సిఎఎ టు ఎన్‌ఆర్‌సి వయా ఎన్‌పిఆర్‌?


సి ఎఎటు ఎన్‌ఆర్‌సి వయా ఎన్‌పిఆర్‌ పదాలు గందర గోళంగా ఉన్నాయి. వీటి వెనుక ఉన్న నేపథ్యాలు అస్పష్టంగా ఉన్నాయి. ప్రభుత్వాధికారుల మాటలకు అర్థాలు వేగంగా ఉన్నాయి. సామాన్య ప్రజలకు బోధపడేలా లేవ్ఞ. అభివృద్ధి కార్యక్రమాలకు ఎన్‌పిఆర్‌ (జాతీయ జనాభా పట్టిక) ఎలా ప్రాతిపదికవ్ఞతుంది.బహుష ప్రతి పౌరుడి బ్యాంకు ఖాతాలో 15లక్షలు జమ అయినట్టే ఉంటుంది. కేంద్రప్రభుత్వం తీసుకొస్తానంటున్న పౌరసత్వ చట్టం ప్రజలకు పౌరసత్వం ఇవ్వడానికేనని అనడం ఎందుకు? స్వతంత్ర భారతదేశంలో డెబ్భై రెండేళ్ల నుంచి భారత పౌరులుగా ఉంటున్న పౌరులకు కొత్తగా పౌరసత్వం ఏమిటి? బిజెపియేతర రాజకీయ పార్టీల నుంచి ప్రస్తుతం దేశానికి కేంద్రం స్వాతంత్య్రం కలిగిస్తున్నట్టా! 1947లో ఆంగ్లేయులతో విముక్తి పొందాక 2014 వరకు పరరాజకీయ పీడనలో ఉన్నామా? కేంద్రంలో ప్రభుత్వాన్ని చేపట్టాక ఈ దేశంలోని పౌరులు తాము పౌరులేనని నిరూపిం చుకోవాలా? మనదేశంలో పదేళ్లకొకసారి జరిపే సెన్సెస్‌ ఉండనే ఉందిగా. అది దేనికి ప్రమాణం కాదా? ఆ పట్టికలో పౌరుడి గురించిన సమాచారాలు చాలా వరకు నమోదవ్ఞతున్నాయి. దీన్ని విస్మరించి కొత్త కొత్త పోకడలతో 8500 కోట్ల రూపా యలు వ్యయం చేయడం అంటే బూడిదలో పోసిన పన్నీరు లాంటిదే! దేశంలో నివసించే ప్రతి ఒక్కసాధారణ నివాసి గుర్తిం పు వివరాలు సమగ్రంగా రూపొందించడమే ఎన్‌పిఆర్‌ ఉద్దేశం అయితే మరి సెన్సెస్‌ విషయం ఏమిటి? మొట్టమొదటి సమకాలీన జనాభా గణనను బ్రిటిష్‌ పాలనలో ఫిబ్రవరి 17, 1881న డబ్లు,సి.ఫోడెన్‌ భారత సన్సెస్‌ కమిషనర్‌ చేపట్టాడు. అప్పటి నుంచి ప్రతి పదేళ్లకోసారి జనాభా లెక్కలు నిరంతరా యంగా చేపడుతూనే ఉన్నాం. క్రమం తప్పకుండా అది వస్తూనే ఉంది. ఎవ్వరు దాన్ని వ్యతిరేకించలేదు. సిఎఎ,ఎన్‌ఆర్‌సికి వ్యతిరేకంగా దేశంలో జరుగుతున్న ర్యాలీలు, నిరసనలు ఇంకా విరమించుకోకముందే అగ్నిలో ఆజ్యం పోసినట్లు ఎన్‌పిఆర్‌ ప్రజల తలపై రుద్దడమేమిటి? ఎన్నార్సీ అమలుకు ఎన్‌పిఆర్‌ రూపాంతరం కాదా? సిఎఎ లౌకిక స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమని బుద్ధిజీవ్ఞలు నెత్తినోరు బాదుకుంటున్నారు. ఎన్నార్సీకి తొలి మెట్టు ఎన్‌పిఆర్‌. ఒకవేళ వందల సంఖ్యలో జొరబాటుదారులు మనదేశంలోకి వచ్చారని కోట్ల మంది భారతీయులు జీవితాన్ని నరకప్రాయం చేయడం అవసరమా? ఏదిఏమైనా సంవిధానం పరిరక్షణ మన కర్తవ్యం. అది మన గౌరవం. దాన్ని కాపాడుకోవాల్సిన కనీస బాధ్యత మనందరిది. ్ద