జనవరి 31వ తేదీ వరకు ఎర్ర కోట మూసివేత

సందర్శకులకు నో ఎంట్రీ

Red Fort closes until January 31
Red Fort closes until January 31

New Delhi: ఎర్రకోటను ఈ నెల 31వ తేదీ వరకు వరకు మూసివేయ నున్నారు.  ఈ మేరకు  ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ)  ఒక ప్రకటనలో పేర్కొంది.

అయితే ఎర్రకోటను బర్డ్ ఫ్లూ కారణంగా  ఈ నెల 19 నుంచి 22 వరకు   మూసివేశారు.  గణతంత్ర వేడుకల సందర్భంగా 22 నుంచి 26 వరకు కూడా మూసివేస్తున్నట్టు ప్రకటించారు. 27వ తేదీ నుంచి ఎర్రకోట తెరుచుకుంటుందని పర్యాటకులు భావించారు. అయితే, 27వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఎర్రకోట మూసే ఉంటుందని ఏఎస్ఐ పేర్కొంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/