మెషిన్‌తో సులభంగా వంట

వంటింట్లో ఆధునిక సామగ్రి

Easy cooking with machine
Easy cooking with machine

మహిళలు ఎంత బిజీగా ఉన్నా వారిపై ఎన్ని అదనపు బాధ్యతలున్నా రోజువారీ పనులు తప్పనే తప్పవు. ఏ రోజుకారోజు ఉదయాన్నే లేచి, వేళకింత వండి వార్చాల్సిందే.

అందుకే ఈ మేకర్‌. ఇందులో రెండు పాత్రలు ఉండటం వల్ల దానిలో రైస్‌ఐటమ్‌.

మరోదానిలో కర్రీ లేదా ఒకదానిలో జొన్నకండెల సోస్‌, మరోదానిలో పాస్తా ఇలా ఒకే సమయంలో సిద్ధం చేసుకోవచ్చు. చికెన్‌, మటన్‌, ఫిష్‌, రొయ్యలు, గుడ్లు కూరగాయలు, ఆకుకూరలు, జొన్నకండెలు వంటివెన్నో ఉడికించుకోవచ్చు.

అత్యాధిక టెక్నాలజీతో రూపొందిన ఈ మేకర్‌లో 30శాతం వంట వేగంగా అయిపోతుంది. రెండు పాత్రలకు వేరువేరుగా అటాచ్‌ అయి ఉన్న మూతలు క్లోజ్‌ చేసుకుంటే మాత్రం మేకర్‌ మొత్తం ఒకే భాగంలా కనిపిస్తుంది.

మూతలు వేరువేరుగా ఉండటం వల్ల అవసరాన్ని బట్టి ఒకవైపు మూతపెట్టుకుని, మరోదాన్ని ఖాళీగా వదులుకోవచ్చు. అందుకు వీలుగా ఆప్షన్స్‌ ఉన్నాయి.

టైమ్‌ వంటి ఆప్షన్స్‌ కనిపించేందుకు మేకర్‌ పైభాగంలో మూతకు ముందువైపు డిస్‌ప్లే ఉంటుంది. దానిలో వంట పూర్తి కావటానికి ఎంత సమయం పడుతుంది.

ఎంత టెంపరేచర్‌లో ఉడుకుతుంది. వంటివి కనిపిస్తాయి. మేకర్‌ ముందు భాగంలో ఉన్న రెగ్యులేటర్‌ టెంపరేచర్‌ సెట్‌ చేసుకోవడానికి సహకరిస్తుంది.

మేకర్‌పైన ఉన్న డిస్‌పేఏ్లకి కుడివైపు సెట్టింగ్‌ బటన్‌, ఎడమవైపు మెనూ బటన్‌ ఉంటాయి.

వాటిని ప్రెస్‌ చేయగానే ఆప్షన్స్‌ డిస్‌ప్లేలో కనిపి స్తాయి. ఇక ఈ మెషిన్‌ని క్లీన్‌ చేయడం చాలా ఈజీ, టకటకా పనులు సాగాలంటే ఈ బిజిలైఫ్‌కి ఇలాంటి మెషిన్‌ ఉండాల్సిందే మరి.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/