మహారాష్ట్రలో మరో మంత్రికి కరోనా
మంత్రి అస్లాం షేక్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ

ముంబయి: కరోనా వైరస్ మహారాష్ట్రంలో విలయతాండవం చేస్తుంది. తాజాగా మరో కేబినెట్ మంత్రికి కరోనా సోకింది. కాంగ్రెస్ సీనియర్ లీడర్, మంత్రి అస్లాం షేక్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని, ప్రస్తుతానికి తాను ఐసోలేషన్‌లో ఉన్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఆయనను ఇటీవల కలిసిన వారంతా.. కరోనా టెస్టులు చేయించుకోవాలని మంత్రి అభ్యర్థించారు. రాష్ట్ర ప్రజలకు ఇంటి నుంచే సేవ చేస్తానని అస్లాం షేక్ పేర్కొన్నారు.
మహారాష్ట్రలో నిన్న ఒక్కరోజే కొత్తగా 9,518 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 258 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు 3,10,455 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మొత్తం 11,854 మంది చనిపోయారు. మొత్తం పాజిటివ్ కేసుల్లో 1,28,730 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఈ వైరస్ నుంచి 1,69,569 మంది కోలుకున్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/