ప్రాజెక్ట్ కె రెండు పార్టులుగా రాబోతోందా..?

ప్రస్తుతం సోషల్ మీడియా లో ఇదే హాట్ టాపిక్ అయ్యింది. మహానటి మూవీ తో దేశ వ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్ననాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా ప్రాజెక్ట్ కె మూవీ తెరకెక్కుతుంది.వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి.అశ్వినీదత్‌ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్​లో ప్రభాస్​కు జోడీగా దీపికా పదుకొణె నటిస్తుండగా , బాలీవుడ్ లెజెండ్ యాక్టర్ బిగ్ బి అమితాబ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ తాలూకా ఓ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ అవుతుంది. ఈ సినిమా ను నాగ్ అశ్విన్ రెండు పార్ట్శ్ గా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారట.దీనిపై మేకర్స్ నుండి అధికారిక ప్రకటన రానప్పటికీ , సోషల్ మీడియా లో మాత్రం తెగ వైరల్ అవుతుంది.

ఇక ప్రభాస్ మిగతా సినిమాల విషయానికి వస్తే..ఇప్పటికే ఆదిపురుష్ మూవీ షూటింగ్ ను పూర్తి చేసాడు ప్రభాస్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. అలాగే కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సలార్ చేస్తున్నాడు. దీంతో పాటు మారుతీ డైరెక్షన్లో రాజా డీలక్స్ అనే మూవీ చేస్తున్నాడు. ఇవన్నీ కూడా పాన్ ఇండియా మూవీస్ కావడం విశేషం.