవనం సాగిస్తుంటారు. అయితే కొన్ని సంవత్సరా లుగా కులవృత్తులకు ఆదరణ తగ్గుతూ వస్తుంది. పట్టణా ల నుంచి ఆన్‌లైన్‌లో అన్ని వస్తువ్ఞలు గ్రామాలకు రావ డంవల్ల గ్రామీణప్రాంతంలో తయారు అయిన వస్తువ్ఞలను ఎవరూ కూడా కొనడం లేదు.

ప్రోత్సాహం లేనికారణంగా చాలా మంది పట్టణాలకు వలస వెళ్లిపోతున్నారు. కుల వృత్తులనుప్రోత్సహించడానికిప్రణాళికలు రూపొందించాలి.

మేధావుల సమాజం భారత్‌: -సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ

భారత్‌ను మేదావుల సమాజంగా తీర్చిదిద్దడంలో ప్రాథమిక విద్యారంగానికి కీలక ప్రాధాన్యత ఉందని జాతీయ విజ్ఞాన సంఘం 2005లోనే కీలక సిఫార్సులు చేసింది. మానవ వన రులపై పెట్టుబడులు 2005 2.3 శాతం నుండి 7.1 శాతానికి దశాబ్దకాలంలో పెంచాలన్న కమిటీ సిఫార్సులు బుట్టదాఖలు అయ్యాయి.

తాజాగా బడ్జెట్‌లో కేంద్రం ఈరంగానికి 2.9 శాతం మాత్రమేనిధులు కేటాయించడం ప్రాథమిక, మాధ్యమిక విద్యా రంగాలు, మానవ వనరులు నైపుణ్యాభివృద్ధిలో ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి స్పష్టం చేస్తోంది.

వివిధ దేశాల స్థితిగతులను క్షుణ్ణంగా అధ్యయనం చేసి యునెస్కో ప్రాథమిక, మాధ్యమిక రంగాలలో ఫిన్లాండ్‌, డెన్మార్క్‌, జర్మనీలతో పోలిస్తే యాభై సంవత్సరాలు వెనుకబడి ఉందని అంచనా వేసింది.

జనాభాను నియంత్రించాలి:-ఎం.కనకదుర్గ, తెనాలి,గుంటూరు జిల్లా

్రపంచంలో జనాభాదినోత్సవం మొక్కుబడిగా జరుపుకుం టు న్నారు.కానీ పెరుగుతున్న జనాభాను అరికట్టేందుకు తీసుకోవా ల్సిన చర్యలగురించి ప్రభుత్వాలు అసలే మాత్రం ఆలోచించడం లేదు.

పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా జనాభా సమస్య లపై అవగాహన పర్యావరణంపై జనాభా ప్రభావం ఆరోగ్య సమస్యలు, కుటుంబ నియంత్రణ, జనాభాకు అనుగుణంగా కల్పించాల్సిన సౌకర్యాలు, శాంతిభద్రతల సమస్యలు ఇత్యాది అంశాలపై ప్రభుత్వంతక్షణం దృష్టిసారించాలి.

జనాభాతోపాటు పేదరికం, మానవహక్కుల ఉల్లంఘన, మానవీయత అంత రించిపోతుండడం, పర్యావరణ కాలుష్యం, లింగవివక్ష మొద లైన ఎన్నో సమస్యలు వికృతరూపం దాలుస్తున్నాయి.

ప్రజా సమస్యలపై ప్రభుత్వం మరింత శాస్త్రీయ ప్రాతిపదికపై అధ్య యనం చేసి తగు చర్యలు చేపట్టాలి.

ఆపరేషన్‌ ముస్కాన్‌: -సింగంపల్లి శేషసాయికుమార్‌, రాజంపేట

మన రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ఆపరేషన్‌ ముస్కా న్‌ కొవిడ్‌-19 ఒక మంచి కార్యక్రమంగానే చెప్పవచ్చు.

ఎందుకంటే వీధిబాలలను,బాలకార్మికులను గుర్తించి వారిని కరోనా కొవిడ్‌ కేర్‌సెంటర్లకు తరలించే బాధ్యత చేపట్టడం.

దీనివల్ల వీధిబాలలు ఎక్కడపడితే అక్కడఉంటూ తిండి సరిగా లభించక ఇబ్బందులు పడుతున్నవారిని గుర్తించి ఒకచోట చేర్చడం నిజంగా మంచిపని.

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా వారిని పోలీసులు గుర్తించి చేరదీసి ఆశ్రమం కల్పించడం అందరూ హర్షించదగిన విషయం.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/