ప్రజావాక్కు

సమస్యలపై ప్రజాగళం

Voice of the people
Voice of the people

సమాచార హక్కు చట్టం నిర్వీర్యం:-చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్‌, భూపాలపల్లి జిల్లా

పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచి, అవినీతిని అంతం చేసే సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చి 16 సంవత్సరాలు గడుస్తున్నా నేటికి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కుచట్టం చిరునామా బోర్డులు లేకపోవడం విచారకరం.

ప్రజాసమాచార అధికారులకు ఈ చట్టం గూర్చి పూర్తి అవగాహన లేదు.

ప్రజలు తాము కోరిన సమాచారానికి సంబంధించి ప్రజాసమాచార అధికారికి దర ఖాస్తు చేసినా నెల రోజుల లోపు సమాచారం ఇవ్వడం లేదు. కొన్ని కార్యాలయాల్లో అసలు దరఖాస్తు తీసుకోవడం లేదు.

రెండవ అప్పీల్స్‌ రాష్ట్రసమాచార కార్యాలయంలో పెండింగ్‌లో ఉంటున్నాయి. ప్రభుత్వం సమాచార హక్కు చట్టాన్ని పకడ్బం దీగా అమలు చేయాలి.

ముంచెత్తిన వరదలు: -యర్రమోతుధర్మరాజు, ధవళేశ్వరం

గత మూడు దశాబ్దాలుగా ఎన్నడూ లేని విధంగా వర్షాలు, వరదలు, తుఫానులు సంభవించడంతో వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లుతున్నాయి.

లోతట్టు ప్రాంతాలు సముద్రా న్ని తలపిస్తున్నాయి. వరి,పత్తి అపరాల పంటలు సర్వనాశనం అయ్యాయి. అప్పులు చేసి పెట్టుబడి పెట్టిన రైతన్న కంటి ముందే పంట పాడైపోవడంతో పుట్టెడు దుఃఖం మిగిల్చింది.

ఇల్లు కూలిపోయి, పశువులు కొట్టుకుపోయి, తాగునీటికి తిండి కి అవస్థలు పడుతున్నారు. క్షేత్రస్థాయిలో సందర్శించి ధైర్యం చెప్పి సురక్షిత ప్రాంతాలకు తరలించే వారు కరవయ్యారు.

జరిగిన నష్టాన్ని అంచనా వేసి నష్టపరిహారం వెంటనే చెల్లించి రైతులను ఆదుకోవాలి.

అలాగే వరదలు తగ్గిన అనంతరం పారి శుద్ధ్య పనులు చేపట్టి అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఆదుకోవాలి.

పారిశుద్ధ్య పనులు చేపట్టాలి:-షేక్‌ అస్లాం షరీఫ్‌, శాంతినగర్‌

ఇటీవల కురిసిన వర్షాల కారణంగా హైదరాబాద్‌ నగరంతో పాటు గ్రామీణ ప్రాంత ప్రజల జీవనం అతలాకుతలం అయింది.

చాలా చోట్ల ఇండ్లు పడిపోవడంతోపాటు పంటలకు కూడా భారీగా నష్టం వాటిల్లింది. ఇళ్లల్లోకి నీరు రావడంతో ప్రజలు సమస్యలు ఎదుర్కొన్నారు.

గ్రామాలలో బురద ఎక్కు వగా పేరుకుపోయింది. యుద్ధప్రాతిపదికన గ్రామాలలో పారిశుద్ధ్య చర్యలను చేపట్టాలి.

తెలుగులో పాలన కొనసాగించాలి: -తండప్రభాకర్‌గౌడ్‌, తొర్రూరు

మాతృభాషా దినోత్సవంరోజు, తెలుగుమహాసభల సందర్భంగా తెలుగును అన్ని రంగాల్లో అమలు చేస్తామని చెబుతున్నారే కానీఆచరణలో కానరావడం లేదు.

90శాతం మంది విద్యార్థులు ఆంగ్లమాధ్యమంగా నేడుచదువుతుండగా మాతృభాషలో విద్యా బోధనకు అవకాశం ఏది. న్యాయస్థానాల తీర్పులు, ప్రభుత్వ పాలనలోని అన్నిరకాల ఉత్తర్వులుతెలుగులోనే వచ్చేలా వెంటనే అమలు చేయాలి.

ఆంగ్లమాధ్యమంలో చదివినప్పటికీ విద్యా ర్థులు తెలుగులోనూ పరీక్షలు రాసేఅవకాశం కల్పించాలి. శాసన సభ వ్యవహారాలు పూర్తిగా తెలుగులోనే సాగేలా చేయాలి.

అప్రమత్తం చేయాలి: -ఎల్‌.ప్రఫుల్లచంద్ర, ధర్మవరం, అనంతపురం జిల్లా

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలలో కొందరు తమ తమ ప్రయాణంలో అవతలదాటడం కోసం వాహనాలతో సహా విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు.

అసలే ఎడతెరపి వర్షాలు కురుస్తున్న తరు ణంలో వారిని అక్కడక్కడ ప్రభుత్వ విపత్తుల నివారణ శాఖ, పోలీసు శాఖ, రెవెన్యూశాఖల వారు రంగంలో దిగి అప్రమత్తం చేయాలి.

వర్షాలు కురుస్తున్న కారణంగా పెద్ద పెద్ద నగరాలలో సైతం జనజీవనం స్తంభించిపోయింది.

భాగ్యనగరంలో నాలాల పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. కనుక అక్కడ కూడా ప్రజానీ కాన్ని అప్రమత్తం చేయాలి. ఇందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు గైకొనాలి.

అక్రమ నాలాలను తొలగించాలి: -ముచ్కుర్‌ సుమన్‌గౌడ్‌, నిజామాబాద్‌

అక్రమ నాలాలపై చర్యలు తీసుకొని వెంటనే నీరు సక్రమంగా ప్రవహించే విధంగా నాలలకు అడ్డుగా ఉన్న అక్రమ కట్టడాలు కూల్చివేయాలి.

ప్రజలకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఉచిత వసతి, ఉచిత భోజనాలు ఏర్పాటు చేయాలి. కబ్జాకు గురైననాలాలు కుంటలు చెరువ్ఞలనుగుర్తించి ప్రభుత్వం వాటిపై చర్యలు తీసుకోవాలి.

అధిక వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తం చేసి ప్రజలను అన్ని విధాలుగా రక్షిం చాలి.

వరదలు లేని నగరంగా అభివృద్ధి చేయాలి. హైదరాబాద్‌ నగరంలో ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్స్‌ ఎక్కువగా మ్యాన్హోల్స్‌ డ్రైనేజీలలో విచ్చలవిడిగా వ్యర్థాలు నిండిపోయి పారిశుద్ధ్య కార్మికులకు కూడా ఇబ్బందికరంగా మారింది.

వాటిపైన కూడా చర్యలు తీసుకొని ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాలి.

తాజా ‘నిఘా’ వార్తల కోసం : https://www.vaartha.com/specials/investigation/