ప్రజావాక్కు

సమస్యలపై ప్రజాగళం

Voice of the people
Voice of the people

భారత్‌ అప్రమత్తంగా ఉండాలి:-ఎం.కనకదుర్గ, తెనాలి, గుంటూరు జిల్లా

పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో పాకిస్థాన్‌ చైనా సహాయంతో ఉగ్ర వాద శిబిరాలను ఏర్పాటుచేస్తోందన్న అమెరికా గూఢచారి సంస్థ హెచ్చరికల పట్ల భారత్‌ అప్రమత్తం కావాలి. అమెరికా నుండి ఆర్థికసహాయం దాదాపుగా ఆగిపోవడంతో పాకిస్థాన్‌ చైనా పంచన చేరింది. దీనిని ఆసరాగా చేసుకొని చైనా పాక్‌ భూభాగం నుండి మనల్ని ఇబ్బంది పెట్టేలా వ్యూహలు సిద్ధం చేస్తోంది. పి.ఒ.కెలో ఉగ్రవాద శిబిరాలు, సిపెక్‌ పేరిట ఆక్ర మితకాశ్మీర్‌,పాక్‌-భారత్‌ సరిహద్దువెంబడి రహదారి నిర్మాణం, 25వేలమంది సైనికుల మోహరింపువంటి కవ్వింపు చర్యలకు ఆ రెండు దేశాలు పాల్పడుతున్నాయి. పాక్‌కు ఇరవైవేల కోట్ల డాలర్ల వ్యయంతో అత్యాధునిక ఆయుధాలను చైనా అందించ డానికి ఒప్పందంకుదుర్చుకోడం చైనాకవ్వింపుచర్యలలో ఒకటి.

ప్రజలకు చేదోడుగా ఉద్యోగులు: -యర్రమోతు ధర్మరాజు, ధవళేశ్వరం

విధులకు డుమ్మా కొట్టడం, దశాబ్దాలుగా బదిలీలు లేకుండా సంఘకార్యాలయాలకే పరిమితంకావడం, పైరవీలు చేయడం, అధికార పార్టీకి అడుగులకు మడుగులొత్తి వారిచ్చే తాయిలాల తో మద్దతు పలికి, చిన్న చిన్న పనులపై వచ్చిన ప్రజలకు కొందరు చేయితడపనిదే పనిచేయకపోవడం, ఎసిబి దాడులకు గురైనవారిని సంరక్షించే దిశగా ఉద్యోగ సంఘం నాయకుల దినచర్యగా మారింది. ఏఒక్క ఉద్యోగిని సంప్రదించకుండా ఆంధ్రప్రదేశ్‌లో స్థానికఎన్నికలు నిలుపుదల చేయడానికి విధుల ను బహిషరించి సమ్మెకు పిలుపునిస్తామన్న బీరాలు సర్వోన్న త న్యాయస్థానం చెంప చెల్లుమనిపించే తీర్పునివ్వడం ఉద్యోగ సంఘాల పనితీరుకే మాయని మచ్చ.

ఎలిజిబిలిటి టెస్టు నిర్వహించాలి:-కామిడి సతీష్‌రెడ్డి, జడలపేట,భూపాలపల్లి జిల్లా

తెలంగాణ స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ టి.యస్‌సెట్‌ చివరగా 2019లో నిర్వహించారు.ఇప్పటికే రెండు సంవత్సరాలు దాటి నా మళ్లీ నిర్వహించలేదు. కేంద్ర పరిధిలో ప్రతి ఆరు నెలలకు సక్రమంగా నెట్‌ నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ నిర్వహిస్తున్నారు. దీని ద్వారా జె.ఆర్‌.ఎఫ్‌ జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో కింద విద్యా ర్థులు తమ ప్రతిభను చాటుతున్నారు. మన రాష్ట్రంలోనూ ఈ టి.ఎస్‌సెట్‌ ద్వారా అర్హత పొందిన వారు డిగ్రీ కళాశాల అధ్యా పకులుగా రాణించే అవకాశం ఉన్నది. త్వరలో గురుకుల డిగ్రీ కళాశాల నియామకాలు చేపట్టనున్నారు. కావ్ఞన ఈ 2021 లోనైనా వెంటనే సెట్‌ నోటిఫికేషన్‌ వెలువరించాలి.

పర్యాటకులకు సౌకర్యాలు కల్పించాలి:-సి.ప్రతాప్‌,శ్రీకాకుళం

ఆంధ్రా కాశ్మీర్‌గా పేరొందిన చింతపల్లి మండలం లంబసింగిలో పెరుగుతున్న పర్యాటకుల తాకిడికి అనుగుణంగా సౌకర్యాలు కల్పించడంలో టూరిజం శాఖదారుణంగా విఫలమైంది. అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తున్నందున భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడి అయిదారు గంటలపాటు వాహనాలు ఎటూ కదలలేని పరిస్థితి ఏర్పడింది. సమయానికి బస్సులు కదలక పర్యాటకు లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసర సరుకులకు కొరత, తగినన్ని వసతి సౌకర్యాలు లేకపోవడం కూడా పర్యాట కులపాలిటశాపంలా మారింది.ఇటీవలకాలంలో కరోనాతోపాటు ఎజెన్సీ ప్రాంతంలో డెంగ్యూ, మలేరియా, డయేరియా వంటి వ్యాధులు ప్రబలుతున్నా, వాటిని నివారించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం దురదృష్టకరం.

ఉద్యోగులను తొలగించవద్దు: -వీరగంట భాస్కరరావు, బొబ్బిలి

కరోనా వైరస్‌ విజృంభణ వేళ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఆ వ్యాధి నియంత్రణకు నివారణకు తీసుకుంటున్న చర్యలు ప్రశం సనీయం.ఎంబిబిఎస్‌చదివిన యువడాక్టర్లు ప్రాణభయంతో పని చేయడానికి ముందుకు రానిసందర్భంలో బిడియస్‌ డాక్టర్లను, అల్టర్నేటివ్‌ మెడిసిన్‌ చదివిన డాక్టర్లను ఆ విధులకు ఆరు నెలల పాటుకాంట్రాక్ట్‌ బేసిక్‌పై నియమించారు.ఈనేపథ్యంలో యుద్ధం తో సైనికుల మాదిరి డాక్టర్లు కరోనా వ్యాధి గురించి ఆన్‌లైన్‌లో విషయాలు తెలుసుకొని తమ శక్తానుసారం సేవలు చేశారు. ఇంకా చేయడానికి సిద్ధంగాఉన్నారు. కానీ వారి కాంటాక్ట్‌ ఫిబ్ర వరి 11తో అయిపోతుంది. అయితే ఈ నెల 25 తారీఖుతోనే వారిని విధుల నుండి తొలగించాలని కలెక్టర్లకు ఆదేశాలు వచ్చా యి. కరోనా వైరస్‌ తీవ్రంగా ప్రబలుతుంది. వ్యాక్సిన్‌ వచ్చే వరకు ఇప్పటి వరకు పనిచేస్తున్న వైద్యులను, ఉద్యోగులను మరికొంతకాలం కొనసాగించాలి.

హెల్త్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలి: -తోట యోగేందర్‌, నల్గొండ జిల్లా

దాదాపుగా లక్ష నుండి లక్షన్నర జనాభా దాటిన పట్టణాలలో కూడా ఒకేఒక ప్రభుత్వ వైద్యశాల ఉండటంతో సామాన్యులు వైద్యానికి దూరమవ్ఞతున్నారు.బి.పిచూపించుకోవాలన్నా, చిన్న చిన్న గాయాలకు చికిత్స పొందాలన్నా, చిన్నపాటి జలుబు, జ్వరమోవచ్చినా చికిత్స పొందడానికి ఎంతో దూరంలో ఉంటు న్న ఒకే ఒక ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి వైద్యం చేయించుకోలేక చిన్నపాటి ఆర్‌ఎంపిలను సంప్రదించాల్సి వస్తుంది.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/