అంబేద్కర్ పట్ల నెహ్రూకు అయిష్టత?
‘వార్తల్లోని వ్యక్తి’ ప్రతి సోమవారం

నవ భారత రాజ్యాంగ రచనకు అంబేద్కర్‌ను ఆహ్వానించడం మొదట ఆనాటి ప్రధానికి ఇష్టం లేదా? మరి, ఎవరిని ఆహ్వానించాలని? మరి అప్పటి ఉపప్రధాని సర్దార్ వల్లభా§్‌ు పటేల్‌కు? మరి, వారికి ఎవరిపై ఇష్టం? సర్ ఐవర్ జెన్నింగ్స్‌పై? ఆయనెవరు? ఆయన బ్రిటిష్ రాజ్యాంగ సలహాదారు!
అంబేద్కర్‌పై నెహ్రూకు ఎందుకిష్టంలేదు?
అంబేద్కర్ మహామేధావి. ఆయనను కేంద్ర మంత్రివర్గంలోకి ఆహ్వానిస్తే, తనపై ప్రాధాన్యం వహిస్తాడని! అలాగే స్వదేశీ సంస్థానాల ఉద్యమ నాయకుడు డాక్టర్ పట్టాభిని న్యాయంగా కేంద్ర ఆర్థిక మంత్రిని చేయాలి!
అయితే ఆర్థికరంగంలో తనను ఆయన అధిగమిస్తాడేమోనని నెహ్రూకు సందేహం! ఈ ఇద్దరిని కేంద్ర ప్రభుత్వానికి దూరంగా ఉంచాలని, ఇతర విషయాలెలా వ్ఞన్నా, ఈ రెండు విషయాలలోను పటేల్,
నెహ్రులది ఏకాభిప్రాయం.
అయితే, జాతిపిత మహాత్మాగాంధీ అభిప్రాయం తెలుసుకోవాలిగా! పటేల్ నెహ్రూలిద్దరు మహాత్మాగాంధీని సందర్శించారు. నవభారత రాజ్యాంగ రచయితగా బ్రిటిష్ రాజ్యాంగ సలహాదారు సర్ ఐవర్ జంగ్స్‌ను నియమించాలని తమ అభిప్రాయంగా వారు ఆయనకు విన్నవించారు.
ఆ జాతిపిత విస్తుపోయారు!
మొన్నటివరకు మనం బ్రిటిష్ వారిని ఈ దేశం నుంచి తరిమివేయాలని పోరాడాం.’క్విట్ ఇండియా ఉద్యమం దేనికి? ఇప్పుడేమో తిరిగి బ్రిటిషర్‌నే మన రాజ్యాంగ రచయితగా ఆహ్వానిస్తామా? అది నగుబాటుకాదా?
అంబేద్కర్ ఉండగా..
‘మన భారతీయ మేధావే ఉండగా, బ్రిటిష్ వారు దేనికి? అంబేద్కర్ గొప్ప రాజ్యాంగవేత్త. ఆయన లండన్‌లోఉన్నపుడు అక్కడి లైబ్రరీలోని రాజకీయ, రాజ్యాంగ గ్రంథాలన్ని పుక్కిటపట్టాడు.
ఆయన చదవని రాజ్యాంగ గ్రంథమే లేదు.
ఆయన రాజ్యాంగ పరిజ్ఞానం అనితరసాధ్యం. ఆయనను నవభారత రాజ్యాంగ రచనకు ఆహ్వానించండి అని జాతిపిత ఉగ్గడించే సరికి ఆ ఉద్దండులిద్దరు మారు మాట్లాడలేదు!
విజయవాడ స్వరాజ్యమైదానంలో అత్యున్నతమైన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారన్నవార్త వినేసరికి ఈ విషయాలన్ని నా మనోవీధిలో మెదిలాయి!
అంబేద్కర్‌తో నా ఇంటర్ వ్యూ
1951 చివరలో నా జీవితంలో మరపురాని గర్వకారణమైన సంఘటన జరిగింది. అది నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్‌తో ఇంటర్‌వ్యూ. అప్పటికి రాజ్యాంగ రచన పూర్తి అయింది.
స్వతంత్ర భారత తొలి ప్రభుత్వంలోని తన న్యాయశాఖ మంత్రి పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు.
తూర్పుగోదావరి జిల్లాలో నిమ్నజాతుల మహాసభలో పాల్గొనడానికి వెడుతూ మార్గం మధ్యలో గన్నవరం ట్రావెలర్స్ బంగాలాలో ఆగారు. అప్పటికి నేను గన్నవరం విలేకరిని.
నవ భారత రాజ్యాంగ నిర్మాత గన్నవరం వస్తున్నారంటే ఇప్పటివలె అప్పట్లో తీవ్రమైన భద్ర తా ఏర్పాట్లు, పోలీసు హంగామా ఏమీ ఉండేవి కావు.
అందువల్లనే 1951 చివరలో నేను సాక్షాత్తు దేశ ప్రధాని నెహ్రును విజయవాడ రైలుస్టేషన్ లో సులభంగా కలుసు కుని, మాట్లాడగలిగాను.
బాబా సాహెబ్‌ను గన్నవరంలో కలుసుకుని, నన్నునేను పరిచయం చేసుకున్నాను. నవభారత రాజ్యాంగం ముసాయిదాను దాదాపు ఒంటరిగా రాసిన ఆయనను అభినందించాను. ఆయన ఒక నవ్ఞ్వ నవ్వారు.
మీరు రచించిన రాజ్యాంగం ప్రకారం జరిగే తొలి ఎన్నికల వరకైనా మీరు కేంద్రంలో న్యాయమంత్రిగా వుంటే బాగుండేది అని నేను అనగా కేంద్రం హిందూకోడ్‌లో తనకు నచ్చని అంశాలు ఉన్నాయని అన్నారు.
ఆ విషయంలో ప్రధానితో తనకు అభిప్రాయబేధా లున్నాయని, అందువల్లనే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయవలసి వచ్చిందని అన్నారు.
నవభారత రాజ్యాంగ రచన మిమ్మల్ని నెహ్రూకు సూచించిన జాతిపితకు దేశం కృతజ్ఞం గా వ్ఞండాలని నేను అనగా ఆయన ‘రాజ్యాంగ రచన పూర్తికాకుం డానే గాంధీజీ మృతి చెందడం దురదృష్టం.
ఆయన జీవితాంతం పోరాడిన అస్పృశ్యతను రాజ్యాంగంలో శిక్షార్హమని ప్రకటించడం, దాన్ని ఆదేశిక సూత్రాలలో చేర్చడం పట్ల ఆయన తన ఆనందాన్ని వ్యక్తం చేశారు అని బాబాసాహెబ్ అన్నారు.
‘రాజ్యాంగ పరిషత్తు ప్రథమ సమావేశం 1946 డిసెంబరులో జరిగింది. 1947లో ఒకప్రక్క రాజ్యాంగ రచన జరుగుతుండగానే స్వాతంత్య్ర ప్రదానం కూడా జరిగింది.
బాబా సాహెబ్ ఇక రాజోలు వెళ్లవలసి వుంది. అందువల్ల ఆయనకు ‘థాంక్స్ చెప్పి, నేను వచ్చేశాను.
- డాక్టర్ తుర్లపాటి కుటుంబ రావు, (‘పద్మశ్రీ’ అవార్డు గ్రహీత)
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/