కోవిడ్-19 ఆసుపత్రుల్లో ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన పోస్టులు
గుంటూరుజిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ జారీ

కమిషనర్ ఆఫ్ ఆరోగ్య, కుటంబ సంక్షేమ శాఖ అధికారి ఉత్తర్వుల ప్రకారం ఈ దిగువ నీయబడిన నియామకాలకు మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ప్రకారం కోవిడ్-19 ఆసుపత్రుల్లో పనిచేయుటకు కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన సంవత్సర కాలమునకు అన్‌లైన్ అప్లికేషన్ కోరడమైనదని గుంటూరు జిల్లా కలెక్టర్‌ప్రకటన విడుదల చేశారు.
మెయిన్ అడ్రస్: [email protected]
బయోడేటా ఫామ్,ధ్రువపత్రాలను 22.4.2020 లోగా సమర్పించాలని కోరారు. అభ్యర్థుల నుంచి భౌతికంగా దరఖాస్తులు స్వీకరించబడవని, కేవలం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీరించటం జరుగుతుందన్నారు. ఇంటర్వ్యూలను వీడియో కాల్ లేదా వాట్సాప్ కాల్ ద్వారానే నిర్వహించటం జరుగుతుందన్నారు.
పోస్టులు-ఖాళీలు-అర్హతలు-రెమ్యూనరేషన్ వివరాలు:
- ఎంఎన్‌ఒ -47-10వ తరగతిలేదా తత్సమానం-రూ.12,000,
- ఎఫ్‌ఎన్‌ఒ-40-10వ తరగతి లేదా తత్సమానం-రూ.12,000
- స్వీపర్-59-10వ తరగతి లేదా తత్సమానం-12,000
(పైమూడు రకాల పోస్టులు జౌట్‌సోర్సింగ్ ప్రాతిపదికన)
- అనస్తీషియా టెక్నీషియన్-10- డిప్లొమో ఇన్ అనస్తీషియా (రిజిస్టేషన్ ఇన్ ఎపి పారామెడికల్ బోర్డు) -23,100 (కాంట్రాక్ట్ ప్రాతిపదికన)
-
అభ్యర్థులు సమర్పించాల్సినవి - .బయోడేటా ఫారం
- 2.పదోతరగతి మార్కులలిస్టు
- 3.డిప్లొమో ఇన్‌అనస్తీషియా టెక్నాలజీ మార్కుల లిస్టు , ఎపి పారామెడికల్ బోర్డు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్
- 4 నాల్గవ తరగతి నుంచి పదో తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్
- 5.కులధ్రువీకరణ పత్రం
- 6. వికలాంగులు అయినచో సదరు ధ్రవీకరణ పత్రం .
- 7. ఎక్స్ -సర్వీస్‌మెన్, లేదా స్పోర్ట్ సర్టిఫికెట్
తాజా ‘నాడి’ వ్యాసాల కోసం :https://www.vaartha.com/specials/health1/