ట్రంప్ వ్యవహార శైలి మారేనా?
ఆంక్షలు విధించడం మొదలు

అమెరికా దేశానికి చాలా దేశాలు వైద్య నిపుణులను, వైద్య సామాగ్రిని పంపించి తమ సహాయ సహకారాలు అందిస్తున్నాయి.
చిన్న దేశమౌన ‘క్యూబా లాంటి దేశాల వైద్య వనరులపై ఆధారపడడం అమెరికా చేతకానితనానికి నిదర్శనం. అందుకే చిన్న దేశమైనా, పెద్ద దేశమైనా కొన్ని అత్యవసర పరిస్థితుల్లో వారి అవసరాలు తప్పకుండా మిగతా వారికి ఉంటాయి.
అందుకే ”బంగారం పళ్లెంకైనా గోడ చేరువ ఉండాలి అని మన పెద్దలు చెబుతారు. తరచూ వివిధ దేశాలపై యుద్ధాలు ప్రకటించడం, పలు ఆంక్షలు విధించడం అమెరికాకు అలవాటుగా మారింది.
ఆ దేశాల్లో అంతర్యుద్ధాలకు కుట్రలు పన్నుతూ, నేడు ఆ శత్రుదేశాల సహాయ సహకారాలు కోరుకోవడం వారి ఆధిపత్యానికి బీటలు వారినట్లుగానే భావించవచ్చు.
అందుకే ఇప్పటికైనా అమెరికా తన సామ్రాజ్యవాద ధోరణిని విడనాడి, ప్రపంచ దేశాలకు స్నేహ హస్తం అందించాలి.
ఒ కసారి మాటల దాడి వలన మనసు విరిగితే దానిని మరలా గాడిలో పెట్టలేమని వేమన అంటాడు. కొట్టే దెబ్బ కన్నా, తిట్టే తిట్టు మనిషిని ఎక్కువగా కలవర పరుస్తుంది. చేతివాటం కన్నా, నోటిమాట మరీ ప్రమాదకరమైనది.
విషయాన్ని చెబుతామని భారత్ అనేసరికి ట్రంపు అసహనానికి గురై, ఇష్టం వచ్చినట్లు అహంకార ధోరణితో మాట్లాడడం జరిగింది.
ఒకవేళ మందులు ఎగుమతి చేయకపోతే, భారత్ వాణిజ్యపరంగా తీవ్ర పరిణామా లు ఎదుర్కొంటోందని బెదిరింపులకు దిగడం ట్రంప్ వైఖరికి అద్దం పడుతున్నది.
రెండు నెలల క్రితం భారత్ సందర్శించిన అగ్రరాజ్యాధినేత భారత్ తన దేశానికి ఆత్మబంధువనీ, భారత ప్రధాని తనకు ఆప్తమిత్రుడనీ మాట్లాడిన స్నేహపూర్వక మాటలు ఒక్కసారిగా గాలిలో కలిసిపోయాయి. గతంలో కూడా అనేక దేశాలపై నోరు పారేసుకునే ఘన చరిత్ర ట్రంపుకి ఉన్నది.
అందుకే ‘ట్రంప్ తెంపరితనం అనే జాతీయం పలు పత్రికలలో బహుళ ప్రజాదరణ పొందింది. జాతీయతాభావాలను జనాల్లో ప్రేరేపించి గద్దెనెక్కిన ట్రంప్ పెడసరి ధోరణి అందరికీ ఎరుకే.
తన చెప్పుచేతల్లో యావత్ ప్రపంచం మసలుకోవాలనే నియం తృత్వ వైఖరి ట్రంపుది. సామ్రాజ్యవాద ధోరణితో ఉన్న ట్రంప్‌కి అహంకారం తలకెక్కి మాట్లాడడం అలవాటైపోయింది.
అందుకే అతని వ్యవహార శైలిని పలు దేశాధినేతలు, పలుదేశాల ప్రజలు ఈసడించుకుంటున్నారు
. ప్రపంచ సంస్థలను తన కనుసన్నలలో ఉంచుకుంటూ, వాటి పరిపాలన నిర్వహణలో చేయిపెడుతూ, తన ఆధిపత్యాన్ని ఎల్లప్పుడూ చాటుకోవాలని ట్రంపు ప్రయత్నిం చడం షరా మామూలే.
ఇటీవల వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యుహెచ్‌ఓ) కార్యకలాపాలలో అమెరికా జోక్యం చేసుకోవడం గమనార్హం.
ప్రపంచ ఆరోగ్య సంస్థకు అమెరికా నుండి నిధుల సమీకరణ ఎక్కువగా జరుగుతున్నదనీ, కానీ ఆ సంస్థ మాత్రం చైనాకు అనుగుణంగా పని చేస్తున్నదనీ, అమెరికా అధ్యక్షులు చెప్పడం విడ్డూరం.
అంతటితో ఆగక ‘హూ డైరెక్టర్ జనరల్ ‘టెడ్రాస్ అథానమ్ పై డోనాల్డ్ ట్రంప్ అక్కసు వెళ్లగక్కడం తన అహంకారానికి పరాకాష్టగా పేర్కొనవచ్చు.
ఇంకా తన దేశం నుండి హెచ్చు స్థాయిలో సమకూర్చే నిధులను ‘హూకు ఆపుతా నని బెదిరించడం అతని సామ్రాజ్యవాద ధోరణికి నిదర్శనం.
దీనిలో భాగంగానే చైనా దేశం కేవలం 42 మిలియన్ డాలర్లు మాత్రమే ‘హూకు సమీకరించగలిగితే, అమెరికా మాత్రం 450 మిలియన్ డాలర్ల నిధులను పెద్ద ఎత్తున ప్రపంచ ఆరోగ్య సంస్థకు సమకూర్చుతున్నదని ట్రంప్ గుర్తుకు తెచ్చారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ- ‘హూ ప్రాధాన్యతలను మార్చుకుని అన్ని దేశాలను సమానంగా చూడాలని హితవు పలికారు.
రాజ కీయ రంగు పులమొద్దని మాట్లాడే టెడ్రస్, కరోనా మహమ్మా రిని రాజకీయం చేస్తున్నారని, ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ మను గడకు ఏమాత్రం మంచిది కాదని తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
ఇందులో భాగంగానే ఆ సంస్థకు నిధులను ఆపుతున్నట్లు ట్రంపు విస్పష్టంగా ప్రకటించారు. గతంలోవలె డోనాల్డ్ ట్రంప్ దుందు డుకు చర్యలకు పై ప్రకటన ప్రతీకగా పేర్కొనవచ్చు.
అమెరికా దేశానికి భారతీయులు చేస్తున్న సేవలు, మేలుమరచి, ఇదివరలో కూడా పలు దఫాలుగా తమ దేశంలో అధికంగా ఉన్న ప్రవాస భారతీయులను దృష్టిలో ఉంచుకొని హెచ్.వన్.బీ వీసా జారీలో పలు ఆంక్షలు విధిస్తూ, కఠిన నిర్ణయాలు తీసుకోవడం జరిగిం ది.
దీనినిబట్టి అగ్ర రాజ్యాధినేతకు సిక్కోలు యాసలో గల ”ఒడ్డు నుండి బెడ్డలిసిరే రకం, ఇంటి మీదకి రాయిసిరి ఈపు కాసే రకం అనే సామెతలతో వ్యంగ్యంగా వ్యవహరించవచ్చు.
డొనాల్డ్ ట్రంప్ తన దేశంలో నానాటికీ విజృంభిస్తున్న కరోనా రోగులకు చికిత్స అందించేందుకు ఉపయోగపడే ‘హైడ్రాక్సీ క్లోరో క్విన్ మాత్రలను సరఫరా చేయాలని భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఇటీవల ఫోన్ ద్వారా కోరడం జరిగింది.
అయితే అతను కోరిన కొన్ని గంటల ముందే ఈ ఔషధాల ఎగుమతిని భారత ప్రభు త్వం నిషేధించడం జరిగింది.
ఈ ఉత్తర్వులు తక్ష ణమే అమలు లోకి వస్తాయని ప్రభుత్వం పేర్కొంది కూడా. కొవిడ్-19 భారత్ లో విజృంభిస్తున్న వేళ ఇలాంటి నిషేధానికి ప్రభుత్వం పూనుకో వడం మామూలు విషయమే కదా!
కానీ ట్రంప్ ఆ మందులను తమ దేశానికి భారత్ పంపకపోతే భారత్ అమెరికా నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ సాయం పొందలేదని బెది రింపులకు దిగింది.
ఆ బెదిరింపులకు తలొగ్గి,తక్షణమే ఔషధ ఎగుమతి నిషేధాన్ని ఎత్తివేసి, సంబంధిత మందులు పంపడాని కి భారత్ ఒప్పుకుందా! లేక స్వతహాగా భారతీయ సంస్కృతిలో ఉండే మానవీయ విలువలకు కట్టుబడి ఎగుమతికి ఒప్పుకుందా! అనేది చర్చించాల్సిన విషయమే.
ఒకవేళ అగ్రరాజ్యం బెదిరిం పులకు భారత్ లొంగి నట్లయితే అది మన దేశ సార్వభౌమత్వా నికి, దేశ అవసరాలకు ఏమంత క్షేమదాయకం కాదని పలువురు మేధావులు అభిప్రాయ పడడంలో అర్థముంది.
ఏదిఏమైతేగానీ, కొవిడ్-19 నియంత్రణకు దారితీపంలా కనబడుతున్న మలేరియా మందు ‘హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలను అగ్రరాజ్యానికి ఎగుమతి చేసేం దుకుగాను కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది.
ఈ క్రమంలోనే బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, ఆఫ్ఘ నిస్తాన్, మారిషస్, సీషెల్స్, ఆఫ్రికాలతో పాటు మరికొన్ని దేశా లకు ‘పారాసిటమాల్, హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందులను ఎగమతి చేసేందుకు ఏర్పాటు చేయడం గమనార్హం.
భారత ప్రభుత్వం సంబంధిత మందులను అమెరికాకు ఎగుమతి చేసేందుకు అనుమతించిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధానికి ధన్యవాదాలు తెలియజేశారు.
లాభం చేకూర్చితే ఒక మాట,చేకూర్చకపోతే ఒక మాట మాట్లాడే ట్రంపు వ్యవహార శైలిని మనం ఇట్టే గ్రహించవచ్చు.
‘అందితే జుత్తు అందకపోతే కాళ్లు అనే తెలుగు సామెత ట్రంప్ విషయం లో గుర్తుకు రాకమానదు.
అసాధారణ పరిస్థితుల్లో ఇరు దేశాల మధ్య సహాయ సహకారాలు ఉండడం శుభపరిణామంగా ట్రంప్ అభివర్ణిస్తే, దానికి బదులుగా ప్రపంచ మానవాళికి ఆపన్నహస్తం అందించేందుకు భారత్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ‘మోడీ తనదైన శైలిలో చెప్పడం దేశ ఔన్నత్యానికి నిదర్శనం.
కొవిడ్-19 తన దేశంలో ఎక్కువ కావడంతో ఆ వైరస్‌ను ‘చైనా వైరస్‌గా గత కొద్ది రోజుల క్రితం ట్రంప్ అభివర్ణిస్తూ మాట్లాడడం జరిగిం ది. అంటే తన దేశంలో వ్యాధి నిర్మూలించడంలో విఫలమైన ట్రంప్ ఇతరులపై తన తప్పును నెట్టడం మొదలుపెట్టారు.
ఇది ఎంతవరకు న్యాయం? అమెరికాలో గల పలు రాష్ట్రాల్లో రోజు రోజుకీ కరోనా వైరస్ కేసులు పెరగడం చూస్తున్నాం.
లక్షలాది జనం కొవిడ్-19కు గురికావడం, వేలాది మంది ప్రజలు మర ణించడం జరుగుతున్నది కూడా.
పలువురు రోగులు ఆసుపత్రు లలో, ఐసోలేషన్ సెంటర్స్‌లో, క్వారంటైన్ కేంద్రాల్లో నెలల తరబడి ఉండడాన్ని చూస్తే, అక్కడ భీతావహ వాతావరణం మనకు కళ్లకు కనబడుతుంది.
దానిని కప్పిపుచ్చుకునేందుకు ఇతర దేశాలపై డోనాల్డ్ ట్రంప్ ఆడిపోసుకోవడం ప్రారంభించా రు. ఇది ఏమంత క్షేమదాయకం కాదు.
ముందు తన దేశాన్ని రక్షించుకునేందుకు ప్రణాళికలు వేసుకోవాలి. వాటిని ఆచరణ మార్గంలోకి తీసుకురావాలి.
తన దేశంలో లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలుచేయాలి. ‘హూ మార్గదర్శకాలకు అనుగుణంగా ముందు కు పోవాలి. ఈ విషయంలో ఎటువంటి భేషజాలకు ట్రంప్ పోకూడదు. ఇతర దేశాలకు స్నేహ హస్తాన్ని అందించాలి. వారి సహాయ సహకారాలు అందుకోవాలి.
- పిల్లా తిరుపతిరావు
తాజా తెలంగాణ వార్తల కోసం :https://www.vaartha.com/telangana/