రెవెన్యూశాఖలో కనపడని డిజిటలైజేషన్‌

ఎక్కడ వేసిన గొంగళి అక్కడే!

తెలంగాణ ప్రభుత్వం వంద సంవత్సరాల తర్వాత భూమి యాజమాన్యపు హక్కులు, పాస్‌పుస్తకాలు 2020 చట్టాన్ని తీసుకువచ్చింది.ఎన్నో నెలలుగా ఉన్నతాధి కారులు కసరత్తు చేసిన తర్వాత ప్రభుత్వం ఈ చట్టాన్ని అమలులోకి తెచ్చింది. దేశంలోనే అత్యంత పారదర్శకమైన చట్టంగా ముఖ్యమంత్రి దీనిని అభివర్ణించారు. ప్రపంచవ్యాప్తంగా డిజిటలై జేషన్‌ రోజురోజుకు పెరిగిపోతుంది.

అలాగే కేంద్రప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వశాఖల్లో డిజిటలైజేషన్‌ రోజురోజుకు పెరిగి పోతుంది. నూతనమైన ఈ ప్రక్రియ అన్ని రంగాల్లో ఉన్నప్పటికీ రెవెన్యూశాఖలో మాత్రం డిజిటలైజేషన్‌ కార్యక్రమం లేదు. వందేళ్ల క్రితం నాటి వ్యవస్థ మొన్నటివరకూ అమలులో ఉండే ది. ఈ శాఖలో ఫైళ్లు అన్నీ మ్యానువల్‌ పద్ధతిలోనే నడిచేవి. దీంతో వీఆర్వో, తహశీల్దార్లు భూమి రికార్డులు మార్చివేయడం సులభంగా జరిగిపోయింది.

పహాణి నకలు మాత్రం ఆన్‌లైన్‌లో లభించేవి. ఈ శాఖ అవినీతిలో నెంబర్‌వన్‌గా నిలిచిపోయింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు మొదటిసారిగా ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పుడు ఏయేశాఖలో ఎంత అవినీతి ఉందనే దానిపై సర్వే జరిపించారు. రెవెన్యూశాఖ అగ్రస్థానంలో ఉందని సర్వేతేల్చి చెప్పింది. అయిన ప్పటికీ ఆ ప్రభుత్వం రెవెన్యూ ప్రక్షాళనకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు.

విజన్‌ 2020 తన లక్ష్యమని చెప్పుకున్న చంద్ర బాబునాయుడు రెవెన్యూలో సంస్కరణలు తీసుకురాలేకపోయా రు. ఆనాటి ప్రభుత్వం సంస్కరణలవైపు మొగ్గు చూపినట్లయితే ఈ రాష్ట్రంలో అమాయకులైన రైతులు చనిపోయేవారు కాదు. రెవెన్యూశాఖలో అవినీతి ఎలా ఉందంటే పహాణి నకళ్లను మీ సేవా కేంద్రాల ద్వారా ఇవ్వాలని గతంలో ప్రభుత్వం నిర్ణయిం చింది. లంచాలకు మరిగిన వీఆర్వో, తహశీల్దార్లు, ఆశాఖలోని బ్రోకర్లు మీ సేవా కేంద్రాలకు భూముల జాబితాను పంపేటప్పు డు విస్తీర్ణాన్ని తక్కువగా నమోదు చేసి పంపారు.

ఇది లంచాల కోసమే రెవెన్యూశాఖ అధికారులు ఆడిన నాటకం. మీ సేవా కేంద్రాల ద్వారా పహాణిలు తీసుకున్న రైతులు భూమి విస్తీర్ణం తక్కువగా నమోదు కావడంతో భయపడి వెంటనే వీఆర్వోలను ఆశ్రయించారు. ఎంతో కొంత డబ్బులు ముట్టచెప్పి తమ విస్తీర్ణా న్ని సరిగా ఉండేటట్లుగా లేటర్‌ తీసుకొని రావడం జరిగింది.ఆ సమయంలో వీఆర్వోలు డబ్బులు ముట్టచెప్పితే గానీ పనులు చేయలేదు.అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని చేప ట్టింది. రైతులంద రికీ డిజిటల్‌ పాస్‌ పుస్త కాలు అందచేసింది.

ఈ ప్రక్రియ రికార్డులను అనుసరించి పాస్‌పుస్తకాలు జారీ చేయాలని చెప్పింది. అయినప్పటికీ ఆ శాఖకు రైతులు ఇచ్చిన లంచాలు కోట్లరూపాయల్లోనే ఉన్నాయి. ఒక ప్రాజెక్టు నిర్మించినప్పుడు పెద్ద మొత్తంలో కమిషన్లు అధికా రుల చేతులు మారుతాయి అన్నసంగతి తెలిసిందే.

కానీ రెవెన్యూశాఖలోకూడా ఓ భారీ ప్రాజెక్టు లో ఎంత అవినీతి ఉందో రెవెన్యూ శాఖలోనే ప్రక్షాళన కార్యక్రమానికి కూడా అంతే చరిత్రఉంది.ప్రక్షాళన కోట్లాది రూపా యలు చేతులు మారడం జరిగింది. వీఆర్వోల నుంచి కలెక్టర్ల వరకు అందినంత దండుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో నిబంధ నలు రైతులకు అనుకూలంగా ఉన్నప్పటికీ నూతనంగా పాస్‌ పుస్తకాలు జారీ కావాల్సి ఉన్నప్పటికీ డబ్బులు తీసుకోలేక ఎల్‌ఇడిటీవిలు వాషింగ్‌మెషిన్లు స్మార్ట్‌ఫోన్లను నజరానాగా తీసు కొని పాస్‌ పుస్తకాలు ఇవ్వడం జరిగింది.

ప్రభుత్వం వికేంద్రీకరణ లో భాగంగా నూతన జిల్లాలను ఏర్పాటు చేసినప్పటికీ అక్కడ పనిచేసే కలెక్టర్లు చిన్నచిన్న భూమి వివాదాలను న్యాయమైన వాటిని పరిష్కరించకపోవడం జిల్లా కలెక్టర్ల వైఫల్యానికి నిదర్శ నమని చెప్పవచ్చు. కొత్త జిల్లాల ఏర్పాటు రెవెన్యూ సమస్యలను మాత్రం పరిష్కరించలేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. అన్ని విషయాలు పరిశీలించిన తరువాత తెలంగాణ ప్రభుత్వం నూతన చట్టాన్నితీసుకువచ్చి ధరణి పోర్టల్‌ను ఏర్పాటు చేసింది. ధరణి వేదికగా రెవెన్యూ పరిపాలనను నడపాలనినిర్ణయించింది.

పూర్తిస్థాయిలో డిజిటలైజేషన్‌ ప్రక్రియను ప్రారంభించారు. కానీ, రాష్ట్ర,క్షేత్రస్థాయిలో అనేక రెవెన్యూ సమస్యలు అలాగే ఉండి పోయాయి. దీనికి విరుగుడుగా ప్రభుత్వం సిటిజన్‌ చార్టర్‌ను రెవెన్యూలో తీసుకురావాలి. ప్రతీ సేవకు కాలవ్యవధిని నిర్ణయించాలి. నిర్ణీత కాలవ్యవధి ద్వారా ప్రతీరోజు జరిమానా చెల్లించే విధంగా నిబంధనలు తీసుకురావాలి.జరిమానా డబ్బులను సంబంధిత అధికారుల వేతనాల నుంచి ఆర్జీదారునికి చెల్లించేలా జీవో తీసుకురావాలి.

అప్పుడే నూతన రెవెన్యూ చట్టానికి పరి పూర్ణత ఏర్పడుతుంది.ప్రభుత్వం వెంటనే రెవెన్యూశాఖలో సిటి జన్‌ చార్టర్‌ను తీసుకురావాలి.అలాగేతెలుగు పదాలవాడ కాన్ని పెంచేలాచూడాలి. సమాచార హక్కుచట్టం రెవెన్యూశాఖలోఅమలు కావడంలేదు.ఆర్జీలు అధికారుల పేర్లు తహశీల్దార్‌కార్యాలయాల్లో అక్కడక్కడ మాత్రమే కన్పిస్తాయి.

ఇక భారీస్థాయి అవినీతి జరిగి నప్పుడు ఆర్టీఐ చట్టంద్వారా దరఖాస్తు చేసుకున్నప్పుడు చాలా తహశీల్దార్‌ కార్యాలయాల్లో30రోజుల్లోగా సమాచారం ఇవ్వడం లేదు. సహచట్టం కింద దరఖాస్తు చేసుకున్నప్పుడు ఆర్జీదారుల కు వారిచ్చే సమాధానం ఏమాత్రం సంతృప్తిగా లేదు.

  • సంపత్‌ గడ్డం

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/